IND vs NZ 2nd ODI: కోహ్లీ, రోహిత్ కానేకాదు.. కివీస్‌కి భారీ టార్గెట్ ఫిక్స్ చేసిన రాజ్‌కోట్ ‘కింగ్’.. ఎవరంటే?
India vs New Zealand, 2nd ODI: రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య వన్డే సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 284 పరుగులు చేసింది.

India vs New Zealand, 2nd ODI: రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య వన్డే సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 284 పరుగులు చేసింది. దీంతో న్యూజిలాండ్ జట్టుకు 285 పరుగుల టార్గెట్ ను ఛేజ్ చేయాల్సి ఉంది. కేఎల్ రాహుల్ సెంచరీ ఇన్నింగ్స్ తో భారత జట్టు పరువు కాపాడాడు. కోహ్లీ, రోహిత్ లు తీవ్రంగా నిరాశపరిచారు.
నితీష్ కుమార్ రెడ్డి 20 పరుగుల వద్ద జాక్ ఫాల్క్స్ బౌలింగ్‌లో గ్లెన్ ఫిలిప్స్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రవీంద్ర జడేజా (27) మైఖేల్ బ్రేస్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
క్రిస్టియన్ క్లార్క్ విరాట్ కోహ్లీ (23 పరుగులు), శ్రేయాస్ అయ్యర్ (8 పరుగులు), రోహిత్ శర్మ (24 పరుగులు) లను అవుట్ చేశాడు. కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ (56 పరుగులు) ను కైల్ జామిసన్ అవుట్ చేశాడు.
రెండు జట్ల ప్లేయింగ్ 11..
భారత్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.
న్యూజిలాండ్: మైఖేల్ బ్రేస్‌వెల్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, విల్ యంగ్, హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచ్ హే (వికెట్ కీపర్), జాక్ ఫాల్క్స్, కైల్ జామిసన్, క్రిస్టియన్ క్లార్క్, జేడెన్ లెన్నాక్స్.
