IND vs ENG: అర్ష్‌దీప్ సింగ్ ‘100’.. సూర్యకుమార్ యాదవ్ 150.. రాజ్‌కోట్‌లో రికార్డులు బద్దలే..
IND vs ENG 3rd T20I: రాజ్‌కోట్ మైదానంలో కూడా టీమిండియా సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఇంగ్లండ్‌తో మూడో టీ20లో టీమిండియా హ్యాట్రిక్ విజయంతోపాటు సిరీస్‌ను కైవసం చేసుకోవడంపైనే దృష్టి సారించింది. అయితే, ఈ మ్యాచ్‌లో అర్ష్దీప్ సింగ్, సూర్యకుమార్ యాదవ్ వంటి స్టార్లు అద్భుతాలు చేసే అంచున ఉన్నారు. ఈ మైదానంలో భారత్ ఆరో టీ20 ఆడనుంది. ఇంగ్లండ్ తొలిసారిగా రాజ్‌కోట్‌లో టీ20 ఆడనుంది.
![IND vs ENG: అర్ష్‌దీప్ సింగ్ '100'.. సూర్యకుమార్ యాదవ్ 150.. రాజ్‌కోట్‌లో రికార్డులు బద్దలే..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/01/ind-vs-eng-3rd-t20i.jpg?w=1280)
IND vs ENG 3rd T20I: ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌ను ఓడించి, రాజ్‌కోట్‌లో జరిగే మూడో టీ20లో టీమిండియా అడుగుపెట్టనుంది. ప్రస్తుతం భారత ఆటగాళ్ల దృష్టి హ్యాట్రిక్ విజయాలతో పాటు సిరీస్‌ను కైవసం చేసుకోవడంపైనే ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్ జట్టు తొలిసారి టీ-20 మ్యాచ్ ఆడనుంది. ఇటువంటి పరిస్థితిలో మరోసారి భారత జట్టు ముందు నిస్సహాయంగా కనిపించవచ్చు. ఈ మ్యాచ్‌లో టాస్ కూడా కీలక పాత్ర పోషించనుంది. రాజ్‌కోట్‌లో అర్ష్‌దీప్ సింగ్, సూర్యకుమార్ యాదవ్ లాంటి స్టార్లు పెద్ద రికార్డులు సృష్టించగలరు. పరిస్థితులు భారత్‌కు అనుకూలంగా ఉంటే రాజ్‌కోట్‌లో కూడా టీమ్ ఇండియా హ్యాట్రిక్ విజయంతోపాటు సిరీస్‌ను గెలుచుకునే ఛాన్స్ ఉంది.
టాస్ కీలక పాత్ర..
గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మైదానంలో భారత్ ఇప్పటి వరకు 5 టీ20 మ్యాచ్‌లు ఆడగా 4 గెలిచింది. కాగా ఒకదానిలో ఓటమి చవిచూసింది. ఈ మైదానంలో టాస్ గెలిచిన జట్లు 4 మ్యాచ్‌లు గెలవగా, టాస్ ఓడిన జట్లు 1 మ్యాచ్ మాత్రమే గెలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు 3 మ్యాచ్‌లు గెలుపొందగా, ముందుగా బౌలింగ్ చేసిన జట్టు రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇక్కడ మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పుడు సగటు స్కోరు 189 పరుగులు. కాగా అత్యధిక స్కోరు 228 పరుగులు.
‘వికెట్ల సెంచరీ’కి చేరువలో అర్ష్‌దీప్..
రాజ్‌కోట్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ప్రత్యేక సెంచరీ సాధించగలడు. ఈ ఫార్మాట్‌లో అత్యధికంగా 98 వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు. రేపటి మ్యాచ్‌లో అర్ష్‌దీప్ మరో 2 వికెట్లు తీస్తే, అతను తన పేరిట 100 టీ-20 వికెట్లను నమోదు చేస్తాడు.
150 సిక్సర్లకు చేరువలో సూర్యకుమార్ యాదవ్..
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రెండు మ్యాచ్‌ల్లోనూ విఫలమయ్యాడు. కానీ, రాజ్‌కోట్‌లో అతని బ్యాట్ పనిచేస్తే, అతను కూడా ప్రత్యేక రికార్డును సృష్టించే ఛాన్స్ ఉంది. అతను 5 సిక్సర్లు కొట్టిన వెంటనే, సూర్య తన పేరు మీద 150 ట-20 సిక్సర్లను నమోదు చేస్తాడు. ప్రస్తుతం అతని పేరిట 145 సిక్సర్లు ఉన్నాయి. ఈ విషయంలో రోహిత్ శర్మ నంబర్ వన్. అత్యధిక టీ20 సిక్సర్లు (205) బాదిన భారత బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ నిలిచాడు.
మూడో టీ20కి ఇంగ్లండ్ ప్లేయింగ్ 11..
మొదటి రెండు మ్యాచ్‌ల మాదిరిగానే, ఇంగ్లండ్ ఇప్పటికే మూడో మ్యాచ్‌కి కూడా తన ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది. అయితే ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. ఇంగ్లండ్ జట్టు చెన్నైలో ఏ 11 మందితో కలిసి ఫీల్డింగ్ చేసిందో రాజ్‌కోట్‌లోనూ అదే టీంతో బరిలోకి దిగనుంది.
ఇంగ్లండ్ ప్లేయింగ్ 11: జోస్ బాట్లర్ (కెప్టెన్), బెన్ డకెట్, ఫిల్ సాల్ట్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టన్, జామీ స్మిత్, జామీ ఓవర్‌టన్, బ్రేడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, ఆదిల్ రషీద్.
టీమిండియా ప్రాబబుల్ ప్లేయింగ్ 11:
తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన టీమ్ ఇండియా పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. భారత జట్టు ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేశారు. టీమ్ ఇండియాలో పెద్దగా మార్పులకు అవకాశం లేదు. కోల్‌కతా టీ20 తర్వాత రింకూ సింగ్ వెన్ను నొప్పి సమస్య కారణంగా రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. కాగా, కండరాల బెడదతో నితీష్ కుమార్ రెడ్డి మొత్తం సిరీస్‌కు దూరమయ్యారు. వీరిద్దరి స్థానంలో శివమ్ దూబే, రమణదీప్ సింగ్‌లు భారత జట్టులోకి వచ్చారు. రాజ్‌కోట్‌లో ఇద్దరిలో ఎవరికైనా అవకాశం దక్కవచ్చు. కాగా, చెన్నై టీ20 ఆడిన ధృవ్ జురెల్ ఔట్ కావడం ఖాయం.
భారత ప్రాబబుల్ ప్లేయింగ్ ఎలెవన్: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే/రమణదీప్ సింగ్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..