AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: తలపొగరోడు అందించిన క్యాచ్.. మిస్ చేసిన పంత్.. రోహిత్ కోపం చూశారా? వైరల్ వీడియో

టీ20 వరల్డ్‌కప్‌లో సూపర్ 8 స్టేజ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 24 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా సెమీస్‌లోకి ప్రవేశించింది. అయితే, తొలిదశలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్స్ ఆధిపత్యం ప్రదర్శించడం భారత జట్టుకు కొంత ఆందోళన కలిగించింది. ప్రపంచకప్ వంటి టోర్నీలో ఆస్ట్రేలియాతో తలపడుతుంటే.. అది ఎంత భారీ స్కోర్ అయినా, డిఫెండ్ చేసుకోవడానికి ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. అలాంటి సందర్భంలో, రెండో ఓవర్‌లో మిచెల్ మార్ష్ అందించిన ఓ క్యాచ్‌ను తీసుకోవడంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్ విఫలమయ్యాడు.

Video: తలపొగరోడు అందించిన క్యాచ్.. మిస్ చేసిన పంత్.. రోహిత్ కోపం చూశారా? వైరల్ వీడియో
Rishabh Pant Rohit Sharma
Venkata Chari
|

Updated on: Jun 25, 2024 | 11:11 AM

Share

టీ20 వరల్డ్‌కప్‌లో సూపర్ 8 స్టేజ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 24 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా సెమీస్‌లోకి ప్రవేశించింది. అయితే, తొలిదశలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్స్ ఆధిపత్యం ప్రదర్శించడం భారత జట్టుకు కొంత ఆందోళన కలిగించింది. ప్రపంచకప్ వంటి టోర్నీలో ఆస్ట్రేలియాతో తలపడుతుంటే.. అది ఎంత భారీ స్కోర్ అయినా, డిఫెండ్ చేసుకోవడానికి ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. అలాంటి సందర్భంలో, రెండో ఓవర్‌లో మిచెల్ మార్ష్ అందించిన ఓ క్యాచ్‌ను తీసుకోవడంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్ విఫలమయ్యాడు. కెప్టెన్ రోహిత్ శర్మ చాలా కోపంగా కనిపించాడు. పంత్‌పై అరుస్తున్న వీడియో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అసలు బుమ్రా ఓవర్‌లో ఏం జరిగింది?

రోహిత్ తుఫాన్ బ్యాటింగ్ (41 బంతుల్లో 92 పరుగులు) ధాటికి టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత బౌలింగ్‌లో డేవిడ్‌ వార్నర్‌ను తొలి ఓవర్‌లోనే అర్షదీప్‌ అవుట్‌ చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియాపై ఒత్తిడి పెంచేందుకు టీమిండియాకు మంచి అవకాశం లభించింది. రెండో ఓవర్‌లోనే దాని అవకాశం కూడా వచ్చింది. జస్ప్రీత్ బుమ్రా వేసిన నాలుగో బంతి షార్ట్ పిచ్‌గా వచ్చింది. మిచెల్ మార్ష్ పుల్ షాట్ సరిగ్గా ఆడలేకపోయాడు. బంతి అతని బ్యాట్ పైభాగానికి తగిలి లెగ్ సైడ్‌లో వికెట్ వెనుకకు దూసుకెళ్లింది. మరో వికెట్ పడిందని అందరూ అనుకున్నారు. కానీ, వికెట్ కీపర్ రిషబ్ పంత్ బంతిని అందుకోవడంలో తడబడ్డాడు. దీంతో రోహిత్‌కు కోపం వచ్చింది. మిడ్-ఆఫ్‌లో ఫీల్డింగ్ చేస్తూ, అక్కడి నుంచి పంత్‌పై తన కోపాన్ని వెళ్లగక్కాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

లైఫ్‌తో రెచ్చిపోయిన మార్ష్..

పంత్ అందించిన లైఫ్‌ను అసరాగా తీసుకుని, బౌండరీలు కొట్టడం ప్రారంభించాడు. ఒక దశలో టీమ్ ఇండియాకు కొరకరాని కొయ్యగా మారాడు. ట్రావిస్ హెడ్‌తో కలిసి మార్ష్ 81 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో అక్షర్ పటేల్ వేసిన అద్భుతమైన క్యాచ్‌ను మార్ష్ అందుకున్నాడు.

ఆ తర్వాత క్రమంగా ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ కుప్పకూలడం మొదలైంది. చివరికి ఆసీస్ 181 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 24 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీస్‌లోకి దూసుకెళ్లింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..