IND vs BAN: ఈరోజే ముగిస్తారా? భారత్ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్.. బంగ్లా ముందు భారీ టార్గెట్

చెన్నై వేదికగా బంగ్లాదేశ్ తో జరుగుతోన్న తొలి టెస్టులో భారత్ పట్టు బిగించింది. మూడో రోజు రిషబ్ పంత్, శుభ్ మన్ గిల్ లు సెంచరీలతో చెలరేగడంతో టీమ్ ఇండియా 287 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో

IND vs BAN: ఈరోజే ముగిస్తారా? భారత్ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్.. బంగ్లా ముందు భారీ టార్గెట్
Team India

Updated on: Sep 21, 2024 | 1:52 PM

చెన్నై వేదికగా బంగ్లాదేశ్ తో జరుగుతోన్న తొలి టెస్టులో భారత్ పట్టు బిగించింది. మూడో రోజు రిషబ్ పంత్, శుభ్ మన్ గిల్ లు సెంచరీలతో చెలరేగడంతో టీమ్ ఇండియా 287 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 227 పరుగుల ఆధిక్యం కలిపి బంగ్లాదేశ్‌కు 515 పరుగుల భారీ లక్ష్యాన్ని అందించారు. కాగా మూడో రోజు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పారు. ఇద్దరూ సెంచరీలతో మెరిశారు. ఫలితంగా భారత్ ఆధిక్యం 500 మార్కును చేరుకోగలిగింది. ఇప్పుడిక భారమంతా బౌలర్లపైనే ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో మాదిరిగానే బంగ్లా బ్యాటర్లకు చుక్కలు చూపించాల్సి ఉంది. కాగా రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ ఇండియా ఆశించిన ఆరంభాన్ని అందుకోలేకపోయింది. రోహిత్ శర్మ 5, యశస్వి జైస్వాల్ 10, విరాట్ కోహ్లీ 17 పరుగుల వద్ద ఔటయ్యారు. దీంతో టీమిండియా 3 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. అయితే ఆ తర్వాత శుభ్‌మన్‌ గిల్‌, రిషబ్‌ పంత్‌ జోడీ టీమిండియాను ఆదుకుంంది. మూడో రోజు తొలి సెషన్‌లో నూ ఈ జోడీ విధ్వంసకర బ్యాటింగ్‌ ఆడింది. ముఖ్యంగా రిషబ్ పంత్ సెంచరీ తో అదరగొట్టాడు. టెస్టుల్లో పంత్‌కి ఇది ఆరో సెంచరీ. పంత్‌తో కలిసి భారత్‌ తరఫున సంయుక్తంగా ఆరో సెంచరీ సాధించిన తొలి వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. మహేంద్ర సింగ్ ధోని 6 సెంచరీల రికార్డును పంత్ సమం చేశాడు. 109 పరుగుల వద్ద పంత్ ఔటయ్యాడు. పంత్, గిల్ నాలుగో వికెట్‌కు 167 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

ఇక పంత్ తర్వాత కేఎల్ రాహుల్ రంగంలోకి దిగాడు. శుభమాన్ గిల్ కూడా సెంచరీ తర్వాత ధాటిగా ఆడాడు. ఆధిక్యం 500 దాటడంతో కెప్టెన్ రోహిత్ శర్మ భారత ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. రెండో ఇన్నింగ్స్ లో భారత్ 64 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ 176 బంతుల్లో 4 సిక్సర్లు, 10 ఫోర్లతో అజేయంగా 119 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ 19 బంతుల్లో 22 పరుగులతో నాటౌట్‌గా వెనుదిరిగాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహదీ హసన్ మిరాజ్ 2 వికెట్లు తీశాడు. తస్కిన్ అహ్మద్, నహీద్ రాణా చెరో ఒక్కో వికెట్ పడగొట్టారు.

ఇవి కూడా చదవండి

ఈరోజే ముగిస్తారా?

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..