TV9 Telugu
13 February 2025
ఎస్‌ఏ20లో విజేతగా ఎంఐ కేప్ టౌన్ జట్టు నిలిచిన సంగతి తెలిసిందే. తొలిసారి ఈ ట్రోపీ గెలుచుకుంది.
కావ్య మారన్ సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ యజమాని. ఆమె అందం కారణంగా సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
SA20 లీగ్ 2025 ఫైనల్లో కావ్య మారన్ జట్టు సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఎంఐ కేప్ టౌన్ చేతిలో ఓటమి పాలైంది.
ఈ మ్యాచ్ తర్వాత, కావ్య మారన్ ఎంఐ కేప్ టౌన్ జట్టు యజమాని ఆకాష్ అంబానీని కలిశారు. వీరి ఫొటోలను SA20 తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.
ఈ క్రమంలో కావ్య మారన్, ఆకాష్ అంబానీని కౌగిలించుకుంది. దీంతో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ లీగ్ తొలి రెండు సీజన్లను కావ్య మారన్ జట్టు సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ గెలుచుకుంది. కానీ, ఈసారి ఆకాశ్ అంబానీ జట్టు ఎంఐ కేప్ టౌన్ విజయం సాధించడంలో విజయవంతమైంది.
కావ్య మారన్, ఆకాష్ అంబానీ ఇప్పుడు ఇంగ్లాండ్‌లో ఆడే ది హండ్రెడ్ లీగ్‌లో జట్లను కొనుగోలు చేశారు.
వీరిద్దరి ఫొటోలు సోషల్ మీడియాలో తెగ సంచలనంగా మారాయి.