Women World Cup 2025: నేటి నుంచి మహిళల వన్డే వరల్డ్ కప్.. తొలి మ్యాచ్‌లో శ్రీలంకతో తలబడనున్న భారత్
సుమారు 12 ఏళ్ల తర్వాత ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ తిరిగి భారతదేశానికి రానుంది. చివరి సారిగా 2013లో భారత్ దీనికి హోస్ట్‌గా చేసింది. తాజాగా 2025లో జరగనున్న ICC మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌కు శ్రీలంకతో కలిసి భారత్ హోస్టింగ్ చేయనుంది. ఈ టోర్నీ హైబ్రిడ్ మోడల్‌లో జరుగుతుంది. కాబట్టి ఎక్కువ మ్యాచ్‌లు ఇండియాలోనే జరగనున్నాయి.

సుమారు 12 ఏళ్ల తర్వాత ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ తిరిగి భారతదేశానికి రానుంది. చివరి సారిగా 2013లో భారత్ దీనికి హోస్ట్‌గా చేసింది. తాజాగా 2025లో జరగనున్న ICC మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌కు శ్రీలంకతో కలిసి భారత్ హోస్టింగ్ చేయనుంది. ఈ టోర్నీ హైబ్రిడ్ మోడల్‌లో జరుగుతుంది. కాబట్టి ఎక్కువ మ్యాచ్‌లు ఇండియాలోనే జరగనున్నాయి. మంగళవారం గౌహతీ వేదికగా ఈ టోర్నీ ప్రాంరభం కానుంది. నవంబర్ 2వ తేదీ వరకు ఈ టోర్నీ కొనసాగనుంది. ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో పాటు ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, భారతదేశం సహా మొత్తం 8 జట్లు పాల్గొంటాయి.
ఈ 8 జట్లు గ్రూప్ స్టేజ్‌లో రౌండ్-రాబిన్ పోటీ, టాప్-4 సెమీఫైనల్‌కు, ఫైనల్ కొలంబోలో జరగనుంది. ICC మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌లో ఇండియాలో జరిగే మ్యాచ్‌లు ప్రధానంగా ఈ నగరాల్లో జరగనున్నాయి. భారత్‌లో గౌహతి, బెంగళూరు, నవీ ముంబై, విశాఖపట్నంలో మ్యాచ్‌లు జరగనున్నాయి. మరికొన్ని శ్రీలంకలో కొలంబోలో జరగనున్నాయి.
ఇక ఈ టోర్నీలో భాగంగా మంగళవారం గువాహటిలో తొలి మ్యాచ్ భారత్, శ్రీలంక మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్‌లో భారత బ్యాటింగ్ లైనప్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వం వహిస్తుంది. ఏడాదిలో జరిగిన నాలుగు వన్డేల్లో ఈమె సెంచరీలు సాధించింది. వాటిలో ఆస్ట్రేలియాపై వరుసగా సెంచరీలు ఉన్నాయి, సగటున 66.28 స్ట్రైక్ రేట్ 115.85. యువ ఓపెనర్ ప్రతీకా రావల్‌తో ఆమె భాగస్వామ్యాలు భారత టాప్ ఆర్డర్‌ను బలోపేతం చేశాయి. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ప్రస్తుతం తన ఐదవ ప్రపంచ కప్ ఆడుతున్నాడు. ఈమెకు ఉన్న అనుభవంతో అధిక ఒత్తిడి సమయంలోనూ నిలకడ ప్రదర్శనతో మ్యాచ్‌కు ముందుకు తీసుకెళ్లగలదు.
INDW vs SLW: అంచనా వేసిన ప్లేయింగ్ XI
భారత్ అంచనా టీయ్: ప్రతీకా రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), స్నేహ రాణా, రాధా యాదవ్, క్రాంతి గౌడ్, రేణుకా సింగ్ ఠాకూర్
శ్రీలంక అంచనా టీమ్: హాసిని పెరెరా, చమరి అతపత్తు (కెప్టెన్ ), హర్షిత సమరవిక్రమ, విష్మి గుణరత్నే, అనుష్క సంజీవని (WK), కవిషా దిల్హరి, దేవ్మీ విహంగ, పియుమి వత్సలా, అచ్చిని కులసూర్య, ఉదేశిక ప్రబోధని, మల్కీ మదర
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




