భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 1-1తో సమమైంది. సిరీస్‌లో 0-1తో వెనుకబడిన టీమిండియా గురువారం (డిసెంబర్ 14) జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో 106 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. తద్వారా సిరీస్‌ను సమం చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సెంచరీ కారణంగా 201 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆ తర్వాత ‘బర్త్‌డే బాయ్’ కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్‌ను కకావికలం చేశారు. ముఖ్యంగా ఐదు వికెట్లతో సౌతాఫ్రికా నడ్డి విరిచాడు కుల్‌దీప్. జడేజా కూడా రెండు వికెట్లు తీయడంతో సౌతాఫ్రికా 13.5 ఓవర్లలో కేవలం 95 పరుగులకే కుప్పకూలింది. దక్షిణాఫ్రికా జట్టులో డేవిడ్ మిల్లర్ (25 బంతుల్లో 35), కెప్టెన్ ఐడెన్ మర్కరమ్ (14 బంతుల్లో 25) మాత్రమే రాణించారు. మిగతా వారంతా సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. మెరుపు సెంచరీతో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్‌కు సూర్య కుమార్ యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు సిరీస్‌లో భారీగా పరుగులు చేసినందుకు ప్లేయర్ ఆఫ్ ది పురస్కారం కూడా లభించింది.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన భారత్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్‌లు తొలి రెండు ఓవర్లలో త్వరగా 29 పరుగులు జోడించి భారీ స్కోరుకు పునాది వేశారు. అయితే మూడో ఓవర్‌లోనే కేశవ్ మహారాజ్ వరుస బంతుల్లో శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మలను ఔట్ చేసి షాక్ ఇచ్చారు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ యశస్వితో కలిసి టీమిండియా స్కోరును పరుగులు పెట్టించాడు. యశస్వి ( 40 బంతుల్లో 61) అద్భుతంగాఆడిఅర్ధ సెంచరీ పూర్తి చేశాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన టీ20 అంతర్జాతీయ కెరీర్‌లో నాలుగో సెంచరీని నమోదు చేశాడు. తద్వారా రోహిత్ శర్మ, గ్లెన్ మాక్స్‌వెల్ రికార్డులను సమం చేశాడు. ఆ తర్వాత బౌలింగ్ లోనూ భారత్ కు శుభారంభం లభించింది. మహ్మద్ సిరాజ్ వేసిన తొలి ఓవర్ మెయిడెన్ కాగా, రెండో ఓవర్ లోనే ముఖేష్ కుమార్ మాథ్యూ బ్రిట్జ్కే బౌలింగ్ చేశాడు. దీని తర్వాత వికెట్లు వేగంగా పడిపోవడంతో 10వ ఓవర్‌కు 75 పరుగులకే 5 సగం దక్షిణాఫ్రికా జట్టు పెవిలియన్‌కు చేరుకుంది. ఆ తర్వాత కుల్‌దీప్, జడేజా మరింత విజృంభించడంతో 20 పరుగుల వ్యవధిలో మిగతా 5 వికెట్లు కూడా కూలిపోయాయి.
సూర్య కెప్టెన్సీ ఇన్నింగ్స్..
For his captain knock, @surya_14kumar receives the Player of the Match award 👏#TeamIndia won by 106 runs and levelled the series 1-1
Scorecard ▶️ https://t.co/NYt49KwF6j#TeamIndia | #SAvIND pic.twitter.com/iKctocW6tu
— BCCI (@BCCI) December 14, 2023
An indeed Happy Birthday 🎂@imkuldeep18 records his first 5 wicket haul in T20Is 👏
Follow the match ▶️ https://t.co/NYt49KwF6j#TeamIndia | #SAvIND pic.twitter.com/ZqMZNbjlQv
— BCCI (@BCCI) December 14, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..