AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma: సర్ఫరాజ్ ప్రాణాలు కాపాడిన కెప్టెన్ రోహిత్ శర్మ.. అసలేమైందంటే? వీడియో చూస్తే ఒళ్లు జలదరిస్తుందంతే..

భారత్‌ -ఇంగ్లండ్‌ జట్ల మధ్య చివరి ఐదో టెస్టు మ్యాచ్‌ మూడు రోజులకే ముగిసింది. టీమ్ ఇండియా ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో విజయం సాధించి 4-1 తేడాతో సిరీస్‌ని కైవసం చేసుకుంది. కాగా, ఈ మ్యాచ్‌కి సంబంధించిన వీడియో ఒక్కటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కెప్టెన్ రోహిత్ శర్మ సూచించిన ఒకే ఒక్క సలహాతో సర్ఫరాజ్ ఖాన్ త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు

Rohit Sharma: సర్ఫరాజ్ ప్రాణాలు కాపాడిన కెప్టెన్ రోహిత్ శర్మ.. అసలేమైందంటే? వీడియో చూస్తే ఒళ్లు జలదరిస్తుందంతే..
Rohit Sharma, Sarfaraz Khan
Basha Shek
|

Updated on: Mar 10, 2024 | 9:54 AM

Share

భారత్‌ -ఇంగ్లండ్‌ జట్ల మధ్య చివరి ఐదో టెస్టు మ్యాచ్‌ మూడు రోజులకే ముగిసింది. టీమ్ ఇండియా ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో విజయం సాధించి 4-1 తేడాతో సిరీస్‌ని కైవసం చేసుకుంది. కాగా, ఈ మ్యాచ్‌కి సంబంధించిన వీడియో ఒక్కటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కెప్టెన్ రోహిత్ శర్మ సూచించిన ఒకే ఒక్క సలహాతో సర్ఫరాజ్ ఖాన్ త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. ధర్మశాల టెస్టు మూడో రోజు షార్ట్ లెగ్ వద్ద ఫీల్డింగ్ కు నిల్చున్నాడు సర్ఫరాజ్ ఖాన్. క్రీజులో ఉన్న షోయబ్ బషీర్ బలంగా కొట్టిన షాట్ షార్ట్ లెగ్ లో ఫీల్డింగ్ చేస్తోన్న సర్ఫరాజ్ తలకు నేరుగా తాకింది. అయితే అదృష్టవశాత్తు సర్ఫరాజ్ హెల్మెట్ ధరించడంతో పెను ప్రమాదం తప్పింది. అంతకుముందు జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్‌లో హెల్మెట్ ధరించాలని రోహిత్ సర్ఫరాజ్‌కు సూచించాడు. ఆ సమయంలో సర్ఫరాజ్ హెల్మెట్ లేకుండా బ్యాటర్ కు దగ్గరగా ఫీల్డింగ్ చేయడానికి సిద్ధమైపోయాడు. ఇది గమనించిన రోహిత్.. నాలుగో టెస్టులో హెల్మెట్ ధరించాలని సర్ఫరాజ్ కు గట్టిగా చెప్పాడు. ఇలాంటి విషయాల్లో హీరో అవ్వద్దంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.

నాలుగో టెస్టులో రోహిత్ మాటలను అనుసరించిన సర్ఫరాజ్ ఖాన్ ఐదో టెస్టులో హెల్మెట్ ధరించాడు. దీంతో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. 38వ ఓవర్ మూడో బంతికి ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. లెగ్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఇంగ్లండ్ బ్యాటర్‌ షోయబ్ బషీర్ కొట్టిన షాట్ సర్ఫరాజ్ హెల్మెట్‌కు వేగంగా తగిలింది. అదృష్టవశాత్తు సర్ఫరాజ్ హెల్మెట్ ధరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్ మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. అలాగే గిల్ 110 పరుగులు చేయగా, రోహిత్ 162 బంతుల్లో 103 పరుగులు చేశాడు. 57 పరుగుల వద్ద నిష్క్రమించిన ఓపెనర్ యషవిస్ జైస్వాల్‌తో కలిసి రోహిత్ 104 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

ఇవి కూడా చదవండి

హీరో అవ్వకు..

దీనికి ముందు ఆర్. అశ్విన్, కుల్దీప్ యాదవ్ స్పిన్ ఉచ్చులో చిక్కుకోవడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులకే ఆలౌటైంది. 477 పరుగుల భారీ స్కోరుతో భారత్ 259 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో బెన్ స్టోక్స్ సారథ్యంలోని టీమిండియా 195 పరుగులకు ఆలౌట్ కావడంతో భారత్ ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో విజయం సాధించింది.

రోహిత్ స్వీట్ వార్నింగ్..

మరిన్ని క్రీడా వార్తలు, కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..