T20 WC 2024: 8 ఏళ్ల చరిత్రలో తొలిసారి.. తొలి ట్రోఫీతోపాటు కివీస్‌కు భారీగా ప్రైజ్‌మనీ.. భారత్‌కు దక్కింది ఎంతంటే?

|

Oct 21, 2024 | 9:58 AM

ICC Women's T20 World Cup 2024: తొలిసారి ట్రోఫీ అందుకున్న న్యూజిలాండ్ మహిళల జట్టు.. 8 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్ చరిత్రలో కొత్త ఛాంపియన్‌గా వెలుగు చూసింది. దీంతో న్యూజిలాండ్ జట్టుకు భారీగా ప్రైజ్ మనీ దక్కింది. అలాగే, లీగ్ దశలో నిష్క్రమించిన భారత జట్టుకు కూడా ప్రైజ్ మనీ అందింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

T20 WC 2024: 8 ఏళ్ల చరిత్రలో తొలిసారి.. తొలి ట్రోఫీతోపాటు కివీస్‌కు భారీగా ప్రైజ్‌మనీ.. భారత్‌కు దక్కింది ఎంతంటే?
New Zealand Womens T20 Wc W
Follow us on

ICC Women’s T20 World Cup 2024: ICC గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి మహిళల T20 ప్రపంచ కప్ ప్రైజ్ మనీని రెట్టింపు చేసింది. ఈ విధంగా న్యూజిలాండ్ ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక ప్రైజ్ మనీ గెలుచుకున్న ఛాంపియన్ జట్టుగా నిలిచింది. జట్లకు టైటిల్స్ గెలిచినందుకు మాత్రమే కాకుండా గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు గెలిచినందుకు కూడా ప్రైజ్ మనీ లభిస్తుంది.

8 ఏళ్ల తర్వాత మహిళల టీ20 క్రికెట్‌లో కొత్త ఛాంపియన్‌..

న్యూజిలాండ్ తొలిసారిగా మహిళల T20 ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకుంది. గత కొన్నేళ్లుగా ఆస్ట్రేలియా మహిళల జట్టు ప్రస్థానాన్ని ముగించింది. అక్టోబర్ 20 ఆదివారం దుబాయ్‌లో జరిగిన ఫైనల్‌లో, న్యూజిలాండ్ 32 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. దీనితో, తన మూడవ ఫైనల్ ఆడుతూ, మొదటిసారి ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది. న్యూజిలాండ్ ప్రపంచ కప్ ట్రోఫీని అందుకుంది. దాదాపు 20 కోట్ల రూపాయల బహుమతిని కూడా అందుకుంది. దక్షిణాఫ్రికాకు కూడా రూ.10 కోట్లు రాగా, తొలి రౌండ్‌లోనే నిష్క్రమించిన టీమ్‌ఇండియాకు కూడా కాస్త డబ్బు లభించింది.

అక్టోబర్ 3న UAEలో ప్రారంభమైన ఈ టోర్నమెంట్ అక్టోబర్ 20న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఫైనల్‌తో ముగిసింది. ఈ ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 158 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ లక్ష్యం దక్షిణాఫ్రికాకు చాలా పెద్దదని నిరూపితమైంది. మొత్తం జట్టు 20 ఓవర్లలో 126 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ విధంగా న్యూజిలాండ్ తొలిసారి టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. కాగా, దక్షిణాఫ్రికా మరోసారి టైటిల్‌ను కోల్పోయింది. గతేడాది కూడా ఫైనల్‌లోనే ఆస్ట్రేలియా చేతిలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

ప్రపంచ ఛాంపియన్‌గా న్యూజిలాండ్..

ఈ విజయంతో తొలిసారిగా మహిళల టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ అందమైన ట్రోఫీని అందుకుంది. అయితే ట్రోఫీనే కాదు, టోర్నీలో అత్యుత్తమ జట్టుగా నిలిచిన న్యూజిలాండ్‌కు అద్భుతమైన బహుమతి కూడా లభించింది. ఐసీసీ ఈసారి మహిళల టీ20 ప్రపంచకప్ ప్రైజ్ మనీని రెట్టింపు చేసింది. ఈ విధంగా, ఛాంపియన్ న్యూజిలాండ్‌కు కూడా 2.34 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.19.67 కోట్ల బహుమతి లభించింది. మహిళల టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో ఏ ఛాంపియన్‌ జట్టుకు అందని అతిపెద్ద ప్రైజ్‌మనీ ఇదే. ఇది కాకుండా, గ్రూప్ దశలో ఒక మ్యాచ్ గెలిచిన ప్రతి జట్టుకు రూ. 26.19 లక్షలు కూడా అందించారు. గ్రూప్ దశలో న్యూజిలాండ్ 3 మ్యాచ్‌లు గెలిచింది. అందువల్ల అదనంగా రూ. 78 లక్షలు పొందుతుంది. ఈ విధంగా న్యూజిలాండ్ దాదాపు రూ.20.45 కోట్లు పారితోషికంగా అందుకోనుంది.

దక్షిణాఫ్రికా, భారత్‌కు ఎంత అందాయంటే?

రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికా ఫైనల్స్‌కు చేరినందుకు 1.17 మిలియన్ డాలర్లు అంటే రూ.9.83 కోట్ల బహుమతిని అందుకుంటుంది. గ్రూప్ దశలో దక్షిణాఫ్రికా కూడా 3 మ్యాచ్‌లు గెలుపొందింది, తద్వారా అదనంగా రూ. 78 లక్షలు కూడా పొందుతుంది. అంటే దక్షిణాఫ్రికా జట్టు మొత్తం దాదాపు రూ.10.62 కోట్లకు చేరుకుంటుంది. టీమ్ ఇండియా విషయానికి వస్తే, టోర్నీలో నిరాశపరిచిన ప్రదర్శన చేసింది. భారత జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. అయితే, టీమ్ ఇండియా తన గ్రూప్‌లో శ్రీలంక, పాకిస్తాన్‌లను ఓడించింది. అందువల్ల, ఈ 2 మ్యాచ్‌లను గెలిచినందుకుగానూ కేవలం రూ. 52 లక్షలు మాత్రమే పొందుతుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..