IND vs PAK: పవర్ ప్లే నుంచి ఫినిషింగ్ వరకు.. అడుగడుగునా ప్రమాదాలే.. చిక్కితే పాక్ జట్టుకు పంక్చర్‌లే

|

Jun 09, 2024 | 2:32 PM

Indian Bowlers Record vs Pakistan: ఈరోజు T20 ప్రపంచ కప్ 2024 లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య అతిపెద్ద మ్యాచ్ జరగనుంది. న్యూయార్క్‌లోని కొత్త స్టేడియంలో నిర్వహించే ఈ మ్యాచ్ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు కొత్త మైదానంలోని కొత్త పిచ్‌లపై బ్యాట్స్‌మెన్స్ నిరంతరం కష్టపడుతున్నారు.

IND vs PAK: పవర్ ప్లే నుంచి ఫినిషింగ్ వరకు.. అడుగడుగునా ప్రమాదాలే.. చిక్కితే పాక్ జట్టుకు పంక్చర్‌లే
Team India
Follow us on

Indian Bowlers Record vs Pakistan: ఈరోజు T20 ప్రపంచ కప్ 2024 లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య అతిపెద్ద మ్యాచ్ జరగనుంది. న్యూయార్క్‌లోని కొత్త స్టేడియంలో నిర్వహించే ఈ మ్యాచ్ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు కొత్త మైదానంలోని కొత్త పిచ్‌లపై బ్యాట్స్‌మెన్స్ నిరంతరం కష్టపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్-పాక్ మ్యాచ్‌లో బౌలర్లు సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు బౌలర్లు మెరుగ్గా రాణిస్తే అది విజయానికి దగ్గరగా ఉంటుంది. ప్రస్తుత భారత బౌలర్ల గురించి చెప్పాలంటే, పాకిస్థాన్‌తో గత కొన్ని మ్యాచ్‌ల్లో వారు మంచి ప్రదర్శన చేశారు.

పాకిస్థాన్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ప్రస్తుత భారత బౌలర్ల ప్రదర్శన..

జస్ప్రీత్ బుమ్రా..

టీమ్ ఇండియా అత్యంత ప్రమాదకరమైన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా పాకిస్థాన్‌తో ఇప్పటివరకు 2 టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడాడు. 2016 సంవత్సరంలో, అతను పాకిస్తాన్‌పై 4 ఓవర్లలో 32 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. అయితే, 5 సంవత్సరాలకు ముందు జరిగిన టీ20 ప్రపంచ కప్ 2021లో, బుమ్రా 3 ఓవర్లలో 32 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.

అర్ష్దీప్ సింగ్..

అర్ష్‌దీప్ సింగ్ తన ఏకైక T20 ప్రపంచ కప్ మ్యాచ్‌ను పాకిస్తాన్‌తో ఆడాడు. గత ప్రపంచ కప్‌లో అతను అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అర్ష్దీప్ సింగ్ 4 ఓవర్లలో 32 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. అందులో బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్, ఆసిఫ్ అలీ పేర్లు ఉన్నాయి.

అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా..

టీమిండియా ఇద్దరు ప్రధాన స్పిన్నర్లు, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, పాకిస్తాన్‌పై సగటు రికార్డును కలిగి ఉన్నారు. జడేజా ఇప్పటివరకు పాకిస్థాన్‌తో 3 ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను కేవలం 2 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. అయితే, అక్షర్ పటేల్ ఇప్పటివరకు కేవలం 1 మ్యాచ్‌లో మాత్రమే పాల్గొన్నాడు. అతను 1 ఓవర్‌లో 21 పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు.

హార్దిక్ పాండ్యా..

పాకిస్థాన్‌పై ప్రస్తుత బౌలర్లలో హార్దిక్ పాండ్యా రికార్డు అత్యుత్తమంగా ఉంది. హార్దిక్ పాకిస్తాన్ జట్టుతో 3 T20 ప్రపంచ కప్ మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 2 సార్లు బౌలింగ్ చేసి నాలుగు కీలక వికెట్లు పడగొట్టాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..