IND vs ENG: రెండో వన్డేలోనూ టాస్ ఓడిన టీమిండియా.. కింగ్ కోహ్లీ ఎంట్రీ.. ఆ స్టార్ ప్లేయర్లు ఔట్

మూడు వన్డేల మ్యాచ్ సిరీస్ లో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో మ్యాచ్ ప్రారంభమైంది. కటక్ వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్ లో భారత తుది జట్టులో భారీ మార్పులు జరిగాయి. మొదటి మ్యాచ్ కు దూరమైన విరాట్ కోహ్లీ ఎట్టకేలకు మైదానంలోకి అడుగు పెట్టాడు.

IND vs ENG: రెండో వన్డేలోనూ టాస్ ఓడిన టీమిండియా.. కింగ్ కోహ్లీ ఎంట్రీ.. ఆ స్టార్ ప్లేయర్లు ఔట్
IND vs ENG 2nd ODI

Updated on: Feb 09, 2025 | 2:05 PM

ఛాంపియన్స్ ట్రోఫికి ముందు భారత్, ఇంగ్లాండ్ మధ్య వన్డే సిరీస్ జరుగుతోంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో టీం ఇండియా 1-0 ఆధిక్యంలో ఉంది. రెండో, నిర్ణయాత్మక మ్యాచ్ ఆదివారం (ఫిబ్రవరి 9) కటక్‌లోని బారాబతి స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ మరోసారి బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇంగ్లాండ్ సిరీస్‌లో 0-1తో వెనుకబడి ఉంది. కాబట్టి ఇది ఇంగ్లాండ్‌కు ‘డూ ఆర్ డై’ మ్యాచ్. మరోవైపు, టీం ఇండియా రెండో మ్యాచ్ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి, ఈ రెండో మ్యాచ్‌లో రెండు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశం ఉంది. కాగా రెండవ మ్యాచ్ కోసం రెండు జట్లు మొత్తం 5 మార్పులు చేశాయి. ఇంగ్లాండ్ జట్టులో 3 మార్పులు చేయగా, టీం ఇండియా రెండు మార్పులు చేసింది. మోకాలి గాయం తర్వాత విరాట్ కోహ్లీ తిరిగి జట్టులోకి వచ్చాడు. కాబట్టి, యశస్వి జైస్వాల్ పెవిలియన్ కే పరిమితమయ్యాడు. కుల్దీప్ యాదవ్ స్థానంలో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి అవకాశం లభించింది. దీంతో, టీమిండియా తరఫున వన్డేల్లో అరంగేట్రం చేసిన రెండో అతి పెద్ద వయస్కుడిగా వరుణ్ నిలిచాడు. ఇంగ్లాండ్ నుంచి మార్క్ వుడ్, గస్ అట్కిన్సన్ జామీ ఓవర్టన్ లు తుది జట్టులోకి వచ్చారు.

ఈ సిరీస్‌లో వన్డేల్లో అరంగేట్రం చేసిన టీం ఇండియా తరపున వరుణ్ మూడవ ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు, యశస్వి జైస్వాల్,  హర్షిత్ రాణా ఇద్దరూ మొదటి మ్యాచ్‌లోనే అరంగేట్రం చేశారు.

టీం ఇండియా ప్లేయింగ్ ఎలెవన్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి.

ఇవి కూడా చదవండి

 

భారత తుది జట్టు..

ఇంగ్లాండ్ ప్లేయింగ్ XI: జోస్ బట్లర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జామీ ఓవర్టన్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్,  సాకిబ్ మహ్మద్.

వరుణ్ కు క్యాప్ ఇస్తోన్న కెప్టెన్ రోహిత్ శర్మ..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..