IND vs IRE: టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన ‘జమ్మూ ఎక్స్‌ప్రెస్’.. టాస్ గెలిచిన హార్దిక్.. ప్లేయింగ్ 11 ఎలా ఉందంటే?

దక్షిణాఫ్రికా సిరీస్‌లో ఉమ్రాన్ మాలిక్‌ టీమిండియాలో భాగంగానే ఉన్నాడు. కానీ, అతనికి ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం రాలేదు.

IND vs IRE: టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన 'జమ్మూ ఎక్స్‌ప్రెస్'.. టాస్ గెలిచిన హార్దిక్.. ప్లేయింగ్ 11 ఎలా ఉందంటే?
Ind Vs Ire Umran Malik
Venkata Chari

|

Jun 26, 2022 | 8:53 PM

మెలాహిదే వేదికగా తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా వర్సెస్ ఐర్లాండ్ టీంలు తలపడుతున్నాయి. కాగా, ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అయితే, ఈ మ్యాచ్‌తో భారత ఫాస్టెస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ కల నెరవేరింది. ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండు టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో అరంగేట్రం చేసే అవకాశం ఉమ్రాన్‌కు లభించింది. మ్యాచ్‌కు గంట ముందు సహచర ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అతనికి టీమ్ ఇండియా క్యాప్ అందించాడు. ఐపీఎల్ చివరి సీజన్‌లో ఉమ్రాన్ బలంగా బౌలింగ్ చేసి తన స్పీడ్‌తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను ఆకట్టుకున్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఉమ్రాన్ భారత 98వ ఆటగాడిగా నిలిచాడు. కాగా, ఈ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. టాస్‌కి ముందు కూడా వర్షం కురవడంతో, కాస్త ఆలస్యంగా టాస్ వేశారు. టాస్ అనంతరం కూడా మరోసారి చినుకులు మొదలయ్యాయి.

నాలుగేళ్ల తర్వాత ఐర్లాండ్ ఆతిథ్యం..

ప్రస్తుతం టీమ్ ఇండియా ప్రపంచంలోనే అత్యంత డిమాండ్ ఉన్న జట్టు. ప్రతి క్రికెట్ బోర్డు భారత జట్టుకు ఆతిథ్యం ఇవ్వాలని, ఒక సిరీస్ నుంచే ఎక్కువగా సంపాదించాలని కోరుకుంటుంది. ఫలితంగా ఐర్లాండ్ వంటి చిన్న దేశాలు చాలా ఏళ్ల తర్వాత భారత స్టార్లకు ఆతిథ్యం ఇచ్చే ప్రత్యేకతను పొందాయి. 2018 తర్వాత టీమ్ ఇండియా తొలిసారి ఐర్లాండ్‌కు వెళ్లింది. 2018లో భారత్ అక్కడ రెండు టీ20లు ఆడి రెండింటిలోనూ విజయం సాధించింది. అప్పటి నుంచి ప్రపంచంలోని ఏ మూలలోనూ ఇరు జట్ల మధ్య ఏ ఫార్మాట్‌లోనూ మ్యాచ్ జరగలేదు.

కెప్టెన్‌గా అరంగేట్రం చేయనున్న పాండ్యా..

భారత జట్టు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సారథ్యంలో ఈ సిరీస్ ఆడనుంది. టీ20ల్లో ఇప్పటివరకు పాండ్యా భారత్‌కు తొమ్మిదో కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అతని కంటే ముందు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సహా 8 మంది క్రికెటర్లు ఈ ఫార్మాట్‌లో భారత్‌కు కెప్టెన్‌గా ఉన్నారు. పాండ్యా, పాండ్యా అభిమానులు మిగతా ఐదుగురు కెప్టెన్ల పేర్లను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ధోని, విరాట్, రోహిత్ మినహా, మరే ఇతర స్టార్స్ 5 T20Iలకు మించి కెప్టెన్‌గా చేయలేకపోయారు. రిషబ్ పంత్ 5, సురేశ్ రైనా, శిఖర్ ధావన్ తలో 3, అజింక్యా రహానే 2, వీరేంద్ర సెహ్వాగ్ 1 మ్యాచ్‌లు ఆడారు.

ఇటువంటి పరిస్థితిలో ఈ సిరీస్‌లో పాండ్యా కెప్టెన్సీని పంత్, రాహుల్ కెప్టెన్సీతో పోల్చడం కూడా ఖాయంగా కనిపిస్తోంది. రోహిత్ శర్మ తర్వాత ఈ ముగ్గురిలో ఒకరు భారత పూర్తికాల కెప్టెన్‌గా మారే అవకాశం ఉంది. అంటే, ఈ సిరీస్‌ని పాండ్యా కెప్టెన్సీ ఆడిషన్ అని కూడా అనవచ్చు.

ఇరు జట్లు:

టీమిండియా (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), దినేష్ కార్తీక్(కీపర్), అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, ఉమ్రాన్ మాలిక్

ఇవి కూడా చదవండి

ఐర్లాండ్ (ప్లేయింగ్ XI): పాల్ స్టిర్లింగ్, ఆండ్రూ బల్బిర్నీ(కెప్టెన్), గారెత్ డెలానీ, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్(కీపర్), జార్జ్ డాక్రెల్, మార్క్ అడైర్, ఆండీ మెక్‌బ్రైన్, క్రెయిగ్ యంగ్, జాషువా లిటిల్, కోనర్ ఓల్ఫెర్ట్

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu