AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఇదేం బౌలింగ్‌ రా సామీ.. 7 వైడ్లు, 18 పరుగులు.. ఏకంగా ఓవర్‌కు 13 బంతులు.. గంభీర్ ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే

Gautam Gambhir: అర్ష్‌దీప్ వరుసగా వైడ్లు వేస్తుండటంతో డగౌట్‌లో ఉన్న భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. ఆయన కోపంతో ఊగిపోతున్న దృశ్యాలు కెమెరాలకు చిక్కాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Video: ఇదేం బౌలింగ్‌ రా సామీ.. 7 వైడ్లు, 18 పరుగులు.. ఏకంగా ఓవర్‌కు 13 బంతులు.. గంభీర్ ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే
Furious Gautam Gambhir
Venkata Chari
|

Updated on: Dec 12, 2025 | 8:03 AM

Share

Gautam Gambhir: దక్షిణాఫ్రికాతో మొహాలీలోని ముల్లన్‌పూర్‌లో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఒక చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఏకంగా ఒకే ఓవర్‌లో 13 బంతులు వేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 11వ ఓవర్ వేయడానికి వచ్చిన అర్ష్‌దీప్ సింగ్ తీవ్రంగా తడబడ్డాడు. ఆ ఓవర్ తొలి బంతిని డికాక్ సిక్సర్‌గా మలిచాడు. ఆ తర్వాత అర్ష్‌దీప్ లైన్ అండ్ లెంగ్త్ పూర్తిగా కోల్పోయాడు. ఆఫ్ స్టంప్ ఆవల బంతిని వేయడానికి ప్రయత్నిస్తూ ఏకంగా 7 వైడ్లు వేశాడు. ఆ ఓవర్‌లో మొత్తం 13 బంతులు విసిరిన అర్ష్‌దీప్, 18 పరుగులు సమర్పించుకున్నాడు.

అర్ష్‌దీప్ ఖాతాలో చెత్త రికార్డు..

ఈ ఓవర్‌తో టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో పూర్తి స్థాయి సభ్య దేశాల బౌలర్లలో ‘అత్యధిక బంతులు వేసిన ఓవర్’గా ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ నవీన్-ఉల్-హక్ రికార్డును అర్ష్‌దీప్ సమం చేశాడు. అలాగే, భారత్ తరపున ఈ ఫార్మాట్‌లో సుదీర్ఘ ఓవర్ వేసిన బౌలర్‌గా నిలిచాడు.

గంభీర్ అసహనం..

అర్ష్‌దీప్ వరుసగా వైడ్లు వేస్తుండటంతో డగౌట్‌లో ఉన్న భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. ఆయన కోపంతో ఊగిపోతున్న దృశ్యాలు కెమెరాలకు చిక్కాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మ్యాచ్ ఫలితం..

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 213 పరుగులు చేయగా, ఛేజింగ్‌లో భారత్ 162 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో దక్షిణాఫ్రికా 51 పరుగుల తేడాతో విజయం సాధించి, సిరీస్‌ను 1-1తో సమం చేసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఒక్క ఓవర్‌లో 13 బంతులు.. గంభీర్ ఎక్స్‌ప్రెషన్స్ చూశారా..
ఒక్క ఓవర్‌లో 13 బంతులు.. గంభీర్ ఎక్స్‌ప్రెషన్స్ చూశారా..
దివ్వెల మాధురి బిగ్‌బాస్ రెమ్యూనురేషన్ ఎంతో తెలుసా?
దివ్వెల మాధురి బిగ్‌బాస్ రెమ్యూనురేషన్ ఎంతో తెలుసా?
చికెన్ Vs చేప: ఆరోగ్యానికి ఏది బెస్ట్.. తినే ముందు తప్పక..
చికెన్ Vs చేప: ఆరోగ్యానికి ఏది బెస్ట్.. తినే ముందు తప్పక..
ఇక ఓయోకు వెళ్లేవారికి అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. అదేంటో తెలిస్తే..
ఇక ఓయోకు వెళ్లేవారికి అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. అదేంటో తెలిస్తే..
అన్ని పండగల కంటే బాలయ్య సినిమా రిలీజ్ పెద్ద పండగ.
అన్ని పండగల కంటే బాలయ్య సినిమా రిలీజ్ పెద్ద పండగ.
మహేష్ ఏఎంబీ సినిమాస్.. ఇప్పుడు ఇక్కడ కూడా.. త్వరలోనే ఓపెనింగ్
మహేష్ ఏఎంబీ సినిమాస్.. ఇప్పుడు ఇక్కడ కూడా.. త్వరలోనే ఓపెనింగ్
7 మ్యాచ్‌ల్లో 7 ఓటములు.. టీమిండియా చెత్త రికార్డ్..
7 మ్యాచ్‌ల్లో 7 ఓటములు.. టీమిండియా చెత్త రికార్డ్..
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. నేరుగా మీఇంటి వద్దకే క్యాలెండర్లు
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. నేరుగా మీఇంటి వద్దకే క్యాలెండర్లు
మీ జేబుకు చిల్లు పెడుతున్న 5 అలవాట్లు ఇవే.. వెంటనే ఇలా చేస్తే..
మీ జేబుకు చిల్లు పెడుతున్న 5 అలవాట్లు ఇవే.. వెంటనే ఇలా చేస్తే..
మహిళలకు షాకిస్తున్న బంగారం ధరలు.. మళ్లీ లక్షా 30 వేలు దాటేసింది!
మహిళలకు షాకిస్తున్న బంగారం ధరలు.. మళ్లీ లక్షా 30 వేలు దాటేసింది!