AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డాట్ బాల్స్‌తో పిచ్చెక్కించిన తోపు బౌలర్లు.. లిస్ట్‌లో మనోళ్లు ఇద్దరే భయ్యో.. ఫస్ట్ ప్లేస్ ఎవరిదంటే..!

Highest Dot Balls Test Cricket: టెస్ట్ క్రికెట్‌లో సహనం ఎంతో ముఖ్యం. బౌలర్లు వరుసగా డాట్ బాల్స్ వేస్తూ బ్యాటర్లపై ఒత్తిడి పెంచినప్పుడే ఊహించని వికెట్లు పడతాయని ఈ గణాంకాలు మరోసారి స్పష్టం చేస్తున్నాయి. రాబోయే మ్యాచ్‌లలో ఈ రికార్డులను కుర్ర బౌలర్లు ఏ మేరకు తిరగరాస్తారో వేచి చూడాలి.

డాట్ బాల్స్‌తో పిచ్చెక్కించిన తోపు బౌలర్లు.. లిస్ట్‌లో మనోళ్లు ఇద్దరే భయ్యో.. ఫస్ట్ ప్లేస్ ఎవరిదంటే..!
Highest Dot Balls Test Cricket
Venkata Chari
|

Updated on: Aug 15, 2026 | 1:26 PM

Share

Highest Dot Balls Test Cricket: క్రీజులో పాతుకుపోయిన బ్యాటర్లను కట్టడి చేయడంలో బౌలర్ల వ్యూహాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. 2014 నుంచి గత పుష్కర కాలంలో టెస్ట్ మ్యాచ్‌లలో అత్యధిక డాట్ బాల్స్ వేసిన దిగ్గజాల జాబితా తాజాగా తెరపైకి వచ్చింది. ఇందులో పేసర్ల ఆధిపత్యం కొనసాగుతుండగా.. మన భారత స్పిన్నర్లు సైతం అదరగొట్టారు.

లెక్కలు చూస్తే షాకే..

క్రికెట్ విశ్లేషణలో డాట్ బాల్స్ పాత్ర ఎంతో కీలకం. 2014లో యూఏఈ వేదికగా పాకిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన సిరీస్ నుంచి బౌలర్ల వ్యక్తిగత గణాంకాలైన డాట్ బాల్స్, బౌండరీల డేటా అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన 486 టెస్టుల ఆధారంగా ఈ ఆసక్తికరమైన జాబితాను రూపొందించారు. ఈ గణాంకాలలో జస్‌ప్రీత్ బుమ్రా, కగిసో రబడ, జోష్ హాజిల్‌వుడ్ లాంటి ఆధునిక బౌలర్ల పూర్తి కెరీర్ కవర్ కాగా.. జేమ్స్ అండర్సన్, ఆర్ అశ్విన్ లాంటి సీనియర్ల కెరీర్ చివరి దశ మాత్రమే నమోదైంది. కనీసం 500 ఓవర్లు బౌలింగ్ చేసిన వారిని మాత్రమే ఈ జాబితాకు ఎంపిక చేయడం గమనార్హం.

అగ్రస్థానంలో దక్షిణాఫ్రికా పేసర్.. చుక్కలు చూపించిన ఫిలాండర్..

ఈ జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ వెర్నన్ ఫిలాండర్ అగ్రస్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతడి కెరీర్‌లో ఏకంగా 81 శాతానికి పైగా డాట్ బాల్స్ నమోదు కావడం విశేషం. అంటే, ప్రతి ఓవర్‌లో దాదాపు ఐదు బంతులకు బ్యాటర్లు ఒక్క పరుగు కూడా చేయలేకపోయారు. పాకిస్థాన్ మీడియం పేసర్ మహ్మద్ అబ్బాస్, న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ కొలిన్ డి గ్రాండ్‌హోమ్ సైతం ఫిలాండర్‌కు అత్యంత చేరువలో నిలిచి సత్తా చాటారు. అబ్బాస్ 80.8 శాతం, గ్రాండ్‌హోమ్ 80.7 శాతం డాట్ బాల్స్ వేశారు. ఆ తర్వాత స్థానంలో ఇంగ్లండ్ స్వింగ్ కింగ్ జేమ్స్ అండర్సన్ కొనసాగుతున్నాడు.

ఇవి కూడా చదవండి

టాప్-10లో పేసర్లదే హవా.. భారత స్టార్ బౌలర్ల జోరు..

అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్ల జాబితాను పరిశీలిస్తే ఆద్యంతం మీడియం పేసర్లు, ఫాస్ట్ బౌలర్ల ఆధిపత్యమే స్పష్టంగా కనిపిస్తోంది. కైల్ జేమీసన్ 80.5 శాతం, మహ్మద్ ఆమిర్ 79.0 శాతంతో సత్తా చాటారు. భారత పేస్ దళపతి జస్‌ప్రీత్ బుమ్రా 78.9 శాతం డాట్ బాల్స్‌తో టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. ఆసీస్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్, వెస్టిండీస్ బౌలర్ జాసన్ హోల్డర్ సైతం 78.8 శాతంతో బుమ్రాకు గట్టి పోటీ ఇస్తున్నారు. మరో భారత పేసర్ ఇషాంత్ శర్మ 78.2 శాతంతో ఈ లిస్ట్‌లో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు.

స్పిన్ విభాగంలో అశ్విన్, జడేజాలదే ఆధిపత్యం..

సాధారణంగా టెస్టుల్లో పేసర్లతో పోలిస్తే స్పిన్నర్లు ఎక్కువ పరుగులు ఇస్తుంటారు. ఈ జాబితాలో సైతం మీడియం పేసర్ల హవానే ఉన్నప్పటికీ.. భారత స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తమ మార్క్ చూపించారు. స్పిన్నర్ల విభాగంలో అత్యుత్తమ డాట్ బాల్ శాతం నమోదు చేసిన బౌలర్లుగా వీరు సరికొత్త రికార్డు సృష్టించారు. వీరిద్దరూ ఏకంగా 75 శాతానికి పైగా డాట్ బాల్స్ వేసి ప్రత్యర్థి బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
డాట్ బాల్స్‌తో పిచ్చెక్కించిన తోపు బౌలర్లు.. ఫస్ట్ ప్లేస్ ఎవరంటే?
డాట్ బాల్స్‌తో పిచ్చెక్కించిన తోపు బౌలర్లు.. ఫస్ట్ ప్లేస్ ఎవరంటే?
వాట్సప్‌లో ఆయుష్మాన్ భారత్ పథకానికి దరఖాస్తు చేసుకోవడం ఎలా..?
వాట్సప్‌లో ఆయుష్మాన్ భారత్ పథకానికి దరఖాస్తు చేసుకోవడం ఎలా..?
బెల్లంతో సేమియా పాయసం.. పాలు విరగదు, సేమియా ముక్కలవ్వదు
బెల్లంతో సేమియా పాయసం.. పాలు విరగదు, సేమియా ముక్కలవ్వదు
చెక్క చెప్పులు పోయాయని ChatGPTనే అడిగాడు..!
చెక్క చెప్పులు పోయాయని ChatGPTనే అడిగాడు..!
నాగలోకం నిజంగా ఉందా? పురాణాల్లో వర్ణించిన సర్పరాజుల రహస్య ప్రపంచం
నాగలోకం నిజంగా ఉందా? పురాణాల్లో వర్ణించిన సర్పరాజుల రహస్య ప్రపంచం
కన్యారాశిలోకి చంద్రుడు.. ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే!
కన్యారాశిలోకి చంద్రుడు.. ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే!
బరువు తగ్గేందుకు మందులు వాడుతున్నారా..? అసలుకే ఎసరు వస్తుంది
బరువు తగ్గేందుకు మందులు వాడుతున్నారా..? అసలుకే ఎసరు వస్తుంది
ఢిల్లీ అక్షర్‌ధామ్‌లో వైభవంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ఢిల్లీ అక్షర్‌ధామ్‌లో వైభవంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ఒక్కో ఈవెంట్‏‏కు ఎంత తీసుకుంటానంటే.. జబర్దస్త్ నరేష్
ఒక్కో ఈవెంట్‏‏కు ఎంత తీసుకుంటానంటే.. జబర్దస్త్ నరేష్
సరిహద్దుల వీరుడికి ఆకాశ మార్గంలో త్రివర్ణం..!
సరిహద్దుల వీరుడికి ఆకాశ మార్గంలో త్రివర్ణం..!