IND vs NZ: ధర్మశాలలో భారీ వర్షం.. ఆదివారం మ్యాచ్‌పై ఎఫెక్ట్ ఉంటుందా? వాతావరణ శాఖ నివేదిక ఇదే..
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టేబుల్ టాపర్ మ్యాచ్ న్యూజిలాండ్, ఆతిథ్య భారత్ జట్ల మధ్య ఆదివారం ధర్మశాలలో హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (HPCA) స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకం. ఎందుకంటే ఈ మెగా క్రికెట్ టోర్నీలో ఇరు జట్లు వరుస విజయాలతో దూసుకెళుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ప్రపంచకప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానం సొంతం చేసుకుంటుంది.

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టేబుల్ టాపర్ మ్యాచ్ న్యూజిలాండ్, ఆతిథ్య భారత్ జట్ల మధ్య ఆదివారం ధర్మశాలలో హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (HPCA) స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకం. ఎందుకంటే ఈ మెగా క్రికెట్ టోర్నీలో ఇరు జట్లు వరుస విజయాలతో దూసుకెళుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ప్రపంచకప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానం సొంతం చేసుకుంటుంది. కాబట్టి మ్యాచ్ హోరాహోరీగా జరగవచ్చని తెలుస్తోంది. కాగా వన్డే ప్రపంచకప్‌లో చివరిసారిగా భారత్, న్యూజిలాండ్ తలపడినప్పుడు టీమిండియా పరాజయం పాలైంది.మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగిన 2019 ప్రపంచకప్ సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఇదే చివరి అంతర్జాతీయ మ్యాచ్ కూడా. 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్ వర్షం కారణంగా రిజర్వ్ డేలో జరిగింది. ఇప్పుడు ఇరు జట్లు మరోసారి ప్రపంచకప్‌లో తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. ఆదివారం నాటి మ్యాచ్‌లో పిడుగులు పడే అవకాశం ఉంది.
వాతావరణ శాఖ ప్రకారం, మధ్యాహ్నం టాస్ నాటికి, ఉరుములతో కూడిన జల్లులు, అలాగే 43 శాతం వర్షం పడే అవకాశం ఉంది. దీంతో టాస్ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అంతకుముందు దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్‌కు కూడా వర్షం అంతరాయం కలిగించింది. ధర్మశాలలో శనివారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. కాగా ఇండియా, న్యూజిలాండ్‌ల మధ్య జరిగే లీగ్ మ్యాచ్‌కు ఐసీసీ షరతులలో ‘రిజర్వ్ డే’ అనే నిబంధన లేదు. ఆదివారం మ్యాచ్ వర్షం కారణంగా రద్దైతే ఇరు జట్లకు ఒక్కో పాయింట్ దక్కుతుంది. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం పిచ్ ఫాస్ట్ బౌలర్లకు ఉపయోగపడుతుంది. ఈ పిచ్‌పై సగటు తొలి ఇన్నింగ్స్ స్కోరు 231 కాగా, రెండో ఇన్నింగ్స్‌లో 199 పరుగులు చేయడం ఇప్పటి వరకు రికార్డు. మొదట బ్యాటింగ్ చేసిన జట్ల కంటే రెండో బ్యాటింగ్ చేసిన జట్లు ఎక్కువ విజయాలు సాధించాయి.
టీమ్ ఇండియా:
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమ్మీ, రవిచంద్రన్ అశ్విన్. , ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్.
న్యూజిలాండ్ జట్టు:
కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, టిమ్మీ, విల్ సౌత్ యంగ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




