Watch Video: వింటర్‌లో ‘సూర్యాస్’ సమ్మర్.. బాప్‌రే ఇవేం షాట్లంటూ ప్రత్యర్థుల పరేషాన్..

Suryakumar Yadav: ప్రత్యర్దులతెవరైనా సరే.. ఆ బ్యాట్ లోంచి సూర్య కిరణాల వాడి వేడి తగ్గట్లా.. బాల్ వేసిన వెంటనే బౌలర్లు ఇతర ఫీల్డర్లకు పనే ఉండదు.. ఎందుకంటే.. అది అందనంత ఎత్తులో ఎటు వైపు వెళ్తుందో చూడడమే పని.

Watch Video: వింటర్‌లో 'సూర్యాస్' సమ్మర్.. బాప్‌రే ఇవేం షాట్లంటూ ప్రత్యర్థుల పరేషాన్..
Ind Vs Nz 3rd T20i Suryakumar Yadav
Venkata Chari

|

Nov 21, 2022 | 1:27 PM

టీ20- ఎరాలో సరి కొత్త శకం. అదే సూర్యా శకం. న్యూజిల్యాండ్ తో జరిగిన సెకెండ్ టీ20లో సూర్యకుమార్ యాదవ్ తన రెండో టీ ట్వంటీ తుఫాన్ వేగంతో సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సందర్భంలో న్యూజిలాండ్ టీం సారథి కేన్ విలియమ్సన్ మాట్లాడుతూ.. తాను చూసిన ఇన్నింగ్స్ లోనే ద బెస్ట్ అంటూ ఆకాశానికి ఎత్తేశాడు. ఇలాంటి షాట్లు గతంలో తాను చూడలేదంటూ చెప్పుకొచ్చాడు. సూర్యకుమార్ ఊచకోత ఎలా సాగిందో చెప్పాలంటే కేన్ మామ మాటలను బట్టి చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. సూర్యకుమార్ యాదవ్ బ్యాట్ నుంచి జాలువారుతున్నవి షాట్లు కావు.. కళ్లు మిరుమిటగ్లు గొలిపే విన్యాసాలంటూ ప్రశంసల వర్షం కురుస్తోంది. సూర్యకుమార్ 360 డిగ్రీస్ బ్యాటింగ్ తో వరల్డ్ వైడ్ గా ఉన్న క్రికెట్ లవర్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు.

ఇటీవల ముగిసిన టీ 20 వరల్డ్ కప్ లో సెమీస్ షాక్ నుంచి ఇంకా బయట పడని టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ కి ఊరటనిచ్చే అంశమేంటంటే.. సూర్య కుమార్ బ్యాట్ నుంచి వెలువడ్డ.. ఈ స్పెషల్ ఇన్నింగ్సే.. సెమీస్ లో చేతులెత్తేసి.. ఇక క్రికెట్టే చూడకూడదని ఫిక్సయిన వాళ్లు కూడా.. తిరిగి టీవీ సెట్లకు కళ్లప్పగించేలా చేస్తున్నాడు సూర్యకుమార్ యాదవ్.

న్యూజిల్యాండ్ సీరిస్ లో ఫస్ట్ టీ20 వర్షార్పణం కాగా.. సెకంట్ టీట్వంటీలో సూర్యా 51 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సులతో 111 రన్స్ చేసి అద్దరగొట్టేశాడు. జట్టు స్కోరును 191లకు చేర్చాడు. 192 టార్గెట్ తో బరిలోకి దిగిన న్యూజిల్యాండ్ టీంలో ఒక్క విలియమ్సన్ తప్ప.. మిగిలిన ఆటగాళ్లెవరూ పెద్దగా రాణించలేక పోయారు. నాలుగు వికెట్లతో దీపక్ హుడా విజృంభించడంతో.. కీవీస్ టీం పేకమేడలా కుప్పకూలింది. దీంతో భారత్ విజయం లాంఛనమే అయ్యింది.

ఇటు వైపు బ్యాటింగ్ లో సూర్య కుమర్ తో పాటు ఇషాన్ కిషన్ 36 పరుగులతో రాణించగా.. బౌలింగ్ లో దీపక్ హుడా 2. 5 ఓవర్లలో 10 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్ల స్పెల్ తో అదరగొట్టాడు. అటు వైపు కెప్టెన్ విలియమ్సన్ 61 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. విలియమ్సన్ తర్వాత కాన్వె ఒక్కడు మాత్రమే 25 పరుగులతో పర్లేదనిపించాడు. ఇక బౌలర్లలో టిమ్ సౌథీ హ్యాట్రిక్ తో రాణించి న్యూజిల్యాండ్ పరువు కాపాడాడు.

సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్..

ఏది ఏమైనా ఈ మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్సే వెరీ వెరీ స్పెషల్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరోమారు తనదైన 360 డిగ్రీస్ ఇన్నింగ్స్ తో విజృంభించి సీనియర్ల నుంచి ప్రశంసలందుకుంటున్నాడు.

ఏ గ్రహం మీదైనా సరే సూర్యా పరుగుల వర్షం కురిపించగలడనీ ట్వీట్ చేశాడు మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్. రోహిత్ తర్వాత విదేశాల్లో టీట్వంటీలో 2 సెంచరీలు చేసిన ఏకైక భారత బ్యాటర్ గా నిలవడమే ఇందుకు సాక్ష్యమనీ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు ఇతర భారత సీనియర్లు.

ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్..

ఈ మ్యాచ్ ను లైవ్ లో చూడలేక పోయాననీ, ఈ అసాధారణ ఆటగాడు ఖచ్చితంగా మరో వీడియో గేమ్ ను పోలిన షాట్లతో విరుచుకుపడి ఉంటాడనీ తన ట్విట్టర్ వేదికగా కొనియాడాడు కింగ్ కోహ్లీ.

వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్..

ఈ మధ్యన సూర్యుడు ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడని సూర్య కుమార్ యాదవ్ ను ఆకాశానికి ఎత్తేస్తూ ట్వీట్ చేశాడు వీరేంద్ర సెహ్వాగ్. గత కాలపు బ్యాటింగ్ విధ్వంసం అంటూ పొగిడేశాడు.

విరాట్ కోహ్లీ ట్వీట్..

2022లో సూర్య ప్రతాపం..

సూర్య ఈ సంవత్సరం 30 T20 ఇన్నింగ్స్‌లలో 1151 పరుగులు చేశాడు. ఒక సంవత్సరంలో 1000 T20 అంతర్జాతీయ పరుగులు చేసిన మొదటి భారతీయుడిగా నిలిచాడు. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, సూర్య 181 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో ఈ పరుగులు చేశాడు. అలాగే సూర్య ఈ ఏడాది ఇప్పటి వరకు 67 సిక్సర్లు బాదాడు. ఇదే కూడా ఓ రికార్డుగా నిలిచింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu