IND vs SA: ప్రమాదంలో టీమిండియా స్టార్ ప్లేయర్ భవితవ్యం.. మూడో వన్డేతో కెరీర్‌కు గుడ్‌బై?

India vs South Africa: భారత జట్టులో మిడిల్ ఆర్డర్‌లో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ వంటి బలమైన బ్యాట్స్‌మెన్ ఉన్నారు. అతనితో పాటు యువ స్ట్రైకర్లు తిలక్ వర్మ, రింకూ సింగ్ కూడా మెరుస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శాంసన్ జట్టులో స్థానం నిలబెట్టుకోవాలంటే నేటి మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేయాల్సి ఉంది.

IND vs SA: ప్రమాదంలో టీమిండియా స్టార్ ప్లేయర్ భవితవ్యం.. మూడో వన్డేతో కెరీర్‌కు గుడ్‌బై?
Sanju Samson Ind Vs Sa 3rd
Follow us
Venkata Chari

|

Updated on: Dec 21, 2023 | 12:04 PM

South Africa vs India: ఈరోజు పార్ల్‌లోని బోలాండ్ పార్క్ స్టేడియంలో భారత్ వర్సెస్ సౌతాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ సిరీస్‌ నిర్ణయాత్మకం. 3 వన్డేల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. కాబట్టి, నేటి మ్యాచ్‌లో గెలిచిన జట్టు ట్రోఫీని కైవసం చేసుకుంటుంది. కాబట్టి, ఈ మ్యాచ్ టీమ్ ఇండియాకు కీలకం. అలాగే, ఓ భారత బ్యాటర్‌కి కూడా ఈ మ్యాచ్ ఎంతో కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లోనే రాణిస్తేనే, తదుపరి సిరీస్‌లకు అవకాశం ఉంటుంది. లేకపోతే, ఆ ప్లేయర్ కెరీర్‌ ప్రమాదంలో పడనుంది.

భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన సంజూ శాంసన్‌కు ఇదే చివరి అవకాశం. ఎందుకంటే, జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన తొలి వన్డేలో శాంసన్ బ్యాటింగ్ చేయలేదు. రెండో మ్యాచ్‌లో విఫలమయ్యాడు. మూడో వికెట్ పతనం తర్వాత క్రీజులోకి వచ్చిన శాంసన్ 27వ ఓవర్లో 23 బంతుల్లో 12 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.

ఇప్పుడు సిరీస్‌లో చివరి మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. జట్టులో స్థానం నిలబెట్టుకోవడానికి శాంసన్‌కి ఇదే చివరి అవకాశం. ఎందుకంటే, భారత జట్టులో మిడిలార్డర్‌లో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ లాంటి బలమైన బ్యాట్స్‌మెన్ ఉన్నారు. అతనితో పాటు యువ స్ట్రైకర్లు తిలక్ వర్మ, రింకూ సింగ్ కూడా మెరుస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శాంసన్ జట్టులో స్థానం నిలబెట్టుకోవాలంటే నేటి మ్యాచ్‌లో ప్రత్యేక ప్రదర్శన చేయాల్సి ఉంది.

సంజు వరుస వైఫల్యాలు..

శాంసన్ 2015లో టీ20 ఫార్మాట్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. కానీ, వరుసగా అవకాశాలు రావడం లేదు. ఒకటి లేదా రెండు మ్యాచ్‌ల తర్వాత పక్కన పెట్టాల్సిన పరిస్థితి వస్తోంది. అయితే, గత రెండు మూడేళ్లలో అతనికి అనేక అవకాశాలు వచ్చాయి. కానీ, వాటిని వినియోగించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు.

శాంసన్ గత 15 వన్డేల్లో 50 సగటుతో 402 పరుగులు చేశాడు. కానీ, ఈ ఏడాది అతను 3 ఇన్నింగ్స్‌ల్లో 72 పరుగులు మాత్రమే చేయగలిగాడు. మొత్తంగా, అతను 24 T20 మ్యాచ్‌లలో 19 సగటుతో 374 పరుగులు చేశాడు. ముఖ్యంగా 2023లో 6 ఇన్నింగ్స్‌ల్లో 78 పరుగులు మాత్రమే చేశాడు. అందువల్ల దక్షిణాఫ్రికాతో జరిగే మూడో మ్యాచ్ సంజూ శాంసన్‌కు చివరి అవకాశంగా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..