Video: రేయ్.. ఏందిరా ఇది.. ఇలా కూడా ఆడతారా? క్రికెట్ పుట్టినప్పటి నుంచి ఇలాంటి సీన్ చూసి ఉండరు!
న్యూజిలాండ్-ఏ, బంగ్లాదేశ్-ఏ మ్యాచ్‌లో వికెట్ కీపర్ ఫస్ట్ స్లిప్‌లో ఉండగా, ఆయన హెల్మెట్ వికెట్ల వెనుక ఉంది. బ్యాటర్ బంతిని మిస్ చేయడంతో అది హెల్మెట్‌కు తగిలింది. అంపైర్ న్యూజిలాండ్‌కు 5 రన్లు ఇచ్చారు. ఈ విచిత్ర ఘటన క్రికెట్ ప్రేక్షకులను నవ్వించింది, ఆశ్చర్యానికి గురిచేసింది. బంగ్లాదేశ్ వికెట్ కీపర్ నిర్లక్ష్యం అందరినీ ఆశ్చర్యపరిచింది.

క్రికెట్‌లో ఎన్నో ఫన్నీ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. కొన్ని నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగే క్రికెట్.. కొన్ని సార్లు ఆటగాళ్లు చేసే తప్పిదాలకు కడుపుబ్బా నవ్విస్తుంది కూడా. తాజా అలాంటి నవ్వు తెప్పించే సంఘటన ఒకటి చోటు చేసుకుంది. నవ్వుతో పాటు కొంతమంది క్రికెట్ అభిమానులు షాక్ కూడా అవుతారు. అసలింతకీ ఏం జరిగిందంటే.. సిల్హెట్‌లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా శనివారం న్యూజిలాండ్-ఏ, బంగ్లాదేశ్-ఏ జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు ఊహించని పని చేసింది.
వికెట్ కీపర్ ప్లేస్‌లో హెల్మెట్ ఉంచి, ఫస్ట్ స్లిప్ ప్లేస్‌లో వికెట్ కీపర్ నిల్చున్నాడు. బౌలర్ వేసిన బాల్‌ను బ్యాటర్ మిస్ చేయడంతో బాల్ వెళ్లి వికెట్ల వెనుక ఉన్న హెల్మెట్‌కు తాకింది. దీంతో అంతా షాక్ అయ్యారు. వామ్మో.. బంగ్లాదేశ్ హెల్మెట్‌తో కూడా ఫీల్డింగ్ చేయిస్తుంది కదా.. అని ఆశ్చపోయారు. ఆ తర్వాత అంపైర్ వారికి ఊహించని షాక్ ఇచ్చాడు. బంగ్లాదేశ్ బౌలర్ ఇబాదత్ హుస్సేన్ వేసిన ఇన్నింగ్స్ 5వ ఓవర్‌లో 5వ బంతిని బ్యాటర్ మిస్ చేశాడు. నిజానికి అది వికెట్ కీపర్ చేతుల్లో పడాలి కానీ, అసలు అక్కడ వికెట్ కీపర్ లేడు.
ఫస్ట్ స్లిప్ ప్లేస్‌లో నిల్చున్నాడు. పోని బాల్ పక్కనుంచి వెళ్తుంటే కనీసం దాన్ని కూడా పట్టుకోలేదు. అలాగే చూస్తూ నిల్చున్నాడు. బాల్ వెళ్లి అతను అక్కడ కింద పెట్టిన తన హెల్మెట్‌కు తగిలింది. దీంతో అంపైర్ పెనాల్టీ కింద న్యూజిలాండ్‌కు 5 రన్స్ ఇచ్చాడు. అసలు వికెట్ కీపర్ తన ప్లేస్‌లో కాకుండా ఫస్ట్ స్లిప్‌లో ఉండే ప్లేస్‌లో ఎందుకు నిల్చున్నాడో ఎవ్వరికీ అర్థం కాలేదు. క్రికెట్ పుట్టినప్పటి నుంచి ఇలాంటి సీన్ ఎవరూ చూసి ఉండరు.
What … what is the keeper doing here 🫣
This comes to you from Sylhet, where Bangladesh A played New Zealand A in a one dayer and … this happened 🤷♂️
(via T Sports/YouTube) pic.twitter.com/gV14HyK4kC
— 7Cricket (@7Cricket) May 12, 2025
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




