IND vs BAN: టీమిండియా ధనాధన్ బ్యాటింగ్.. మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్.. ఆధిక్యం ఎంతంటే?
భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ రెండో టెస్టు ఉన్నట్లుండి ఆసక్తికరంగా మారిపోయింది. వర్షం కారణంగా మొదటి మూడు రోజులు ఆట తుడిచిపెట్టుకుపోగా, నాలుగో రోజు మాత్రం ఎడతెరిపినిచ్చింది. అయితే ఒక్కరోజులోనే మ్యాచ్ రూపురేఖలు మారిపోయాయి. మొదట భారత బౌలర్లు చెలరేగి తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ను 233 పరుగులకే పరిమితం చేశారు. ఆ తర్వాత ధనాధన్ బ్యాటింగ్ తోనూ విరుచుకుపడి..
భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ రెండో టెస్టు ఉన్నట్లుండి ఆసక్తికరంగా మారిపోయింది. వర్షం కారణంగా మొదటి మూడు రోజులు ఆట తుడిచిపెట్టుకుపోగా, నాలుగో రోజు మాత్రం ఎడతెరిపినిచ్చింది. అయితే ఒక్కరోజులోనే మ్యాచ్ రూపురేఖలు మారిపోయాయి. మొదట భారత బౌలర్లు చెలరేగి తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ను 233 పరుగులకే పరిమితం చేశారు. ఆ తర్వాత ధనాధన్ బ్యాటింగ్ తోనూ విరుచుకుపడి మొదటి ఇన్నింగ్స్ ను 285/9 కు డిక్లేర్ చేశారు. దీంతో మొదటి ఇన్నింగ్స్ లో భారత్ కు 52 పరుగుల ఆధిక్యం లభించింది. . భారత్ తరఫున యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ బాగా ఆడారు. యశస్వి జైస్వాల్ 51 బంతుల్లో 72 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ 43 బంతుల్లో 68 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ కేవలం 3 పరుగుల తేడాతో హాఫ్ సెంచరీని కోల్పోయాడు. అతను కేవలం 35 బంతుల్లో 47 పరుగులు చేశాడు. ఇందులో 4 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. దీంతో టీమిండియా కేవలం 34.4 ఓవర్లలో 285 /9 వద్ద మొదటి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. బంగ్లాదేశ్ తరఫున షకీబ్ అల్ హసన్, మెహదీ హసన్ చెరో 4 వికెట్లు తీశారు.
కాగా భారత్ దృష్టి ఇప్పుడు ఆధిక్యం కంటే ఓవర్లు, టైమింగ్‌పైనే ఉంది. నాలుగో రోజు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసినా 19 ఓవర్లు ఆడేందుకు మిగిలి ఉంది. అయితే ఈ 19 ఓవర్లు పూర్తవుతాయా లేదా అన్న సందేహం నెలకొంది. ఇక ఐదో రోజు 98 ఓవర్లు ఉంటాయి. అందువల్ల, బంగ్లాదేశ్ ను త్వరగా ఆలౌట్ చేసి మ్యాచ్ ఫలితాన్ని రాబట్టేలా రోహిత్ ప్రణాళికలు రచిస్తున్నాడు. ఇక నాలుగో రోజు పిచ్ స్పిన్‌కు సహకరించేలా ఉంది. ఇది కూడా మ్యాచ్ రిజల్ట్ పై ప్రభావం చూపవచ్చు.
Innings Break!#TeamIndia have declared after scoring 285/9 in just 34.4 overs and have a lead of 52 runs 👏👏
Bangladesh 2nd innings coming up.
Scorecard – https://t.co/JBVX2gz6EN#INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/8tbuFb6GiT
— BCCI (@BCCI) September 30, 2024
భారత్ (ప్లేయింగ్ ఎలెవన్):
యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI):
షాద్‌మన్ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో (WK), మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్ (wk), మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, హసన్ మహమూద్, ఖలీద్ అహ్మద్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..