Team India: ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు.. ఆ ఏడుగురు ఔట్.. చాలా రోజుల తర్వాత స్వ్కాడ్‌లో చేరిన ఇద్దరు?

|

Jul 09, 2024 | 5:51 PM

India Probable Team for Champions Trophy 2025: టీ20లో ప్రపంచ ఛాంపియన్‌గా మారిన తర్వాత, ఇప్పుడు భారత జట్టు ముందున్న తదుపరి అతిపెద్ద సవాలు ఛాంపియన్స్ ట్రోఫీ. వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. టీం ఇండియా పాకిస్థాన్‌కు వెళ్లాలా వద్దా అనే విషయంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే, ఇప్పుడు సాధ్యమయ్యే జట్టును పరిశీలిస్తే, ఈ భారీ టోర్నమెంట్‌కు చాలా మంది ఆటగాళ్లను ఎంపిక చేయవచ్చని తెలుస్తోంది.

Team India: ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు.. ఆ ఏడుగురు ఔట్.. చాలా రోజుల తర్వాత స్వ్కాడ్‌లో చేరిన ఇద్దరు?
Team India
Follow us on

India Probable Team for Champions Trophy 2025: టీ20లో ప్రపంచ ఛాంపియన్‌గా మారిన తర్వాత, ఇప్పుడు భారత జట్టు ముందున్న తదుపరి అతిపెద్ద సవాలు ఛాంపియన్స్ ట్రోఫీ. వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. టీం ఇండియా పాకిస్థాన్‌కు వెళ్లాలా వద్దా అనే విషయంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే, ఇప్పుడు సాధ్యమయ్యే జట్టును పరిశీలిస్తే, ఈ భారీ టోర్నమెంట్‌కు చాలా మంది ఆటగాళ్లను ఎంపిక చేయవచ్చని తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం టీమిండియాలో ఏ ఆటగాళ్లకు అవకాశం లభిస్తుంది, ఎవరిని తొలగించవచ్చు అనే విషయాలను ఓసారి చూద్దాం..

రితురాజ్ గైక్వాడ్‌కు జట్టులో చోటు దక్కే ఛాన్స్..

ఓపెనర్ల గురించి మాట్లాడితే, రోహిత్ శర్మతో పాటు శుభ్‌మన్ గిల్‌కు అవకాశం లభించవచ్చు. ఈ ఇద్దరి జోడీ ప్రపంచకప్ 2023లో కూడా ఓపెనింగ్ చేసి చాలా విజయాలు సాధించింది. రుతురాజ్ గైక్వాడ్‌ను బ్యాకప్ ఓపెనర్‌గా ఎంచుకోవచ్చు. విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఆడగలడు. మిడిలార్డర్‌లో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, సంజూ శాంసన్‌లను ఎంపిక చేయవచ్చు. పంత్ 2023 ప్రపంచ కప్‌లో భాగం కాదు. అయితే, అతను ఛాంపియన్స్ ట్రోఫీ కోసం జట్టులో ఖచ్చితంగా స్థానం పొందగలడు. ఎడమచేతి వాటం అయిన అతను జట్టుకు వైవిధ్యాన్ని తెస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు.

కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ తిరిగి వచ్చే ఛాన్స్..

KL రాహుల్ టీ20 ప్రపంచ కప్ 2024 కోసం ఎంపిక కాలేదు. కానీ, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం జట్టులో ఖచ్చితంగా స్థానం పొందవచ్చని తెలుస్తోంది. వన్డే జట్టు నుంచి అతడిని విస్మరించలేం. మిడిలార్డర్‌లో అతను జట్టుకు స్థిరత్వాన్ని అందిస్తున్నాడు. సంజూ శాంసన్ ఎంపిక కూడా దాదాపు ఖరారైంది. ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యాకు జట్టులో చోటు దక్కవచ్చు. స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌లను చేర్చుకోవచ్చు. జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ ఫాస్ట్ బౌలర్‌లుగా ఉండవచ్చు.

మహ్మద్ షమీ ప్రస్తుతం గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. అయితే, అతను ఛాంపియన్స్ ట్రోఫీ వరకు తిరిగి జట్టులోకి రావచ్చు. యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, శ్రేయాస్ అయ్యర్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్, శివమ్ దూబే, శార్దూల్ ఠాకూర్ వంటి ఆటగాళ్లకు అవకాశం దక్కుతుందన్న ఆశ లేదు. ఈ ఆటగాళ్ల పేర్లు లిస్టు నుంచి తప్పించే అవకాశం ఉంది.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం భారత ప్రాబబుల్ జట్టు: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సంజూ శాంసన్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..