గంభీర్‌తో గొడవకు దిగిన చీఫ్‌ సెలెక్టర్‌ అగార్కర్‌! ఆ ఇద్దరి గురించే అంతా..

టీమిండియా హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌, భారత చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ మధ్య గరం గరం చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఛాంపియన్స్‌ ట్రోఫీకి వెళ్లే కంటే ముందు జరిగిన టీమ్‌ మీడియాలో వీరిద్దమ మధ్య తీవ్ర వాగ్వాదం కూడా చోటు చేసుకుంది సమాచారం. దాని గురించి మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి..

గంభీర్‌తో గొడవకు దిగిన చీఫ్‌ సెలెక్టర్‌ అగార్కర్‌! ఆ ఇద్దరి గురించే అంతా..
Gautam Gambhir Ajit Agarkar

Updated on: Feb 16, 2025 | 12:20 PM

ప్రస్తుతం టీమిండియా ముందు ఉన్న ఏకైక లక్ష్యం ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలవడం. ఈ మెగా టో్నీ మరో మూడో రోజుల్లో మొదలు కానుంది. ఇప్పటికే భారత జట్టు దుబాయ్‌కు పయనమైంది. ఈ ఛాంపియన్స్‌ ట్రోఫీకి పాకిస్థాన్‌ ఆతిథ్యం ఇస్తున్నా.. టీమిండియా మ్యాచ్‌లు దుబాయ్‌లో జరుగుతాయనే విషయం తెలిసిందే. భారత జట్టును పాక్‌కు పంపేందుకు బీసీసీఐ అంగీకరించకపోవడంతో ఐసీసీ ఈ టోర్నీని హైబ్రిడ్‌ మోడల్‌లో నిర్వహిస్తోంది.

అయితే ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఎలాంటి టీమ్‌తో బరిలోకి దిగాలనే అంశంపై భారత హెడ్‌ కోచ్‌తో పాటు సెలెక్టర్లు సమావేశం అయ్యారు. ఈ సమాదేశంలో ముఖ్యంగా శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌ విషయంలోనే గంభీర్‌, అగార్కర్‌ మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. జట్టులో లెఫ్ట్‌ రైట్‌ కాంబినేషన్‌ కోసం ఈ నెల 20న బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌కు శ్రేయస్‌ అయ్యర్‌ను పక్కనపెట్టి, ఒక ప్రయోగం చేయాలని గంభీర్‌ భావిస్తున్నాడు. ఈ విషయంలో అగార్కర్‌ పూర్తిగా గంభీర్‌ను వ్యతిరేకించినట్లు సమాచారం. ఇటీవలె ఇంగ్లండ్‌తో ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లో అయ్యర్‌ మంచి ప్రదర్శన కనబర్చాడు. ఈ మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా అతి పెద్ద ప్లస్‌ ఏదైనా ఉందంటే అది మిడిలార్డర్‌ అనే చెప్పాలి. ఆ మిడిలార్డర్‌కు వెన్నెముకలా నిలిచాడు. అలాంటి ప్లేయర్‌ను పక్కనపెట్టడంలో అర్థం లేదని అగార్కర్‌ వాదించినట్లు తెలుస్తోంది.

అలాగే రిషభ్‌ పంత్‌ విషయంలో కూడా గంభీర్‌, అగార్కర్‌ మధ్య పెద్ద డిస్క్రషన్‌ నడిచినట్లు బీసీసీఐకి సంబంధించిన వ్యక్తులు తెలిపారు. ఛాంపియన్స్‌ ట్రోఫీకి జట్టును ప్రకటించిన సమయంలో చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌.. వికెట్‌ కీపర్‌ విషయంలో తమ మొదటి ఛాయిస్‌ రిషభ్‌ పంత్‌ అని తెలిపాడు. కానీ, ఛాంపియన్స్‌ ట్రోఫీకి ముందు ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో పంత్‌కు కనీసం ఒక్క మ్యాచ్‌ కూడా ఆడే అవకాశం ఇవ్వలేదు. ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం రాని ప్లేయర్‌ ఎవరంటే ఒక్క పంత్‌ మాత్రమే.

మిగతా వారికి కనీసం ఒక్క మ్యాచ్‌ అయినా ఆడే అవకాశం వచ్చింది. అలాగే ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ ముగిసిన తర్వాత గంభీర్‌ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. ఛాంపియన్స్ ట్రోఫీలో వికెట్‌ కీపర్‌గా తమ మొదటి ప్రాధాన్యత కేఎల్‌ రాహులే అని స్పష్టం చేశాడు. దీంతో పంత్‌కు ఛాంపియన్స్‌ ట్రోఫీలో కూడా ఆడే అవకాశం కష్టమే అని అర్థమైంది. కేఎల్‌ రాహుల్‌ గాయపడితే తప్ప పంత్‌ టీమ్‌లో ఉండడు. ఇలా పంత్‌, అయ్యర్‌ విషయంలో గంభీర్‌, అజిత్‌ అగార్కర్‌ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అంతిమంగా హెడ్‌ కోచ్‌ గంభీర్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఒకే మాటపై ఉండటంతో ఛాంపియన్స్‌ ట్రోఫీలో గంభీర్‌ అనకున్నదే జరుగుతుందని క్రికెట్‌ నిపుణులు అంటున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.