భారత్ VS బంగ్లా మ్యాచ్: పట్టు బిగిస్తున్న ఇండియా బౌలర్లు

భారత్‌తో బర్మింగ్‌హామ్ వేదికగా ఈరోజు జరుగుతున్న మ్యాచ్‌లో 315 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ జట్టు కీలక సమయంలో ఓపెనర్ల వికెట్లు చేజార్చుకుంది. ఇన్నింగ్స్ 10వ ఓవర్‌లో షమీ విసిరిన బంతిని అర్థం చేసుకోలేకపోయిన ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (22: 31 బంతుల్లో 3×4) వికెట్ చేజార్చుకోగా.. అనంతరం కాసేపు నిలకడగా ఆడిన మరో ఓపెనర్ సౌమ్య సర్కార్ (33: 38 బంతుల్లో 4×4) హార్దిక్ బౌలింగ్‌లో కోహ్లీకి సులువైన క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇక […]

భారత్ VS బంగ్లా మ్యాచ్: పట్టు బిగిస్తున్న ఇండియా బౌలర్లు

Updated on: Jul 02, 2019 | 9:11 PM

భారత్‌తో బర్మింగ్‌హామ్ వేదికగా ఈరోజు జరుగుతున్న మ్యాచ్‌లో 315 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ జట్టు కీలక సమయంలో ఓపెనర్ల వికెట్లు చేజార్చుకుంది. ఇన్నింగ్స్ 10వ ఓవర్‌లో షమీ విసిరిన బంతిని అర్థం చేసుకోలేకపోయిన ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (22: 31 బంతుల్లో 3×4) వికెట్ చేజార్చుకోగా.. అనంతరం కాసేపు నిలకడగా ఆడిన మరో ఓపెనర్ సౌమ్య సర్కార్ (33: 38 బంతుల్లో 4×4) హార్దిక్ బౌలింగ్‌లో కోహ్లీకి సులువైన క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇక 23వ వేసిన చాహల్ చివరి బంతికి ముష్పికర్ రహీమ్ 24 ను పెవిలియన్‌క పంపాడు. 23 ఓవర్లు ముగిసేసరికి బంగ్లా స్కోరు 122/3.  షకిబుల్ హసన్ 40 పరుగులతో లిటాన్ దాస్ అసలు పరుగులు ఏమి చెయ్యకుండా క్రీజులో ఉన్నారు.