IND vs SA Final: అదే జరిగితే రోహిత్ సముద్రంలో దూకాల్సిందే.. టీ20 ప్రపంచకప్‌ ఫైనల్ ముందు గంగూలీ సంచలన కామెంట్స్

|

Jun 29, 2024 | 5:11 PM

టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన టీమ్ ఇండియా ఇప్పుడు ఫైనల్ మ్యాచ్‌కు సిద్ధమైంది. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో శనివారం (జూన్ 29) జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో భారత్, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంటామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

IND vs SA Final: అదే జరిగితే రోహిత్ సముద్రంలో దూకాల్సిందే.. టీ20 ప్రపంచకప్‌ ఫైనల్ ముందు గంగూలీ సంచలన కామెంట్స్
Ind Vs Sa Final
Follow us on

టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన టీమ్ ఇండియా ఇప్పుడు ఫైనల్ మ్యాచ్‌కు సిద్ధమైంది. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో శనివారం (జూన్ 29) జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో భారత్, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంటామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఒక వేళ ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోతే? ఈ ప్రశ్నకు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సరదా సమాధానం ఇచ్చాడు. భారత జట్టు ప్రపంచకప్ గెలుస్తుందన్న నమ్మకంతో ఉందని, ఈసారి ఓడిపోయే ప్రశ్నే లేదని గంగూలీ కూడా ధీమాగా ఉన్నాడు. ‘రోహిత్ శర్మ కేవలం ఆరు నెలల్లో రెండు ప్రపంచకప్ ఫైనల్స్‌లో ఓడిపోతాడని నేను అనుకోను. ఈసారి భారత జట్టు ఓడిపోతే.. మాత్రం రోహిత్ శర్మ బార్బడోస్ సముద్రంలో దూకాల్సిందే’ అని గంగూలీ చమత్కరించాడు. ‘ టీమ్ ఇండియా ఓడిపోవాలనే ఆలోచన ఇక్కడ లేదు. ఎందుకంటే టోర్నీ ఆద్యంతం భారత ఆటగాళ్లు మంచి ప్రదర్శన చేశారు. ఇప్పుడు ఫైనల్స్‌లోనూ మరింత అద్భుతంగా ఆడతారని నమ్ముతున్నాను. అలాగే టీమ్ ఇండియా గెలవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా రోహిత్ శర్మ ప్రపంచకప్‌ను కైవసం చేసుకోవాలని కోరుకుంటున్నాను’ అని సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చాడు.

గత 11 ఏళ్లలో భారత జట్టు ఏ ఐసీసీ ట్రోఫీని గెలవలేదు. చివరిసారిగా 2013లో చాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న టీమ్ ఇండియా.. ఆ తర్వాత ఎన్నో ఫైనల్స్ ఆడినా ప్రపంచకప్ మాత్రం కలగానే మిగిలిపోయింది. 2014లో టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో పరాజయం పాలైన టీమ్ ఇండియా.. గతేడాది నవంబర్ లో వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఫైనల్లోకి అడుగుపెట్టింది. అయితే ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోవడంతో ప్రపంచకప్‌ను గెలుచుకునే అవకాశాన్ని కోల్పోయింది. ఇప్పుడు పదేళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా మరోసారి ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఈ క్రమంలోనే ఈసారి భారత జట్టు ఛాంపియన్‌గా నిలుస్తుందని సౌరవ్ గంగూలీ ధీమా వ్యక్తం చేశాడు.

ఇవి కూడా చదవండి

భారత ప్రాబబుల్ ప్లేయింగ్ 11: రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, జప్రీత్ బుమ్రా.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..