బెంగళూరు ఎం. చిన్నస్వామి స్టేడియంలో బుధవారం (జనవరి 17) ఆఫ్ఘనిస్థాన్ తో జరిగిన మూడో, చివరి టీ20 మ్యాచ్‌లో టీమిండియా 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను రోహిత్ సేన క్లీన్ స్వీప్ చేసింది . ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ అఫ్గానిస్థాన్‌కు 213 పరుగుల లక్ష్యాన్ని అందించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘనిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి సరిగ్గా 212 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టై అయింది. అనంతరం తొలి సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ 6 బంతుల్లో 16 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించిన భారత్ కూడా 6 బంతుల్లో 16 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ రెండోసారి టై అయింది. దీంతో మ్యాచ్ మరోసారి సూపర్ ఓవర్ కు వెళ్లింది. ఈసారి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఐదు బంతుల్లో 2 వికెట్లు కోల్పోయి 11 పరుగులు చేసింది. దీంతో ఆఫ్ఘనిస్థాన్‌కు 12 పరుగుల లక్ష్యాన్ని అందించింది. ఈ లక్ష్యాన్ని ఛేదించిన ఆఫ్ఘనిస్థాన్ తొలి మూడు బంతుల్లో 1 పరుగు చేసి రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో భారత్ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది.
అంతకుముందు ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 213 పరుగులు చేసింది. టీమ్-రికార్డు ఐదవ T20I సెంచరీని బద్దలు కొట్టిన కెప్టెన్ రోహిత్ శర్మ 121 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. రింకు సింగ్ కూడా 39 బంతుల్లో 69 పరుగులతో అజేయంగా నిలిచాడు. రోహిత్, రింకూ 190 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తద్వారా టీమిండియా 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఆఫ్ఘనిస్థాన్‌కు 213 పరుగుల భారీ లక్ష్యాన్ని అందించింది.
ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆఫ్ఘనిస్థాన్ జట్టులో రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, గుల్బాదిన్ నైబ్ వరుసగా 50, 50, 55 పరుగులు చేశారు. ఆల్ రౌండర్ మహ్మద్ నబీ 34 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో మ్యాచ్ టై అయ్యి రెండు సూపర్ ఓవర్లకు దారి తీసింది.
Two Super Overs were needed to determine the winner of the third #INDvAFG T20I 🤯
Witness some highlights from this intense encounter, ultimately sealed by #TeamIndia 💪#IDFCFirstBankT20ITrophy #GiantsMeetGameChangers #JioCinemaSports pic.twitter.com/hmQo8Saumf
— JioCinema (@JioCinema) January 17, 2024
Ravi Bishnoi comes up trumps in the 2nd Super Over as #TeamIndia seals victory! 👌🔥#IDFCFirstBankT20ITrophy #GiantsMeetGameChangers #JioCinemaSports #INDvAFG #SuperOver pic.twitter.com/cUsqVMTrpH
— JioCinema (@JioCinema) January 17, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..