ఆస్ట్రేలియాతో మూడు వన్డేల టీ20 సిరీస్‌ను 2-1తో గెల్చుకున్న టీమిండియా సఫారీలతో సమరానికి సిద్ధమైంది. మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు కేరళలోని త్రివేండ్రంలో మొదటి మ్యాచ్ జరగనుంది. కాగా ఈ మ్యాచ్‌కోసం త్రివేండ్రం చేరుకున్న భారత ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది. కాగా తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ మైదానం వద్ద టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీల భారీ కటౌట్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. గ్రీన్ ఫీల్డ్ మైదానానికి వెళ్లేదారిలో మంగళవారం ఉదయం అభిమానులు కోహ్లీ భారీ కటౌట్ పెట్టారు. ఆ కటౌట్ దాదాపుగా 100 అడుగులు ఉంటుంది. అదేవిధంగా ఆల్ కేరళ రోహిత్ శర్మ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హిట్ మ్యాన్ భారీ కటౌట్‌ను ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోను ట్విటర్‌లో షేర్ చేస్తూ.. దైవభూమి హిట్‌మ్యాన్‌కు స్వాగతం పలుకుతోంది అని క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం రోహిత్ , కోహ్లీల కటౌట్‌లు ప్రతిఒక్కరిని ఆకర్షిస్తున్నాయి. నెట్టింట్లోనూ ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి.
ఇదిలా ఉంటే.. స్థానిక బ్యాటర్ సంజూ శాంసన్‌కు టీ20 వరల్డ్‌కప్‌లో చోటు దక్కలేదు. దీంతో టీమిండియా మేనేజ్‌మెంట్, కెప్టెన్ రోహిత్ శర్మపై సంజూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ట్యాలెంట్ ఉన్నా సంజూకు ఎందుకు ఛాన్సులు ఇవ్వడం లేదంటూ నెట్టింట పోస్టులు పెట్టారు. ఈ విషయంపై బుధవారం నాటి మ్యాచ్ సందర్భంగా నిరసన తెలియజేసేందుకు సిద్ధమయ్యారంటూ వార్తలు వచ్చాయి. అదే సమయంలో రోహిత్ కటౌట్లు ఏర్పాటుచేయడం చర్చనీయాంశమవుతోంది. కాగా దక్షిణాఫ్రికాతో సిరీస్‌లోనూ సంజూకు జట్టులో స్థానం దక్కలేదు. అయితే, న్యూజిలాండ్-ఏ జట్టుతో స్వదేశంలో జరిగిన అనధికారిక వన్డే సిరీస్‌కు సారథిగా వ్యవహరించాడు ఈ కేరళ స్టార్ బ్యాటర్. చెన్నై వేదికగా మంగళవారం జరిగిన మూడో వన్డేలో హాఫ్ సెంచరీతో మెరిసి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాగా ఈ సిరీస్‌లో భారత- ఏ జట్టు కివీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం విశేషం.
Face of world cricket ????? pic.twitter.com/1NQnaxzqiX
— jack-Ahmed.hitman (@fatherofbola) September 27, 2022
And that’s how we welcomes The Hitman to the God’s Own Country ??@ImRo45 #RohitSharma pic.twitter.com/ECsMFhx6FC
— ALL KERALA ROHIT SHARMA FANS ASSOCIATION (@AKRSFAOfficial) September 27, 2022