AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhanashree Verma : కోర్టులో నేను ఏడుస్తూనే ఉన్నాను.. చాహల్ తో విడాకుల గురించి ధనశ్రీ వర్మ ఆవేదన

క్రికెటర్ యజువేంద్ర చాహల్ మాజీ భార్య, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ, వారి విడాకుల ప్రక్రియ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. విడాకుల సమయంలో కోర్టులో తాను చాలా ఎమోషనల్‌గా ఏడ్చానని ధనశ్రీ వర్మ చెప్పారు. అలాగే, కోర్టుకు చాహల్ బీ యువర్ ఓన్ షుగర్ డాడీ అనే టీ-షర్ట్ వేసుకుని రావడంపై కూడా ఆమె స్పందించారు.

Dhanashree Verma : కోర్టులో నేను ఏడుస్తూనే ఉన్నాను.. చాహల్ తో విడాకుల గురించి ధనశ్రీ వర్మ ఆవేదన
Yuzvendra Chahal
Rakesh
|

Updated on: Aug 20, 2025 | 8:08 AM

Share

Dhanashree Verma : టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్తో విడాకులపై ఆయన మాజీ భార్య, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వెర్మా తాజాగా ఒక పాడ్‌కాస్ట్‌లో సంచలన విషయాలు వెల్లడించారు. విడాకుల సమయంలో కోర్టులో తన భావోద్వేగాల గురించి, అలాగే చాహల్ ధరించిన బీ యువర్ ఓన్ షుగర్ డాడీ టీ-షర్టు వివాదంపై కూడా ధనశ్రీ మాట్లాడారు. హ్యూమన్స్ ఆఫ్ బాంబే పాడ్‌కాస్ట్‌లో ధనశ్రీ మాట్లాడుతూ.. విడాకుల రోజు జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నారు. “నేను కోర్టులో నిలబడి ఉన్నప్పుడు, తీర్పు ఇవ్వబోతున్న క్షణం నాకు ఇంకా గుర్తుంది. మానసికంగా మేము సిద్ధపడి ఉన్నప్పటికీ నేను చాలా ఎమోషనల్‌గా అయ్యాను. అందరి ముందు బోరున ఏడ్చాను” అని ధనశ్రీ వెర్మా అన్నారు.

“ఆ సమయంలో నా మనసులో ఉన్న భావాలను నేను బయటకు చెప్పలేకపోయాను. నాకు గుర్తున్నదంతా నేను బోరున ఏడుస్తూ ఉన్నాను. ఇదంతా జరిగిన తర్వాత, అతను (చాహల్) ముందు బయటకు వెళ్ళిపోయాడు” అని ఆమె చెప్పారు. విడాకుల ప్రక్రియ సమయంలో చాహల్ ‘బీ యువర్ ఓన్ షుగర్ డాడీ’ అని రాసి ఉన్న టీ-షర్టు ధరించడం అప్పట్లో పెద్ద వివాదంగా మారింది. ఆ సంఘటనపై ధనశ్రీ స్పందిస్తూ, “ఈ టీ-షర్టు వ్యవహారం గురించి నాకు తెలిసే కంటే ముందే, జనాలు దీనికి నన్నే నిందించబోతున్నారని మాకు తెలుసు. కోర్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత చాహల్ టీ-షర్టు వీడియోలను చూసి నేను ఆశ్చర్యపోయాను. ‘అరే భాయ్, వాట్సాప్ చేసేస్తే సరిపోయేది. టీ-షర్టు ఎందుకు వేసుకోవడం?’ అని నాకు అనిపించింది” అని అన్నారు.

“ఈ విషయంలో చాలా పరిణతితో వ్యవహరించాలని నేను భావిస్తాను. నేను ఆ మార్గాన్నే ఎంచుకున్నాను. అపరిపక్వమైన ప్రకటనలు చేయడం కంటే పరిణతిని ఎంచుకున్నాను. ఎందుకంటే, నేను నా కుటుంబ గౌరవాన్ని లేదా అతని కుటుంబ గౌరవాన్ని దెబ్బతీయాలనుకోలేదు. మనం గౌరవాన్ని కాపాడుకోవాలి,” అని ధనశ్రీ చెప్పారు. మహిళల పట్ల సమాజం ఆలోచనల గురించి కూడా ఆమె మాట్లాడారు. “ఒక మహిళగా మనం సర్దుకుపోవాలని, దేన్నీ విడిచిపెట్టకూడదని నేర్పిస్తారు. మన సమాజం గురించి మనకు బాగా తెలుసు. అందుకే, మనకు ఎన్నో ముద్రలు వేస్తారు” అని ధనశ్రీ వ్యాఖ్యానించారు.

చివరగా ధనశ్రీ తన మాజీ భర్తకు మద్దతుగా ఉన్న విషయంపై స్పందిస్తూ “మీరు ఒక వ్యక్తిగా ఆ రోజు ఎలా వ్యవహరిస్తారు అనేది మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది” అని ముగించారు. ధనశ్రీ, చాహల్ 2020లో వివాహం చేసుకుని 2025లో విడాకులు తీసుకున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..