IND vs AUS: అదరగొట్టిన అమ్మాయిలు.. ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమిండియా.. 50 ఏళ్ల తర్వాత తొలి విజయం

ఈ టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తహ్లియా మెక్‌గ్రాత్ (50) రాణించడంతో 261 పరుగులకు ఆలౌటైంది. టీమ్ ఇండియా తరపున పూజ 53 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు షఫాలీ వర్మ, స్మృతి మంధాన శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 90 పరుగులు చేసిన తర్వాత షఫాలీ వర్మ (40) భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యింది.

IND vs AUS: అదరగొట్టిన అమ్మాయిలు.. ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమిండియా.. 50 ఏళ్ల తర్వాత తొలి విజయం
Indian Women's Cricket Team
Follow us
Basha Shek

|

Updated on: Dec 24, 2023 | 3:06 PM

భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. ఆదివారం (డిసెంబర్‌ 24) ఆసీస్‌తో ముగిసిన ఏకైక టెస్టులో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 50 ఏళ్ల టెస్టు చరిత్రలో ఆస్ట్రేలియాపై భారత మహిళల జట్టుకు ఇదే తొలి విజయం కావడం విశేషం. ఈ టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తహ్లియా మెక్‌గ్రాత్ (50) రాణించడంతో 261 పరుగులకు ఆలౌటైంది. టీమ్ ఇండియా తరపున పూజ 53 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు షఫాలీ వర్మ, స్మృతి మంధాన శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 90 పరుగులు చేసిన తర్వాత షఫాలీ వర్మ (40) భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యింది. ఆ తర్వాత 74 పరుగులు చేసిన స్మృతి మంధాన అనవసర పరుగు కోసం ప్రయత్నించి రనౌట్‌గా వెనుదిరిగారు. ఆ తర్వాత రిచా ఘోష్ (52), జెమీమా రోడ్రిగ్స్ (73) అర్ధ సెంచరీలతో చెలరేగారు. అయితే మిడిలార్డర్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ (0), యస్తికా భాటియా (1) తొందరగానే ఔట్‌ అయి నిరాశపరిచారు. ఈ దశలో కలిసి వచ్చిన దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్ హాఫ్ సెంచరీ భాగస్వామ్యంతో టీమ్ ఇండియాను ఆదుకున్నారు. ముఖ్యంగా 8వ స్థానంలో బరిలోకి దిగిన దీప్తి శర్మ 171 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లతో 78 పరుగులు చేసింది. అలాగే తొమ్మిదో ప్లేస్‌లో వచ్చిన పూజా 126 బంతులు ఎదుర్కొని 47 పరుగులు చేసింది. దీంతో మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా 406 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌పై 187 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది.

187 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టుకు శుభారంభం లభించలేదు. టీమ్ ఇండియా బౌలర్ల ధాటికి ఆసీస్ బ్యాటర్లు మళ్లీ తడబడ్డారు. అయితే మిడిలార్డర్‌లో రంగంలోకి దిగిన తహ్లియా మెక్‌గ్రాత్ మరోసారి ఆస్ట్రేలియా జట్టుకు ఆసరాగా నిలిచింది. 177 బంతులు ఎదుర్కొన్న తహ్లియా 73 పరుగులు చేసి జట్టు స్కోరును 200 దాటించేసింది. దీంతో 3వ రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా జట్టు 5 వికెట్లు కోల్పోయి 233 పరుగులు చేసింది. అయితే 4వ రోజు ఆరంభంలోనే టీమ్ ఇండియాకు తొలి విజయాన్ని అందించడంలో పూజా వస్త్రాకర్ సక్సెస్ అయింది. అలాగే జట్టు స్కోరుకు 28 పరుగులు జోడించడంతో ఆస్ట్రేలియా జట్టు 261 పరుగులకే ఆలౌటైంది. భారత జట్టులో స్నేహ రాణా 63 పరుగులిచ్చి 4 వికెట్లతో మెరిసింది. ఇక టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 75 పరుగుల లక్ష్యాన్ని 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ షఫాలీ వర్మ కేవలం 4 పరుగులకే వెనుదిరిగినా స్మృతి మంధాన, రిచా ఘోష్ హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియాపై టీమిండియాకు ఇదే తొలి టెస్టు విజయం కావడం విశేషం.

ఇవి కూడా చదవండి

50 ఏళ్ల తర్వాత ..

జైషా అభినందనలు..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..