IND vs ENG: ఆల్‌రౌండ్ పెర్ఫామెన్స్‌తో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన టీమిండియా.. సిరీస్ కైవసం

ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ని మరో మ్యాచ్ ఉండగానే భారత్ కైవసం చేసుకుంది. శుక్రవారం (జనవరి 31) జరిగిన నాలుగో టీ20 మ్యాచ్ లో టీమిండియా 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా 5 మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది.

IND vs ENG: ఆల్‌రౌండ్ పెర్ఫామెన్స్‌తో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన టీమిండియా.. సిరీస్ కైవసం
Team India

Updated on: Jan 31, 2025 | 10:46 PM

ఇంగ్లండ్ తో జరుగుతోన్న ఐదు టీ20ల సిరీస్‌ను భారత్ 3-1తో కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన నాలుగో టీ20 మ్యాచ్ లో భారత జట్టు 15 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేల మెరుపు అర్ధ సెంచరీలతో ఇంగ్లండ్ కు 181 పరుగుల టార్గెట్ విధించింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ధాటిగా బ్యాటింగ్ ఆరంభించింది. బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్ తొలి వికెట్‌కు 62 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ జోడీని బద్దలు కొట్టడంలో రవివిష్ణోయ్ సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్ కూడా వికెట్ తీశాడు. ఈ క్రమంలోనే కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా హర్షిత్ రాణాను భారత్ తీసుకుంది. గాయపడిన శివమ్ దూబే స్థానంలో అతనికి అవకాశం లభించింది. ఇది అతనికి తొలి టీ20 అంతర్జాతీయ మ్యాచ్. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నహర్షిత్ రాణా నాలుగో వికెట్‌ను పడగొట్టాడు. తొలి ఓవర్ రెండో బంతికే లియామ్ లివింగ్‌స్టోన్ కీలక వికెట్ తీయడంతో మ్యాచ్ అక్కడి నుంచి మలుపు తిరిగింది. హర్షిత్ రాణా అక్కడితో ఆగలేదు జాకబ్ బెత్లే వికెట్ పడగొట్టడంతో మ్యాచ్ పూర్తిగా భారత్ వైపు మొగ్గింది. హర్షిత్ రాణా 4 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. 19వ ఓవర్లో కేవలం 6 పరుగులకే ఓవర్టన్ వికెట్ తీశాడీ యంగ్ బౌలర్. దీంతో ఆఖరి ఓవర్ లో ఇంగ్లండ్ విజయం 6 బంతుల్లో 19 పరుగులుగా మారిపోయింది.

హర్షిత్‌ రాణా కు తోడు రవి బిష్ణోయ్‌ (3), వరుణ్‌( 2), అక్షర్‌ పటేల్‌( 1,) అర్ష్‌దీప్‌ (1) వికెట్లు తీయడంతో ఇంగ్లండ్ 19.4 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఇంగ్లండ్ బ్యాటర్లు హ్యారీ బ్రూక్‌ (51), బెన్‌ డకెట్‌ (39) రాణించారు

ఇవి కూడా చదవండి

కెప్టెన్ సూర్య సంబరాలు..

 

 

భారత్ (ప్లేయింగ్ XI):

సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి.

ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI):

ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), బెన్ డకెట్, జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెతెల్, జామీ ఓవర్‌టన్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..