బుధవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతోన్న సెమీఫైనల్‌లో భారత ఆటగాడు విరాట్ కోహ్లీ వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు.
విరాట్ 2023 ఎడిషన్‌లో గ్లెన్ ఫిలిప్స్‌పై సింగిల్ తీసి సచిన్ సాధించిన 673 పరుగుల మార్క్‌ను అధిగమించాడు.
అంతకుముందు మ్యాచ్‌లో, 35 ఏళ్ల కోహ్లీ ఒకే ప్రపంచకప్‌లో 600+ పరుగులు చేసిన మూడో భారతీయ బ్యాటర్‌గా నిలిచాడు.
విరాట్ కోహ్లీ (IND) – 674* (2023)
సచిన్ టెండూల్కర్ (IND) – 673 (2003)
మాథ్యూ హేడెన్ (AUS) – 659 (2007)
రోహిత్ శర్మ (IND) – 648 (2019)
డేవిడ్ వార్నర్ (AUS) – 647 (2019)
ఇది ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్‌లో కోహ్లీకి ఎనిమిదో హాఫ్ సెంచరీ + నాక్. టోర్నమెంట్‌లో ఒకే ఎడిషన్‌లో ఇప్పటివరకు ఎవరూ చేయలేని విధంగా దూసుకపోతున్నాడు. గతంలో సచిన్ (2003), బంగ్లాదేశ్‌కు చెందిన షకీబ్ అల్ హసన్ (2019) సంయుక్తంగా కలిగి ఉన్న ఏడు 50+ నాక్‌ల రికార్డును అధిగమించాడు.
నేటి మ్యాచ్‌లో భారత నం.3 బ్యాటర్ అత్యధిక ODI పరుగుల్లో ఆస్ట్రేలియాకు చెందిన రికీ పాంటింగ్‌ను అధిగమించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..