Sunrisers Hyderabad: కూరగాయలు అమ్ముకునే వ్యక్తి కొడుకు.. ఐపీఎల్‎లో 151.03 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్.. ఆకట్టుకుంటున్న జమ్మూ యువకుడు..

Srinivas Chekkilla

Srinivas Chekkilla |

Updated on: Oct 07, 2021 | 3:17 PM

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి మరో కొత్త బౌలర్ ఎంట్రి ఇచ్చాడు. ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‎లో హైదరాబాద్ తరఫున జమ్మూకు చెందిన 21 ఏళ్ల స్పీడ్‌స్టర్ ఉమ్రాన్ మాలిక్ అరంగేట్రం చేశాడు...

Sunrisers Hyderabad: కూరగాయలు అమ్ముకునే వ్యక్తి కొడుకు.. ఐపీఎల్‎లో 151.03 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్.. ఆకట్టుకుంటున్న జమ్మూ యువకుడు..
Umran Malik
Follow us

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి మరో కొత్త బౌలర్ ఎంట్రి ఇచ్చాడు. ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‎లో హైదరాబాద్ తరఫున జమ్మూకు చెందిన 21 ఏళ్ల స్పీడ్‌స్టర్ ఉమ్రాన్ మాలిక్ అరంగేట్రం చేశాడు. అతను 151.03 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరాడు. బుధవారం బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‏తో జరిగిన మ్యాచ్‎లో ఉమ్రాన్ మాలిక్ 4 ఓవర్లు వేసి ఒక వికెట్ తీసి 21 పరుగులు ఇచ్చాడు. ఉమ్రాన్ మాలిక్ కూరగాయలు, పండ్ల విక్రయించే అబ్దుల్ మాలిక్ కుమారుడు. ఐపీఎల్ కోసం తన కుమారుడు పడిన కష్టాన్ని అబ్దుల్ మాలిక్ చాలా భావోద్వేగంతో చెప్పారు. తన కుమారుడు ఐపీఎల్‎కు ఎంపిక కావడం చూసి తను, తన భార్య కన్నీళ్లు పెట్టుకున్నామని వివరించారు. తన కొడుకు ఏదో ఒకరోజు భారత్ తరఫున కూడా ఆడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

“నా కొడుకు మూడు సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు క్రికెట్ వైపు మళ్లాడు. అతను ఎప్పుడూ ప్రొఫెషనల్ క్రికెటర్ కావాలని కలలు కనేవాడు. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టుకు అతను ఎంపికైనప్పుడు మేము చాలా సంతోషించాం. నేను, నా భార్య టీవీకి అతుక్కుపోయాం. అప్పడు మాకు ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి. నా కొడుకు చాలా కష్టపడ్డాడు. మేము ఎప్పుడూ అతనికి మద్దతు ఇచ్చాం. ఏదో ఒక రోజు అతను టీమ్ ఇండియా తరఫున ఆడతాడని మేము ఆశిస్తున్నాం” అని అబ్దుల్ మాలిక్ అన్నారు.

ఉమ్రాన్ మాలిక్ తన తొలి ఐపీఎల్ మ్యాచ్‎లో వికెట్ తీయలేనప్పుటికీ అతడి వేగంతో అందరిని ఆకట్టుకున్నాడు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‎లో మాలిక్ రాణించాడు. ఉమ్రాన్ ఆదివారం ఐపీఎల్‌లో అరంగేట్రం చేసినప్పటి నుంచి జమ్మూలోని షహీదీ చౌక్ సమీపంలో అతని తండ్రిని స్థానికులు కలిసి అభినందనలు చెబుతున్నారు.

Read Also.. IPL 2021: అగ్రస్థానం కోసం చెన్నై, ఢిల్లీ కొట్లాట.. రోహిత్‌సేనకు చావోరేవో.! కోహ్లీ టీం ఖుషీ..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Click on your DTH Provider to Add TV9 Telugu