IND vs IRE 3rd T20I: బుమ్రా, ప్రసీద్ద్ ఔట్.. ఏడాది తర్వాత రీఎంట్రీ ఇవ్వనున్న బౌలర్.. కెప్టెన్‌గా ఎవరంటే?

India vs Ireland 3rd T20I Playing 11: జస్ప్రీత్ బుమ్రా, ప్రసీద్ధ్ కృష్ణ బంతితో బాగా రాణించినప్పటికీ మూడవ టీ20ఐ ప్లేయింగ్ XIలో ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్‌లకు చోటు కల్పించవచ్చని తెలుస్తోంది. బుమ్రా విశ్రాంతి తీసుకుంటే రితురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీని స్వీకరించే ఛాన్స్ ఉంది. ఆల్ రౌండర్ స్లాట్ కోసం వాషింగ్టన్ సుందర్ స్థానంలో షాబాజ్ అహ్మద్‌ను ప్రయత్నించవచ్చు. రింకూ సింగ్, తిలక్ వర్మలు ప్లేయింగ్ XIలో కొనసాగుతారు. యశస్వి జైస్వాల్ ఇప్పటివరకు విజయవంతం కాలేదు. జైస్వాల్ కూడా బరిలోకి దిగే ఛాన్స్ ఉంది.

IND vs IRE 3rd T20I: బుమ్రా, ప్రసీద్ద్ ఔట్.. ఏడాది తర్వాత రీఎంట్రీ ఇవ్వనున్న బౌలర్.. కెప్టెన్‌గా ఎవరంటే?
Ind Vs Ire T20 Series

Updated on: Aug 23, 2023 | 7:10 AM

India vs Ireland 3rd T20I Playing 11 Prediction: భారత్ వర్సెస్ ఐర్లాండ్ మధ్య 3 మ్యాచ్‌ల సిరీస్‌లో చివరి T20 మ్యాచ్ 23 ఆగస్టు 2023న డబ్లిన్‌లోని ది విలేజ్‌లో జరగనుంది. ఇప్పటికే ఈ సిరీస్‌లో టీమిండియా తిరుగులేని ఆధిక్యం సాధించింది. టీమిండియా 2-0తో ముందంజలో ఉంది. ఇటువంటి పరిస్థితిలో రెండు జట్లు తమ ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు బెంచ్‌పై కూర్చోవాల్సిన ఆటగాళ్లకు కొన్ని అవకాశాలు ఇవ్వాలని మేనేజ్మెంట్ కోరుకుంటోంది.

తొలి రెండు టీ20ల్లో టీమ్ ఇండియా తన ప్లేయింగ్ ఎలెవన్‌ను మార్చలేదు. మూడో టీ20లో టీమిండియాకు రితురాజ్ గైక్వాడ్ సారథ్యం వహించే అవకాశం ఉంది. కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి లభించవచ్చు. ఆసియా కప్ 2023కి ఎంపికైన జట్టులో జస్ప్రీత్ బుమ్రా కూడా సభ్యుడిగా ఉన్నాడు.

ఇవి కూడా చదవండి

జస్ప్రీత్ బుమ్రా ఇటీవలే గాయం నుంచి కోలుకున్నాడు. ఇటువంటి పరిస్థితిలో ఐర్లాండ్‌తో జరిగే మూడవ T20 లో అతన్ని బరిలోకి దించడం ద్వారా జట్టు మేనేజ్‌మెంట్ రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడదు. సంజూ శాంసన్‌కు కూడా విశ్రాంతి లభించే అవకాశం ఉంది. సంజూ శాంసన్ స్థానంలో జితేష్ శర్మ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చే అవకాశం ఉంది. టీమ్ ఇండియా తదుపరి అసైన్‌మెంట్ హాంగ్‌జౌ ఆసియా క్రీడలు, కాబట్టి జితేష్ శర్మకు ఐర్లాండ్‌లో అవకాశం ఇవ్వవచ్చు.

2వ టీ20ఐలో బుమ్రా సేన..

ఆల్ రౌండర్ స్లాట్ కోసం వాషింగ్టన్ సుందర్ స్థానంలో షాబాజ్ అహ్మద్‌ను ప్రయత్నించవచ్చు. రింకూ సింగ్, తిలక్ వర్మలు ప్లేయింగ్ XIలో కొనసాగుతారు. యశస్వి జైస్వాల్ ఇప్పటివరకు విజయవంతం కాలేదు. జైస్వాల్ కూడా బరిలోకి దిగే ఛాన్స్ ఉంది.

మూడో టీ20 మ్యాచ్‌లో ఇరుజట్లు..


భారత ప్రాబబుల్ ప్లేయింగ్ XI: యశస్వి జైస్వాల్, రితురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), తిలక్ వర్మ, జితేష్ శర్మ (కీపర్), రింకు సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్.

ఐర్లాండ్ ప్రాబబుల్ ప్లేయింగ్ XI: ఆండ్రూ బల్బిర్నీ, పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), లోర్కాన్ టక్కర్, హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్, థియో వాన్ వూర్కోమ్, రాస్ అడైర్, బారీ మెక్‌కార్తీ, క్రెయిగ్ యంగ్, గారెత్ డెలానీ, బెంజమిన్ వైట్.

2వ టీ20ఐలో భారత్ విజయం..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..