AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA, 2nd Test Day 2, Highlights: సౌతాఫ్రికా 229 పరుగులకు ఆలౌట్‌.. భారత్ 2 వికెట్ల నష్టానికి 85 పరుగులు

టీమిండియా తన మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 202 పరుగులకు ఆలౌట్ అయింది. బదులుగా దక్షిణాఫ్రికా కూడా బ్యాటింగ్‌లో కష్టాలు పడుతోంది. తొలిరోజు ఆటముగిసే సమయానికి వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది.

IND vs SA, 2nd Test Day 2, Highlights: సౌతాఫ్రికా 229 పరుగులకు ఆలౌట్‌.. భారత్ 2 వికెట్ల నష్టానికి 85 పరుగులు
Ind Vs Sa
uppula Raju
| Edited By: Anil kumar poka|

Updated on: Feb 19, 2022 | 6:48 PM

Share

IND vs SA, 2nd Test Day 2, Live Score: భారత్, సౌతాఫ్రికా మధ్య జరగుతున్న రెండో టెస్ట్‌ రసవత్తరంగా సాగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు కోల్పోయి 85 పరుగులు చేసింది. సౌతాఫ్రికా కంటే 58 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఓపెనర్లు కెఎల్‌. రాహుల్‌ 8 పరుగులు, మయాంక్ అగర్వాల్‌ 23 పరుగులు త్వరగానే పెవిలియన్ చేరారు. క్రీజులో పూజారా 35 పరుగులు, రహానె 11 పరుగులతో నిలిచారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఓలివర్ 1, జాన్సన్ 1 వికెట్‌ సాధించారు.

అంతకు ముందు మొదటి ఇన్నింగ్స్‌లో ఓవర్‌ నైట్‌ స్కోరు 35 పరుగులతో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన సౌతాఫ్రికా మొదటి సెషన్‌లో మూడు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ డీన్‌ ఎల్గర్‌, పీటర్సన్‌ ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కెప్టెన్ డీల్ ఎల్గర్‌ జట్టు స్కోరు 88 పరుగుల వద్ద ఔటయ్యాడు. కానీ కీగన్‌ పీటర్సన్ హాఫ్ సెంచరీ సాధించాడు. 103 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 53 పరుగులు చేశాడు. కానీ డస్సెన్ ఒక పరుగుకే ఔటై నిరాశపరిచాడు.

తర్వాత క్రీజులోకి వచ్చిన టెంబా బావుమా జట్టుని ముందుండి నడిపించాడు. హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. 59 బంతుల్లో 6 ఫోర్లు 1 సిక్సర్‌తో 51 పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత వెరియానె 21, మార్కో జాన్సన్ 21, కేశరాజ్‌ మహారాజ్‌ 21 పరుగులతో రాణించడంతో జట్టు 229 పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లలో శార్దుల్‌ ఠాగూర్‌ ఏడు వికెట్లు సాధించాడు. మహ్మద్‌ షమి రెండు వికెట్లు దక్కాయి. జస్ర్పీత్ బుమ్రాకి ఒక వికెట్‌ దక్కింది.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 04 Jan 2022 09:05 PM (IST)

    రెండో రోజు ముగిసిన ఆట

    భారత్‌, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌ రెండో రోజు ఆట ముగిసింది. 35 పరుగులతో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన సౌతాఫ్రికా 229 పరుగులకు ఆలౌట్‌ అయింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ బ్యాటింగ్‌ చేపట్టిన భారత్ 2 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. క్రీజులో పూజారా 35 పరుగులు, రహానె 11 పరుగులతో నిలిచారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఓలివర్ 1, జాన్సన్ 1 వికెట్‌ సాధించారు. భారత్‌, సౌతాఫ్రికా కంటే 58 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.

  • 04 Jan 2022 08:50 PM (IST)

    రెండో వికెట్‌ కోల్పోయిన భారత్

    భారత్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. మయాంక్ అగర్వాల్‌ 23 పరుగులకు ఔటయ్యాడు. ఓలివర్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో భారత్‌ 2 వికెట్లకు 44 పరుగులు చేసింది.

  • 04 Jan 2022 08:06 PM (IST)

    తొలి వికెట్‌ కోల్పోయిన భారత్..

    భారత్ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో తొలి వికెట్‌ కోల్పోయింది. కెప్టెన్‌ కెఎల్‌. రాహుల్‌ 8 పరుగులకు ఔటయ్యాడు. దీంతో ఇండియా ఒక వికెట్ నష్టానికి 24 పరుగులు చేసింది. జాన్సన్‌ బౌలింగ్‌లో మాక్రమ్‌ క్యాచ్ పట్టాడు. క్రీజులోకి పూజారా వచ్చాడు.

  • 04 Jan 2022 07:39 PM (IST)

    బ్యాటింగ్‌ ప్రారంభించిన ఇండియా

    ఇండియా సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంబించింది. ఓపెనర్లుగా కెఎల్‌. రాహుల్‌, మయాంక్ అగర్వాల్ క్రీజులోకి వచ్చారు. సౌతాఫ్రికా 229 పరుగులకు ఆలౌట్‌ అయింది. కీగర్స్‌ పీటర్సన్, టంబా బావుమా హాఫ్ సెంచరీలతో రాణించారు.

  • 04 Jan 2022 07:27 PM (IST)

    సౌతాఫ్రికా 229 పరుగులకు ఆలౌట్‌

    సౌతాఫ్రికా 229 పరుగులకు ఆలౌట్‌ అయింది. భారత్‌ కంటే 27 పరుగుల ఆధిక్యం సాధించింది. భారత బౌలర్లలో శార్దుల్‌ ఠాగూర్‌ ఏడు వికెట్లు సాధించాడు. మహ్మద్‌ షమి రెండు వికెట్లు దక్కాయి. జస్ర్పీత్ బుమ్రాకి ఒక వికెట్‌ దక్కింది.

  • 04 Jan 2022 07:25 PM (IST)

    తొమ్మిదో వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా

    సౌతాఫ్రికా తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. జాన్సన్ 21 పరుగులకు ఔటయ్యాడు. శార్దుల్‌ ఠాగూర్‌ బౌలింగ్‌లో అశ్విన్ క్యాచ్‌ పట్టాడు. దీంతో సౌతాఫ్రికా తొమ్మిది వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. కాగా భారత బౌలర్లలోశార్దుల్‌ ఠాగూర్‌ ఆరు వికెట్లు సాధించాడు. మహ్మద్‌ షమికి రెండు వికెట్లు,జస్ర్పీత్ బుమ్రాకి ఒక వికెట్‌ దక్కింది.

  • 04 Jan 2022 07:08 PM (IST)

    ఎనిమిదో వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా

    సౌతాఫ్రికా ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. కేశవ్‌ మహారాజ్‌ 21 పరుగులకు ఔటయ్యాడు. బుమ్రా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. దీంతో సౌతాఫ్రికా ఎనిమిది వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. కాగా భారత బౌలర్లలోశార్దుల్‌ ఠాగూర్‌ ఐదు వికెట్లు సాధించాడు. మహ్మద్‌ షమికి ఒక వికెట్ దక్కింది. క్రీజులోకి ఓలివర్ వచ్చాడు.

  • 04 Jan 2022 06:19 PM (IST)

    టీ బ్రేక్ సమయానికి సౌతాఫ్రికా 191/7

    టీ బ్రేక్ సమయానికి సౌతాఫ్రికా 191/7గా నిలిచింది. కేశవ్ మహారాజ్ 11 పరుగులతో, జాన్సన్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్‌ కంటే ఇంకా 11 పరుగుల దూరంలో నిలిచింది. భారత బౌలర్లలో శార్దుల్‌ ఠాగూర్‌ ఐదు వికెట్లు సాధించాడు. మహ్మద్‌ షమికి ఒక వికెట్ దక్కింది.

  • 04 Jan 2022 06:01 PM (IST)

    ఏడో వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా

    సౌతాఫ్రికా ఏడో వికెట్‌ కోల్పోయింది. కాగిసో రబడ 0 పరుగులకు ఔటయ్యాడు. మహమ్మద్‌ షమి బౌలింగ్‌లో సిరాజ్ చక్కటి క్యాచ్ అందుకున్నాడు. దీంతో సౌతాఫ్రికా ఏడు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. భారత్‌ కంటే ఇంకా 23 పరుగుల దూరంలో నిలిచింది. కాగా భారత బౌలర్లలోశార్దుల్‌ ఠాగూర్‌ ఐదు వికెట్లు సాధించాడు. మహ్మద్‌ షమికి రెండు వికెట్లు దక్కాయి. క్రీజులోకి కేశవ్‌ మహారాజ్ వచ్చాడు.

  • 04 Jan 2022 05:52 PM (IST)

    టెంబా బావుమా ఔట్‌.. సౌతాఫ్రికా ఆరో వికెట్‌ డౌన్

    సౌతాఫ్రికా ఆరో వికెట్‌ కోల్పోయింది. టెంబా బావుమా 51 పరుగులకు ఔటయ్యాడు. శార్దుల్‌ ఠాగూర్‌ బౌలింగ్‌లో పంత్‌ క్యాచ్‌ తీసుకున్నాడు. దీంతో సౌతాఫ్రికా ఆరు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. భారత్‌ కంటే ఇంకా 25 పరుగుల దూరంలో నిలిచింది. కాగా భారత బౌలర్లలో శార్దుల్‌ ఠాగూర్‌ ఐదు వికెట్లు సాధించాడు. మహ్మద్‌ షమికి ఒక వికెట్ దక్కింది.

  • 04 Jan 2022 05:49 PM (IST)

    హాఫ్ సెంచరీ సాధించిన టెంబా బావుమా..

    టెంబా బావుమా హాఫ్ సెంచరీ సాధించాడు. 59 బంతుల్లో 6 ఫోర్లు 1 సిక్సర్‌తో 51 పరుగులు చేశాడు. దీంతో సౌతాఫ్రికా 5 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది.

  • 04 Jan 2022 05:44 PM (IST)

    ఐదో వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా

    సౌతాఫ్రికా ఐదో వికెట్‌ కోల్పోయింది. కైల్ వెరీన్ 21 పరుగులకు ఔటయ్యాడు. శార్దుల్‌ ఠాగూర్‌ బౌలింగ్‌లో ఎల్బీడబ్లుగా వెనుదిరిగాడు. దీంతో సౌతాఫ్రికా ఐదు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. భారత్‌ కంటే ఇంకా 40 పరుగుల దూరంలో నిలిచింది. కాగా భారత బౌలర్లలోశార్దుల్‌ ఠాగూర్‌ నాలుగు వికెట్లు సాధించాడు. మహ్మద్‌ షమికి ఒక వికెట్ దక్కింది. క్రీజులోకి మార్కో జాన్సన్ వచ్చాడు.

  • 04 Jan 2022 05:26 PM (IST)

    150 పరుగులు దాటిన సౌతాఫ్రికా

    సౌతాఫ్రికా 60.4 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 150 పరుగులు దాటింది. టెంబా బావుమా 28 పరుగులు, కైల్ వెరీన్ 19 పరుగులతో ఆడుతున్నారు. భారత్ కంటే సౌతాఫ్రికా 51 పరుగుల దూరంలో ఉంది. భారత బౌలర్లలో శార్దుల్‌ ఠాగూర్‌ మూడు వికెట్లు సాధించాడు. మహ్మద్‌ షమికి ఒక వికెట్ దక్కింది.

  • 04 Jan 2022 04:30 PM (IST)

    సెకండ్‌ సెషన్ ప్రారంభం

    సెకండ్‌ సెషన్ ప్రారంభమైంది. క్రీజులో టెంబా బావుమా 4 పరుగులు, కైల్ వెరీన్ 5 పరుగులతో ఆడుతున్నారు. భారత్‌ కంటే సౌతాఫ్రికా ఇంకా 91 పరుగుల దూరంలో నిలిచింది.

  • 04 Jan 2022 03:47 PM (IST)

    లంచ్‌ సమయానికి సౌతాఫ్రికా 102/4

    భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ రెండో రోజులో సౌతాఫ్రికా లంచ్ సమయానికి 4 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది. మొదటి సెషన్‌లో సఫారీలు 3 వికెట్లు చేజార్చుకున్నారు. కీగన్‌ పీటర్సన్ ఒక్కడే హాఫ్ సెంచరీ సాధించాడు. భారత బౌలర్లలో శార్దుల్‌ ఠాగూర్‌ మూడు వికెట్లు సాధించాడు. మహ్మద్‌ షమికి ఒక వికెట్ దక్కింది. భారత్‌ కంటే సౌతాఫ్రికా ఇంకా 100 పరుగుల దూరంలో నిలిచింది. క్రీజులో బావుమా ఉన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 202 పరుగులకు ఆలౌట్‌ అయిన సంగతి తెలిసిందే.

  • 04 Jan 2022 03:41 PM (IST)

    నాలుగో వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా

    సౌతాఫ్రికా నాలుగో వికెట్‌ కోల్పోయింది. డస్సెన్ 1 పరుగు చేసి ఔటయ్యాడు. శార్దుల్‌ ఠాగూర్‌ బౌలింగ్‌లో పంత్‌ క్యాచ్‌ తీసుకున్నాడు. దీంతో సౌతాఫ్రికా నాలుగు వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. భారత్‌ కంటే ఇంకా 100 పరుగుల దూరంలో నిలిచింది. కాగా భారత బౌలర్లలోశార్దుల్‌ ఠాగూర్‌ మూడు వికెట్లు సాధించాడు. మహ్మద్‌ షమికి ఒక వికెట్ దక్కింది.

  • 04 Jan 2022 03:25 PM (IST)

    మూడో వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా

    సౌతాఫ్రికా మూడో వికెట్‌ కోల్పోయింది. కీగన్‌ పీటర్సన్ 62 పరుగులకు ఔటయ్యాడు. శార్దుల్‌ ఠాగూర్‌ బౌలింగ్‌లో మయాంక్‌ క్యాచ్‌ తీసుకున్నాడు. దీంతో సౌతాఫ్రికా మూడు వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. భారత్‌ కంటే ఇంకా 101 పరుగుల దూరంలో నిలిచింది. కాగా భారత బౌలర్లలోశార్దుల్‌ ఠాగూర్‌ రెండు వికెట్లు సాధించాడు. మహ్మద్‌ షమికి ఒక వికెట్ దక్కింది. క్రీజులోకి తంబా బావుమా వచ్చాడు.

  • 04 Jan 2022 03:08 PM (IST)

    100 పరుగులు దాటిన సౌతాఫ్రికా

    సౌతాఫ్రికా 39.4 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 100 పరుగులు దాటింది. పీటర్సన్‌ 61 పరుగులు, డుస్సెన్ 0 పరుగులతో ఆడుతున్నారు. భారత్ కంటే సౌతాఫ్రికా 102 పరుగుల దూరంలో ఉంది.

  • 04 Jan 2022 03:06 PM (IST)

    హాఫ్ సెంచరీ చేసిన కీగన్‌ పీటర్సన్

    కీగన్‌ పీటర్సన్ హాఫ్ సెంచరీ సాధించాడు. 103 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 53 పరుగులు చేశాడు. మరోవైపు డుస్సెన్ 0 పరుగులతో ఆడుతున్నాడు. దీంతో సౌతాఫ్రికా 2 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. భారత్ కంటే ఇంకా 106 పరుగుల దూరంలో ఉంది.

  • 04 Jan 2022 03:03 PM (IST)

    రెండో వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా

    సౌతాఫ్రికా రెండో వికెట్‌ కోల్పోయింది. కెప్టెన్ డీన్ ఎల్గర్‌ 28 పరుగులకు ఔటయ్యాడు. శార్దుల్‌ ఠాగూర్‌ బౌలింగ్‌లో పంత్‌ క్యాచ్‌ పట్టాడు. దీంతో పెవిలియన్ చేరాడు. దీంతో సౌతాఫ్రికా రెండు వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. భారత్‌ కంటే ఇంకా 114 పరుగుల దూరంలో ఉంది. డుస్సేన్ క్రీజులోకి వచ్చాడు.

  • 04 Jan 2022 02:14 PM (IST)

    50 పరుగులు దాటిన సౌతాఫ్రికా

    ఓవర్‌ నైట్‌ స్కోరు 35 పరుగులతో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన సౌతాఫ్రికా ఒక వికెట్‌ నష్టానికి 50 పరుగులు దాటింది. క్రీజులో కెప్టెన్ డీన్ ఎల్గర్ 11 పరుగులు, కీగన్ పీటర్సన్ 28 పరుగులతో ఆట కొనసాగిస్తున్నారు. భారత బౌలర్లలో మహమ్మద్‌ షమికి ఒక్క వికెట్‌ దక్కిన విషయం తెలిసిందే. సౌతాఫ్రికా ఇంకా భారత్‌ కంటే 152 పరుగులు వెనుకబడి ఉంది.

  • 04 Jan 2022 01:34 PM (IST)

    IND vs SA Live Score: సిరాజ్ బౌలింగ్ చేస్తాడా?

    ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఫిట్‌నెస్‌పై భారత జట్టుకు సంబంధించిన పెద్ద ప్రశ్న నెలకొంది. సిరాజ్ తన చివరి ఓవర్‌లో తొడ కండరం సమస్య కారణంగా గత సాయంత్రం మైదానం నుంచి నిష్క్రమించాడు. రెండో రోజు రోజు బౌలింగ్ చేయడానికి వస్తాడా? లేదా అనేది చూడాలి. మ్యాచ్ ప్రారంభానికి ముందు, సిరాజ్ వార్మప్ చేస్తూ, బౌలింగ్ కూడా చేస్తూ కనిపించాడు.

    అదే సమయంలో, ఆట ప్రారంభానికి ముందు, రవిచంద్రన్ అశ్విన్ స్టార్ స్పోర్ట్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శుభవార్త చెప్పాడు. సిరాజ్ ఇంతకుముందు ఈ సమస్యతో ఇబ్బంది పడ్డాడని, అయితే అతను బౌలింగ్ చేయడానికి ఫిట్‌గా ఉన్నాడని తెలిపాడు.

  • 04 Jan 2022 01:32 PM (IST)

    IND vs SA Live Score: సిద్ధమైన భారత బౌలర్లు..

    జోహన్నెస్‌బర్గ్ టెస్టు రెండో రోజు భారత బౌలర్లకు చాలా కీలకం మారింది. మొదటి రోజు ముగిసే సమయానికి, దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 18 ఓవర్లు బౌలింగ్ చేసి కొన్ని అద్భుతమైన డెలివరీలు అందించింది. ఆటముగిసే సమయానికి 1 వికెట్ మాత్రమే పడగొట్టారు. నేడు దక్షిణాఫ్రికాను త్వరగా ఆలౌట్ చేసేందుకు భారత బౌలర్లు సిద్ధమయ్యారు.

Published On - Jan 04,2022 1:27 PM