ఇంగ్లండ్‌తో రాంచీ వేదికగా జరుగుతున్న 4వ టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా వికెట్ కీపర్ అండ్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 353 పరుగులు చేసింది. దీని తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు ఆశించిన ఆరంభం లభించలేదు. ఓపెనర్ రోహిత్ శర్మ (2) తొందరగానే ఔటైతే.. ఆ తర్వాత వచ్చిన శుభ్ మన్ గిల్ 38 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత రజత్ పటీదార్ (12), సర్ఫరాజ్ ఖాన్ (14) కూడా నిరాశపర్చారు. యశస్వి జైస్వాల్ మాత్రమే 73 పరుగులు చేశాడు. 171 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న తరుణంలో బరిలోకి దిగిన ధ్రువ్ జురెల్ బాధ్యతాయుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తూ పరుగులు రాబట్టిన జురెల్ 2వ రోజు టీమ్ ఇండియా ఆలౌట్ అవ్వకుండా అడ్డుకున్నాడు. 3వ రోజు ధృవ్ కుల్దీప్ యాదవ్ (28)తో కలిసి 96 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. హాఫ్ సెంచరీ తర్వాత, యువ బ్యాటర్ దూకుడుగా ఆడడంపై దృష్టి సారించాడు. భారీ షాట్ కొట్టే యత్నంలో 90 పరుగుల వ్యక్తి గత స్కోరు వద్ద టామ్ హార్ట్లీ వేసిన బంతిని తప్పుగా అంచనా వేసి ధృవ్ జురెల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో కేవలం 10 పరుగుల తేడాతో తొలి సెంచరీ పూర్తి చేసే అవకాశాన్ని కోల్పోయాడు.
ఇదిలా ఉంటే తొలి అర్ధశతకాన్ని పూర్తి చేసుకొన్నాక ధ్రువ్ ‘సెల్యూట్’ చేయడం అందర్ని ఆశ్చర్యపర్చింది. వివరాల్లోకి వెళితే..
ధృవ్ జురెల్ తండ్రి నీమ్ సింగ్ ఇండియన్ ఆర్మీలో హవల్దార్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. తనలాగే తన కొడుకు ధృవ కూడా సైన్యంలో చేరాలని కోరుకున్నాడు. కానీ ధృవ్ క్రికెటర్ అయ్యాడు. ఇప్పుడు తండ్రి మీద గౌరవంతోనే సెల్యూట్ తో సెలబ్రేషన్స్ చేసుకున్నాడీ యంగ్ క్రికెటర్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. ధ్రువ్ జురెల్ (90), యశస్వి జైస్వాల్ (73) అర్ధ సెంచరీల సాయంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 307 పరుగులు చేసింది. 46 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన ఇంగ్లండ్ కేవలం 145 పరుగులకే కుప్పుకూలింది. 192 పరుగుల లక్ష్య ఛేదనలో మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది భారత జట్టు.
A Salute for his father. 🫡🇮🇳
– Dhruv Jurel is making his father proud who is a Kargil war veteran.pic.twitter.com/Q4GVIJLRAE
— Johns. (@CricCrazyJohns) February 25, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.