India vs Australia 2nd T20 Nagpur: భారత్, ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్ రెండో మ్యాచ్ నేడు నాగ్‌పూర్ వేదికగా జరగనుంది. సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. నాగ్‌పూర్‌లో జరిగే మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌లోకి తిరిగి రావాలని టీం ఇండియా భావిస్తోంది. నాగ్‌పూర్‌లో టీమిండియా రికార్డును పరిశీలిస్తే, ఇక్కడ చివరి రెండు టీ20 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.
2019లో నాగ్‌పూర్‌లో బంగ్లాదేశ్‌తో టీమిండియా చివరి టీ20 మ్యాచ్ ఆడింది. దీంతో భారత్ 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా, 2017 జనవరిలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. నాగ్‌పూర్‌లో టీమిండియా మొత్తం 4 టీ20 మ్యాచ్‌లు ఆడింది. ఈ సమయంలో 2 మ్యాచ్‌లు గెలిచి, 2 మ్యాచ్‌ల్లో ఓటమిని ఎదుర్కొంది. ఈ మైదానంలో శ్రీలంక, న్యూజిలాండ్‌ల చేతిలో ఓడిపోయింది.
టీ20 ప్రపంచకప్‌నకు ముందు ఆస్ట్రేలియాతో టీమిండియా మూడు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతుండడం గమనార్హం. తొలి మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 208 పరుగులు చేసింది. అయినప్పటికీ మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయింది. నాగ్‌పూర్‌లో విజయం సాధించి సిరీస్‌లోకి తిరిగి రావాలని టీం ఇండియా కోరుకుంటోంది. ఇందుకోసం ప్లేయింగ్ ఎలెవన్‌ను కూడా మార్చనున్నారు.
ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా రెండో మ్యాచ్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు సంపాదించవచ్చు. ప్లేయింగ్ ఎలెవన్‌లోకి రావడంతో ఉమేష్ యాదవ్‌ను తొలగించాల్సి రావచ్చు.
మ్యాచ్ వివరాలు..
ఎప్పుడు: శుక్రవారం, సెప్టెంబర్ 23, 2022, రాత్రి 7:00 గంటలకు.
ఎక్కడ: విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, నాగ్‌పూర్
వాతావరణం: శుక్రవారం నాగ్‌పూర్‌లో వర్షం పడే అవకాశం ఉంది. తేమ 78 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో టాస్‌పై మంచు ప్రభావం చూపించొచ్చని తెలుస్తోంది. వికెట్ స్పిన్నర్లకు కొంత సహాయాన్ని అందించగలదని భావిస్తున్నారు.
ఇరుజట్ల ప్రాబబుల్ ప్లేయింగ్ XI:
టీమిండియా ప్రాబబుల్ ప్లేయింగ్ XI: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్/దీపక్ చాహర్, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా.
ఆస్ట్రేలియా ప్రాబబుల్ ప్లేయింగ్ XI: ఆరోన్ ఫించ్, కామెరాన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్, పాట్ కమిన్స్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్.
స్క్వాడ్‌లు:
భారత జట్టు: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ (సారథి), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ (కీపర్), అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా, ఉమేష్ యాదవ్, రిషబ్ పంత్ , రవిచంద్రన్ అశ్విన్, దీపక్ హుడా
ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్ ఫించ్ (సారథి), కామెరాన్ గ్రీన్, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్ (కీపర్), పాట్ కమిన్స్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్, కేన్ రిచర్డ్‌సన్, సీన్ అబాట్, అష్టన్ అగర్ , డేనియల్ సామ్స్