IND vs BAN: బంగ్లా ఆటగాళ్ల ఓవరాక్షన్‌.. కోపోద్రిక్తుడైన కింగ్ కోహ్లీ.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో

|

Dec 25, 2022 | 11:00 AM

ఈ మ్యాచ్‌లో టీమిండియా రన్‌మెషిన్ విరాట్ కోహ్లీ (1) మరోసారి నిరాశపర్చాడు. 22 బంతులు ఎదుర్కొన్న అతను కేవలం ఒక్క పరుగు చేసి మిరాజ్‌ బౌలింగ్‌లో మోమినుల్‌ హక్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.

IND vs BAN: బంగ్లా ఆటగాళ్ల ఓవరాక్షన్‌.. కోపోద్రిక్తుడైన కింగ్ కోహ్లీ.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో
Virat Kohli
Follow us on

ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌ తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఎదురీదుతోంది. 145 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన భారత్ కడపటి వార్తలందే సమయానికి 78 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియా రన్‌మెషిన్ విరాట్ కోహ్లీ (1) మరోసారి నిరాశపర్చాడు. 22 బంతులు ఎదుర్కొన్న అతను కేవలం ఒక్క పరుగు చేసి మిరాజ్‌ బౌలింగ్‌లో మోమినుల్‌ హక్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో ఓవరాక్షన్‌కు మారుపేరైన బంగ్లా ఆటగాళ్లు రెచ్చిపోయారు. పెవిలియన్‌కు వెళుతున్న కోహ్లీని హేళన చేస్తూ గట్టిగట్టిగా అరిచారు. ఇది గమనించిన కోహ్లి వారివైపు కోపంగా చూస్తూ అక్కడే నిలబడ్డాడు. ఇంతలో అక్కడికి వచ్చిన షకీబ్‌ అల్‌ హసన్‌తో ఇలా చేయడం కరెక్ట్‌ కాదు అని చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బంగ్లా ఆటగాళ్లు అతి చేస్తున్నారంటూ టీమిండియా ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు.

కాగా భారత్‌ విజయానికి ఇంకా 66 పరుగులు కావాల్సి ఉంది. శ్రేయస్‌ అయ్యర్‌ (4), రవిచంద్రన్‌ (1) క్రీజులో ఉన్నారు. కాగా అంతకుముందు టీమిండియా బ్యాటర్లు పేలవ ప్రదర్శనతో వికెట్లు పారేసుకున్నారు. కేఎల్‌ రాహుల్‌, గిల్‌, పుజారా, కోహ్లీ, రిషభ్‌ పంత్, అక్షర్‌ పటేల్‌, ఉనాద్కత్‌ తక్కువ స్కోర్లకే పెవిలియన్‌ చేరుకున్నారు. బంతి బాగా టర్న్‌ అవుతుండడంతో బంగ్లా స్పిన్నర్ల ధాటికి టీమిండియా బ్యాటర్లు ఒక్కొక్కరూ పెవిలియన్‌కు చేరుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..