ధర్మశాల వేదికగా భారత్‌తో జరుగుతున్న 5వ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ 2 వికెట్లు తీసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. టెస్టు క్రికెట్‌లో 700 వికెట్లు తీసిన ఏకైక ఫాస్ట్ బౌలర్ గా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అంతేకాదు ప్రపంచంలోనే ఓవరాల్ గా ఈ ఘనత సాధించిన 3వ బౌలర్ కూడా. ఇంతకు ముందు శ్రీలంకకు చెందిన ముత్తయ్య మురళీధరన్, ఆస్ట్రేలియాకు చెందిన షేన్ వార్న్ మాత్రమే టెస్ట్ క్రికెట్‌లో 700+ వికెట్లు పడగొట్టారు. వీరిద్దరూ స్పిన్నర్లే కావడం ఇక్కడ గమనార్హం. ఇప్పుడు 41 ఏళ్ల జేమ్స్ అండర్సన్ 187 టెస్టు మ్యాచ్‌ల ద్వారా 700 వికెట్లు సాధించాడు. దీని ద్వారా ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన ఏకైక ఫాస్ట్ బౌలర్‌గా నిలిచాడు.
2003లో జింబాబ్వేపై టెస్టు కెరీర్ ప్రారంభించిన జేమ్స్ అండర్సన్ ఇప్పటివరకు 39873 బంతులు వేశాడు. 18568 పరుగులు ఇచ్చి మొత్తం 700 వికెట్లు పడగొట్టాడు. 32 సార్లు 5 వికెట్లుపడగొట్టగా.. 3 సార్లు 10 వికెట్లు తీసుకున్నాడు. అండర్సన్ వయసు సుమారు 41 ఏళ్లు. ఈ వయసులోనూ ఎంతో ఫిట్ గా కనిపించే అండర్సన్ తన స్వింగ్ బౌలింగ్ తో సంచలనాలు సృష్టిస్తున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రెండో ఇన్నింగ్స్ లోనూ ఇంగ్లండ్ తడబడుతోంది. ప్రస్తుతం ఆ జట్టు 9 ఓవర్లలో 2 వికెట్లనష్టానికి 35 పరుగులు చేసింది. ఓపెనర్లిద్దరిని అశ్విన్ ఔట్ చేశాడు. ప్రస్తుతం క్రీజులో ఓలీ పోప్ (19), జో రూట్ (7) ఉన్నారు.
Another milestone reached 📈
More history made 📘Jimmy’s 700 Test wickets in numbers here: https://t.co/Eann2PXc97 pic.twitter.com/kdfgcur4ow
— England Cricket (@englandcricket) March 9, 2024
Another jewel in the crown of James Anderson 👑
➡️ https://t.co/NclpXwxcNa
#WTC25 | #INDvENG pic.twitter.com/JV12NGobAB— ICC (@ICC) March 9, 2024
యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కర్ంధర్), శుభమన్ గిల్, దేవదత్ పడిక్కల్, రవీంద్ర జడేజా, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, బెన్ స్టోక్స్ (w), జానీ బెయిర్‌స్టో, బెన్ ఫోక్స్ (w), టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్.
మరిన్ని క్రీడా వార్తలు, కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..