హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో మరో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరగనుంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఈనెల 18వ తేదీన భారత్, న్యూజిల్యాండ్ జట్లు ఉప్పల్ మైదానంలో తలపడనున్నాయి. గతంలో జరిగిన చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈమ్యాచ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. ఇందులో భాగంగా ఈసారి టికెట్లను ఆఫ్‌లైన్‌లో కాకుండా ఆన్‌లైన్‌లో మాత్రమే విక్రయానికి ఉంచారు. ఆల్రెడీ పేటీఎం యాప్ లో టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. మొదటి రోజు 6 వేల టికెట్లు అందుబాటులో ఉంచగా మొత్తం39 వేల టికెట్స్‌ని ఆన్‌లైన్‌లో విక్రయిస్తుంచనున్నారు. ఈరోజు నుంచి 16 వరకు ఆన్‌లైన్‌లో టికెట్లు అమ్మనున్నారు. అయితే మైదానంలోకి వెళ్లాలంటే ఫిజికల్ టికెట్ తప్పనిసరి. ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియంలో క్యూఆర్ కోడ్‌తో ఈ ఫిజికల్ టికెట్లను కలెక్ట్ చేసుకోవాలి. ఇందుకోసం రీడీమ్ కౌంటర్‌ల వద్ద ఫోటో ఐడీతో పాటు పేటీఎం నుంచి వచ్చిన ఎస్ఎంఎస్ లేదా ఈ-మెయిల్‌ను చూపించాల్సి ఉంటుంది. కాగా స్టేడియంలో మొత్తం 39,112 మంది సీటింగ్ కెపాసిటీ ఉంది. ఇందులో 9,695 టిక్కెట్లను కాంప్లిమెంటరీ టికెట్లుగా కేటాయించనున్నారు. మిగిలిన 29,417 టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించనున్నారు.
కాగా మొదటి రోజు 6,000 టిక్కెట్లు అందుబాటులోకి రాగా శనివారం (జనవరి 14) నుంచి రోజూ 7,000 టిక్కెట్లు అందుబాటులో ఉండనున్నాయి. ఇక టికెట్ల ధరల విషాయనికొస్తే.. రూ.850 మొదలు రూ.1,000, రూ.1,250, రూ.1,500, రూ.2,500, రూ.5,000, రూ.9,000, రూ.17,700, రూ.20,650 వరకు ఉండనున్నాయి. ఒకరు కేవలం నాలుగు టిక్కెట్ల వరకు మాత్రమే కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. ఇక జనవరి 14న న్యూజిలాండ్ జట్టు హైదరాబాద్ చేరుకుంటుంది. 15న ప్రాక్టీసు ప్రారంభించనుంది. మరోవైపు టీమిండియా జనవరి 16న హైదరాబాద్ చేరుకుంటుంది. 17న ఇరు జట్లు ప్రాక్టీస్ చేస్తాయి. 18న మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ఆరంభం అవుతుంది.
#indvsnz Online tickets will be releasing from Jan 13th ..
> tickets will be sold phase wise –13th Jan – 5 PM – 6000 Tickets
14th Jan – 5 PM – 7000 Tickets
15th JAN – 5 PM – 7000 Tickets
16th Jan – 5 PM – Anything remainingOnly on Paytm Insider.. tickets rates are below pic.twitter.com/IGvTCqooN3
— Siva Sankar naidu pathipati (@sankar_sinny18) January 11, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..