IND vs AUS 3rd T20I: పాకిస్థాన్ ప్రపంచ రికార్డుకు భారీ ముప్పు.. టీ20ఐల్లోనే తొలి జట్టుగా మారనున్న భారత్?

T20I Records: ఒకవేళ ఈ మ్యాచ్ టై అయితే, ఫలితాన్ని నిర్ణయించడానికి టైబ్రేకర్ ఉపయోగించబడుతుంది. ఈ ఫార్మాట్ ప్రారంభంలో, టైబ్రేకర్ కోసం బాల్ అవుట్ ఉపయోగించారు. ఇప్పుడు సూపర్ ఓవర్ ట్రెండ్‌లో ఉంది. టై అయిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ టైబ్రేకర్‌లలో భారత్‌ విజయం సాధించింది. అదే సమయంలో, పాకిస్తాన్ తన మూడు టై అయిన మ్యాచ్‌లలో 1 టైబ్రేకర్‌ను మాత్రమే గెలుచుకోగలిగింది. ఈ విధంగా టైబ్రేకర్ విజయాలు జోడిస్తే భారత్ 139, పాకిస్థాన్ 136 విజయాలు సాధించాయి.

IND vs AUS 3rd T20I: పాకిస్థాన్ ప్రపంచ రికార్డుకు భారీ ముప్పు.. టీ20ఐల్లోనే తొలి జట్టుగా మారనున్న భారత్?
Ind Vs Aus 2nd T20i

Updated on: Nov 28, 2023 | 4:59 PM

India vs Australia, 3rd T20I: ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు గౌహతి వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే భారత జట్టు సిరీస్ గెలవడమే కాకుండా ప్రపంచ రికార్డును కూడా సృష్టిస్తుంది. భారత జట్టు పాకిస్థాన్‌ను వెనక్కునెట్టి అత్యధిక టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు గెలిచిన జట్టుగా అవతరిస్తుంది.

భారత్ ఇప్పటి వరకు 211 టీ-20 మ్యాచ్‌లు ఆడగా 135 మ్యాచ్‌లు గెలిచింది. అలాగే 66 మ్యాచ్‌లలో ఓడిపోయింది. 4 మ్యాచ్‌లు టై అయ్యాయి. 6 మ్యాచ్‌లు అసంపూర్తిగా మిగిలాయి. కాగా, 226 టీ-20 ఇంటర్నేషనల్స్‌లో పాకిస్థాన్ 135 గెలిచింది. 82 ఓడిపోయి 3 మ్యాచ్‌లు టై చేసుకుంది. పాకిస్థాన్ ఆడిన 6 మ్యాచ్‌లు అసంపూర్తిగా ఉన్నాయి. మరో విజయంతో భారత జట్టు పాకిస్థాన్‌ను అధిగమించనుంది.

టైబ్రేకర్‌‌లో అగ్రస్థానం టీమిండియాదే..

ఒకవేళ ఈ మ్యాచ్ టై అయితే, ఫలితాన్ని నిర్ణయించడానికి టైబ్రేకర్ ఉపయోగించబడుతుంది. ఈ ఫార్మాట్ ప్రారంభంలో, టైబ్రేకర్ కోసం బాల్ అవుట్ ఉపయోగించారు. ఇప్పుడు సూపర్ ఓవర్ ట్రెండ్‌లో ఉంది. టై అయిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ టైబ్రేకర్‌లలో భారత్‌ విజయం సాధించింది. అదే సమయంలో, పాకిస్తాన్ తన మూడు టై అయిన మ్యాచ్‌లలో 1 టైబ్రేకర్‌ను మాత్రమే గెలుచుకోగలిగింది. ఈ విధంగా టైబ్రేకర్ విజయాలు జోడిస్తే భారత్ 139, పాకిస్థాన్ 136 విజయాలు సాధించాయి.

అయితే, టీ20 రికార్డు పుస్తకాల్లో విజయాలు, టైలు విడివిడిగా లెక్కిస్తుంటారు. అందువల్ల, విజయాల పరంగా పాకిస్థాన్‌ను అధిగమించాలంటే, భారత్ మరో మ్యాచ్ గెలవాల్సి ఉంటుంది.

సొంతగడ్డపై భారత్ అత్యధిక విజయాలు..

టీ-20 మొత్తంలో భారత్ పాకిస్థాన్‌తో సమానంగా ఉండవచ్చు. కానీ, హోమ్ మ్యాచ్‌ల విషయానికి వస్తే, భారత జట్టు ఇప్పటికే అగ్రస్థానంలో ఉంది. భారత్ తన సొంత మైదానంలో 52 మ్యాచ్‌లు గెలిచింది. ప్రపంచంలో ఏ జట్టు కూడా స్వదేశంలో ఇన్ని మ్యాచ్‌లు గెలవలేకపోయింది.

విదేశాల్లో అత్యధిక విజయాలు సాధించిన పాకిస్థాన్..

ప్రత్యర్థుల గడ్డపై అత్యధిక టీ20 మ్యాచ్‌లు గెలిచిన విషయంలో పాకిస్థాన్ ఇప్పటికీ భారత్ కంటే స్వల్ప తేడాతో ముందంజలో ఉంది. ఇప్పటివరకు విదేశాల్లో పాకిస్థాన్ 84 టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 47 గెలిచి 32 ఓడిపోయింది. ఇక భారత జట్టు విషయానికి వస్తే 74 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో భారత్ 45 గెలిచి 25 ఓడింది. ప్రత్యర్థి జట్లపై పాకిస్తాన్ కంటే భారత్ 10 మ్యాచ్‌లు తక్కువగా ఆడింది. అయితే కేవలం 2 విజయాలు మాత్రమే వెనుకంజలో నిలిచింది.

తటస్థ వేదికలైన యూఏఈలో పాకిస్థాన్ అత్యధిక విజయాలు సాధించింది. తటస్థ వేదికలపై అత్యధిక టీ20 మ్యాచ్‌లు ఆడి గెలిచిన రికార్డు పాకిస్థాన్‌కు ఉంది. పాకిస్థాన్ తటస్థ వేదికలపై 105 టీ-20 మ్యాచ్‌లు ఆడి 64 గెలిచింది. ఉగ్రవాదం కారణంగా 2009 నుంచి దాదాపు 6 ఏళ్లపాటు పాకిస్థాన్‌లో అంతర్జాతీయ మ్యాచ్‌లు జరగలేదు. ఈ సమయంలో, పాకిస్తాన్ తన హోమ్ మ్యాచ్‌లను యూఏఈలో ఆడింది. అయితే, అంతర్జాతీయ రికార్డుల్లో దీనిని పాకిస్థాన్ తటస్థ వేదికగా పేర్కొంటారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..