IND vs SA: ఐపీఎల్‌లో యార్కర్ల తుఫాన్.. కట్‌చేస్తే.. సఫారీలకు షాక్ ఇచ్చేందుకు సిద్ధం.. ఆ డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ ఎవరంటే?

|

Jun 07, 2022 | 9:24 AM

జూన్ 9 నుంచి భారత్-దక్షిణాఫ్రికా మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు పంజాబ్ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ ఎంపికైన సంగతి తెలిసిందే. జట్టులో అర్ష్‌దీప్‌ ఒక్కడే ఎడమచేతి వాటం పేసర్‌ కావడం విశేషం.

IND vs SA:  ఐపీఎల్‌లో యార్కర్ల తుఫాన్.. కట్‌చేస్తే.. సఫారీలకు షాక్ ఇచ్చేందుకు సిద్ధం.. ఆ డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ ఎవరంటే?
Arshdeep Singh
Follow us on

ఐపీఎల్ 2022(IPL 2022) సీజన్ ముగిసింది. ఆశలు పెట్టుకున్న టీమిండియా సీనియర్ ప్లేయర్లు నిరాశ పరిస్తే, ఏమాత్రం హోప్స్ లేని జూనియర్లు మాత్రం ఇరగదీశారు. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో సత్తా చాటి, ఏకంగా భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం దక్కించుకున్నారు. ఇందులో ముఖ్యంగా అర్షదీప్ సింగ్(Arshdeep Singh), ఆయుస్ బదోని, ఉమ్రాన్ మాలిక్ లాంటి సరికొత్త ఆటతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) గత రెండు ఎడిషన్లలో పంజాబ్ కింగ్స్ యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఆకట్టుకున్నాడు. తాజా ఎడిషన్‌లో లెఫ్ట్ ఆర్మ్ సీమర్ తన ఆటను పూర్తిగా ఆస్వాదించాడు. ఇక దక్షిణాఫ్రికాతో జరిగిన 5 T20Iలకు భారత జట్టుల్లో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యాడు.

కాగా, ఇంతకుముందు సీనియర్ జట్టుకు అర్ష్‌దీప్‌ ఎంపికయ్యాడు. 2021లో నెట్ బౌలర్‌గా శ్రీలంకకు వెళ్లాడు. ప్రస్తుతం, ఆ ఎడమచేతి వాటం పేసర్‌ ప్రదర్శనపై టీమిండియా కూడా ఎన్నో ఆశలు పెట్టుకుంది. జట్టులో ఇప్పటికే ఎంపికైన కొంతమంది లెఫ్ట్ ఆర్మ్ బౌలర్లు గాయాలు, ఫాం లేమితో అందుబాటులో లేకుండా పోయారు. దీంతో ప్రస్తుతం ఈ బౌలర్‌పైనే హోప్స్ ఉన్నాయి. అర్షదీప్ తన యార్కర్లతో బ్యాట్స్‌మెన్లను ముప్పతిప్పలు పెడుతూ, మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నాడు. సీనియర్లు సత్తా చాటని చోట.. తన అద్భుతమైన యార్కర్లతో ఆకట్టుకుంటూ.. టీమిండియాలో తన స్థానానికి మార్గం పరుచుకున్నాడు. ఇక అందుకు వేదికైన ఐపీఎల్ 2022లో అత్యంత విశ్వసనీయమైన డెత్ బౌలర్‌గా మారాడు.

పంజాబ్ కింగ్స్ రిటైన్ చేసిన తర్వాత, అర్ష్‌దీప్ అత్యుత్తమ ‘డెత్ ఓవర్’ బౌలర్‌లలో ఒకడిగా నిరూపించుకోవడంలో విజయవంతమయ్యాడు. 7.58 ఎకానమీ రేట్‌తో పరుగులు ఇస్తూ, పొదుపైన బౌలింగ్ సంధించాడు. ఐపీఎల్ 2022లో యార్కర్లను వేయడంలో బుమ్రా(38)తో కలిపి అర్షదీప్ సంయుక్తంగా నిలిచాడు. ఈ పంజాబ్ పేసర్ 14 మ్యాచ్‌లలో 7.70 ఎకానమీ రేటుతో 10 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు 2021 ఐపీఎల్‌లో అతను 18 బ్యాటర్లను పెవిలియన్ చేర్చాడు.

ఇవి కూడా చదవండి

అనుభవజ్ఞులైన నిపుణులు తమ వ్యాపారాన్ని ఎలా సాగిస్తున్నారో దగ్గరి నుండి చూసిన అనుభవం నుండి అతను చాలా సంపాదించాడు. ఆపై IPL 2022లో బంతిని చర్చనీయాంశంగా మార్చారు. ఎక్స్‌ప్రెస్ పేసర్లు వారి క్రూరమైన పేస్‌తో ముఖ్యాంశాలను తాకినప్పుడు, అర్ష్‌దీప్ యార్కర్లను బౌలింగ్ చేయడంలో మరింత ఖచ్చితమైనది, లాభదాయకమైన T20 టోర్నమెంట్‌లో అత్యంత విశ్వసనీయమైన డెత్ బౌలర్‌లలో ఒకరిగా మారాడు.

ఈ సందర్భంగా న్యూస్9స్పోర్ట్స్‌తో అర్షదీప్ మాట్లాడుతూ, “నేను ప్రస్తుతం ఎంతో నిలకడగా ఉన్నాను. ఇది నాకు మంచి సీజన్. ఏ రోజునైనా జట్టు గెలవాలనే నేను కోరుకుంటాను. యార్కర్లను మరింతగా సంధించేందుకు కష్టపడతాను. నాకు చక్కని అవకాశం ఇచ్చిన మయాంక్ అగర్వాల్, పంజాబ్ టీమ్ మేనేజ్‌మెంట్‌కి ధన్యవాదాలు” అని తెలిపాడు.

భారీ షాట్లకు బ్యాటర్లు ప్రయత్నించినప్పుడు, తెలివిగా యార్కర్లను సంధించడంలో నేర్పరిగా మారాడు. ఇదే సామర్థ్యం మాజీ ప్లేయర్లకు ఎంతగానో నచ్చింది. మ్యాచ్ ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా.. ఒత్తిడి వేధిస్తోన్నా.. కూల్‌గా యార్కర్లను సంధిస్తూ దూసుకపోతుండడంతో, ఈ 23 ఏళ్ల పేసర్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది.

IPL 2022లో 23 వికెట్లు (మూడవ అత్యధికం) పడగొట్టిన దక్షిణాఫ్రికా అంతర్జాతీయ ఆటగాడు కగిసో రబడాతో అర్ష్‌దీప్ ప్రమాదకరమైన జోడీగా నిరూపించుకున్నాడు. టోర్నమెంట్ సమయంలో ఈ భారత పేసర్ నాణ్యతపై దక్షిణాఫ్రికా పేసర్ ప్రశంసలు కురిపించాడు.

“కగిసో రబడాతో బౌలింగ్ విభాగాన్ని పంచుకోవడం చాలా గొప్ప విషయం. అతనితో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవడం, బౌలింగ్‌లో టిప్స్ అందుకోవడం నాకు కెరీర్ పరంగా ఎంతో సహయం కానుంది. ఆత్మవిశ్వాసాన్ని ఎంతో పెంచింది. మరింత మెరుగ్గా రాణించేందుకు ప్రేరేపిస్తుంది” అని అర్ష్‌దీప్ చెప్పుకొచ్చాడు.

అలాగే అర్షదీప్.. భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ నుంచి ఎంతో నేర్చుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. అదే సమయంలో దక్షిణాఫ్రికాపై తన తొలి ట్రోఫీని అందుకోవాలని ఆశిస్తున్నాడు.

“రాహుల్ సర్ (ద్రవిడ్) ఎప్పుడూ నన్ను నిలదొక్కుకోమని, నా ప్రదర్శనపై దృష్టి పెట్టమని చెబుతుంటాడు. నేను అతని చిట్కాల కోసం ఎదురు చూస్తున్నాను. చివరిసారి శ్రీలంకలో, నేను పరాస్ సర్ (మాంబ్రే, బౌలింగ్ కోచ్)తో కలిసి కొన్ని సాంకేతిక విషయాలపై పనిచేశాను. ఇప్పుడు సౌతాఫ్రికాకు వ్యతిరేకంగా నేను నా బౌలింగ్‌ని చక్కగా అమలు చేస్తానా లేదా అనేది చూడాలి. నీలిరంగు జెర్సీని ధరించడానికి సంతోషిస్తున్నాను” అని అర్ష్‌దీప్ ముగించాడు.