AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS: కోహ్లీని చూసి దడుచుకుంటోన్న ఆసీస్‌.. కట్టడి చేసేందుకు పక్కా ప్లాన్స్..

వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ పోరుకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఆదివారం (నవంబర్ 19న) జరిగే ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడనుంది. లీగ్ దశలో ఆస్ట్రేలియాపై ఘనవిజయం సాధించిన టీమ్ ఇండియా.. ఈసారి కూడా గెలుస్తామన్న విశ్వాసంతో ఉంది. అయితే ఆస్ట్రేలియా జట్టు..

IND vs AUS: కోహ్లీని చూసి దడుచుకుంటోన్న ఆసీస్‌.. కట్టడి చేసేందుకు పక్కా ప్లాన్స్..
India Vs Australia
Basha Shek
|

Updated on: Nov 18, 2023 | 9:38 PM

Share

వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ పోరుకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఆదివారం (నవంబర్ 19న) జరిగే ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడనుంది. లీగ్ దశలో ఆస్ట్రేలియాపై ఘనవిజయం సాధించిన టీమ్ ఇండియా.. ఈసారి కూడా గెలుస్తామన్న విశ్వాసంతో ఉంది. అయితే ఆస్ట్రేలియా జట్టు విజయం కోసం ప్రత్యేక వ్యూహం రచిస్తోంది. ఈ ముఖ్యంగా ప్రపంకప్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగుతోన్న విరాట్ కోహ్లీకి అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఎందుకంటే ఆస్ట్రేలియాకు కింగ్ కోహ్లీ వికెట్ కీలకం. గత మ్యాచుల్లో ఆసీస్‌పై విరాట్ కోహ్లి ప్రదర్శనే ఇందుకు నిదర్శనం. లీగ్ దశలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా కేవలం 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో విరాట్ కోహ్లీ ఆసీస్‌ విజయానికి అడ్డుగా నిలిచాడు. కేఎల్ రాహుల్ తో కలిసి 165 పరుగుల భాగస్వామ్యంతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఆ మ్యాచ్‌లో 85 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ ఇప్పుడు మొత్తం 711 పరుగులు చేసి ఈ ప్రపంచకప్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంటే అంతకుముందు ఆస్ట్రేలియాపై అద్భుత ప్రదర్శన చేస్తున్న కోహ్లి ఇప్పుడు అత్యుత్తమ ఫామ్‌లో ఉండటం ఆసీస్ జట్టులో ఆందోళనను పెంచింది. వన్డే క్రికెట్‌లో ఆస్ట్రేలియాపై విరాట్ కోహ్లి ఆటతీరు ఎలా ఉందో చూస్తే ఈ భయానికి కారణమని తెలుస్తోంది.

రన్ మెషిన్‌:

కింగ్ కోహ్లీ ఆస్ట్రేలియాతో 48 వన్డేలు ఆడాడు. ఈసారి, అతను 46 ఇన్నింగ్స్‌లలో 53.79 సగటుతో 2313 పరుగులు చేశాడు. అంటే సచిన్ టెండూల్కర్ (3,077) తర్వాత ఆస్ట్రేలియాపై అత్యుత్తమ ప్రదర్శన చేసిన బ్యాట్స్‌మెన్‌లలో కింగ్ కోహ్లీ కూడా ఒకడు.

సెంచరీలు:

ఆస్ట్రేలియాపై 46 వన్డే ఇన్నింగ్స్‌లు ఆడిన విరాట్ కోహ్లీ మొత్తం 8 సెంచరీలు సాధించాడు. అంటే సచిన్ టెండూల్కర్ (9) తర్వాత ఆసీస్‌పై అత్యధిక సెంచరీల రికార్డు కింగ్ కోహ్లీ పేరిట ఉంది. ఇది కాకుండా 13 అర్ధ సెంచరీలు చేశాడు. ఇందులో కింగ్ కోహ్లీ ఆసీస్‌పై ఎలా రాణిస్తాడో ఊహించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

స్వదేశంలో రికార్డు :

భారత్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేల్లో విరాట్ కోహ్లీ 28 సార్లు బ్యాటింగ్ చేశాడు. ఈసారి 57.16 సగటుతో 1,429 పరుగులు చేశాడు. అంటే స్వదేశంలో పటిష్ట ఆస్ట్రేలియాపై విరాట్ కోహ్లి 50కి పైగా సగటును కొనసాగించగలిగాడు.

చేజ్ మాస్టర్:

వన్డే క్రికెట్‌లో ఆస్ట్రేలియాపై విరాట్ కోహ్లీ 8 సెంచరీలు సాధించాడు. ఈ ఎనిమిది సెంచరీల్లో 6 సెంచరీలు ఛేజింగ్‌లోనే కావడం విశేషం. ఛేజింగ్‌లో 6 అర్ధసెంచరీలు కూడా చేశాడు. అంటే ఆసీస్ పై ఒత్తిడిని తట్టుకుని జట్టుకు విజయాన్ని అందించడంలో కింగ్ కోహ్లీ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

ప్రపంచకప్ లో  ఫామ్:

ప్రస్తుత ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. కింగ్ కోహ్లీ 10 మ్యాచ్‌ల్లో బ్యాట్‌తో 3 సెంచరీలు, 5 అర్ధసెంచరీలు సాధించడమే ఇందుకు నిదర్శనం. ఈ ప్రపంచకప్‌లో 101.57 సగటుతో 711 పరుగులు కూడా చేశాడు. ప్రపంచకప్‌లో ఒక వన్డే ఎడిషన్‌లో బ్యాటర్‌ చేసిన అత్యధిక పరుగుల రికార్డు ఇదే. వీటిని చూసే కోహ్లీని కట్టడి చేసేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..