
India vs Sri Lanka, Asia Cup 2023: ఆసియా కప్ 2023లో అద్భుత ప్రదర్శన చేయడం ద్వారా భారత జట్టు ఫైనల్స్‌లో చోటు దక్కించుకుంది. సూపర్-4లో పాకిస్థాన్‌పై దుమ్మురేపి, ఆ తర్వాత శ్రీలంకను చితక్కొట్టిన టీమిండియా అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ బౌలర్లే ప్రత్యర్థి జట్టు వికెట్లు పడగొట్టి విజయాన్ని అందించారు. ఇందులో పాకిస్థాన్‌పై 5 వికెట్లు, శ్రీలంకతో మ్యాచ్‌లో 4 వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్ స్పిన్ మ్యాజిక్ కనిపించింది.
శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో గెలిచిన తర్వాత, కుల్దీప్ తన వికెట్ల క్రెడిట్‌ను కేఎల్ రాహుల్‌కు అందించాడు. శ్రీలంక బ్యాట్స్‌మెన్ సదీర సమరవిక్రమ బౌలర్ కుల్దీప్ వేసిన బంతిని ముందుకు ఆడేందుకు ప్రయత్నించి స్టంపౌట్ అయ్యాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్లు పడగొట్టడం ద్వారా కుల్దీప్ తన వన్డే కెరీర్‌లో 150 వికెట్లు కూడా పూర్తి చేసుకున్నాడు.
Kuldeep Yadav, India’s X factor, scalps a vital wicket! 💥
Backed by KL Rahul’s quick stumping 👐#KLRahul #KuldeepYadav #INDvsSL pic.twitter.com/mKFWnjRegY
— OneCricket (@OneCricketApp) September 12, 2023
శ్రీలంకపై గెలిచిన తర్వాత, బంతిని నాల్గవ లేదా ఐదవ స్టంప్ వైపు తిప్పడానికి ప్రయత్నించమని కేఎల్ భాయ్ నాకు సలహా ఇచ్చాడని, తద్వారా బంతిని తిప్పడానికి అవకాశం ఉందని బీసీసీఐ పోస్ట్ చేసిన వీడియోలో కుల్దీప్ చెప్పుకొచ్చాడు. సదీరా వికెట్‌ను కేఎల్‌కు అందించాలనుకుంటున్నాను అంటూ ప్రకటించాడు.
9 wickets in 24 hours!!! Kuldeep Yadav, the magician!#KuldeepYadav #INDvSL pic.twitter.com/5TjobI2AZ7
— Mohammad Kaif (@MohammadKaif) September 12, 2023
రాబోయే వన్డే ప్రపంచ కప్ 2023 గురించి మాట్లాడుతూ.. ఈ సమయంలో నేను నా బౌలింగ్ కంటే బ్యాటింగ్‌పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నాను. దీనికోసం నేను కూడా చాలా కష్టపడుతున్నాను. ప్రస్తుతం ప్రపంచకప్ వస్తోంది. అందులో నేను బ్యాటింగ్ చేయగలిగితే, బ్యాట్‌తో కూడా జట్టును గెలిపించే ప్రయత్నం చేయగలనని ఆశిస్తున్నాను అంటూ తెలిపాడు.
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (కీపర్), ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
శ్రీలంక (ప్లేయింగ్ XI): పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుసల్ మెండిస్(కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక(కెప్టెన్), దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, మతీషా పతిరనా.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..