WPL 2023: ఢిల్లీ చిత్తు.. తొలి డబ్ల్యూపీఎల్ టైటిల్‌ను సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్..
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తొలి విజేతగా ముంబై ఇండియన్స్ నిలిచి చరిత్ర సృష్టించింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 7 వికెట్ల తేడాతో ముంబై ఘన విజయం సాధించింది..

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తొలి విజేతగా ముంబై ఇండియన్స్ నిలిచి చరిత్ర సృష్టించింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 7 వికెట్ల తేడాతో ముంబై ఘన విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ కేవలం మూడు వికెట్లు కోల్పోయి 132 విజయ లక్ష్యాన్ని ఛేదించి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మొదటి విజేతగా రికార్డు సృష్టించింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 132 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ ముందుంచింది.
ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున శిఖా పాండే 27, మిన్నుమణి రాధా27 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఛాలెంజింగ్ టార్గెట్ దిశగా స్కోరుబోర్డును తీసుకెళ్లారు. వీరితో పాటు కెప్టెన్ మెగ్ లానింగ్ కూడా 29 బంతుల్లో 35 పరుగులు చేసింది. ఇస్సీ వాంగ్ మూడు వికెట్లు పడగొట్టి ఢిల్లీ క్యాపిటల్స్ బాట్స్‌మెన్ లను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించింది. హేలీ మాథ్యూస్ మూడు వికెట్లు తీయగా, మెలీ కెర్ మారిజానే కాప్, అరుంధతిరెడ్డిలు తలో వికెట్ పడగొట్టారు.
132 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 19.3 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 134 పరుగులు చేసి నెగ్గింది. మరో 3 బంతులు మిగిలి ఉండగానే చాంపియన్ గా నిలిచింది. సెమీస్ లో అర్ధ సెంచరీతో అదరగొట్టిన నాట్ సీవర్.. 55 బంతుల్లో 7 ఫోర్లు కొట్టి 60 పరుగులు తీసి నాటౌట్ గా నిలబడి మరోసారి మ్యాచ్ విన్నర్ గా నిలిచింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్.. 39 బంతుల్లో 5 ఫోర్లు తీసి 37 పరుగులతో రాణించింది.




మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం..