Harmanpreet Kaur : వరల్డ్ కప్ గెలిచిన హర్మన్‌ప్రీత్ కౌర్కు ఊహించని షాక్.. ఐసీసీ జట్టులో నో ఛాన్స్
భారతదేశం మొట్టమొదటిసారిగా మహిళల ప్రపంచకప్ 2025ను గెలుచుకోవడంలో కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుతమైన నాయకత్వం వహించింది. అయితే, విజయం సాధించినప్పటికీ అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రకటించిన టోర్నమెంట్ ఉత్తమ జట్టులో హర్మన్‌ప్రీత్ కౌర్‌కు చోటు దక్కకపోవడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. జట్టుకు కెప్టెన్‌గా కూడా ఆమెను కాదని, ఫైనల్ ఓడిన సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ ను ఐసీసీ సెలక్ట్ చేసింది.

Harmanpreet Kaur : భారతదేశం మొట్టమొదటిసారిగా మహిళల ప్రపంచకప్ 2025ను గెలుచుకోవడంలో కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుతమైన నాయకత్వం వహించింది. అయితే, విజయం సాధించినప్పటికీ అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రకటించిన టోర్నమెంట్ ఉత్తమ జట్టులో హర్మన్‌ప్రీత్ కౌర్‌కు చోటు దక్కకపోవడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. జట్టుకు కెప్టెన్‌గా కూడా ఆమెను కాదని, ఫైనల్ ఓడిన సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ ను ఐసీసీ సెలక్ట్ చేసింది.
భారత్ మొట్టమొదటిసారిగా మహిళల ప్రపంచకప్‌ను గెలుచుకున్న తర్వాత, ఐసీసీ టోర్నమెంట్ ఉత్తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది. ఇందులో కెప్టెన్‌గా సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్‌ను సెలక్ట్ చేయడం ఆశ్చర్యం కలిగించింది. టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన రన్ మెషీన్ అయిన లారా వోల్వార్డ్ (571 పరుగులు, 71.37 సగటు) ను ఐసీసీ జట్టు కెప్టెన్‌గా సెలక్ట్ చేసింది.
కప్ గెలిచిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్కు ఈ జట్టులో స్థానం దక్కలేదు. ఆమె కేవలం 32.50 సగటుతో 260 పరుగులు మాత్రమే చేసింది, ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బ్యాటర్‌గా ఆమె ప్రదర్శన బలహీనంగా ఉండటమే ఈ నిర్ణయానికి కారణం. భారత్ నుంచి ముగ్గురు అత్యుత్తమ ఆటగాళ్లకు ఐసీసీ జట్టులో చోటు దక్కింది.
ఓపెనర్ స్మృతి మంధాన (434 పరుగులు, 54.25 సగటు), కీలక బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ (292 పరుగులు, 58.40 సగటు), ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన ఆల్‌రౌండర్ దీప్తి శర్మ (215 పరుగులు, 22 వికెట్లు) ఈ జట్టులో ఉన్నారు. సౌతాఫ్రికా నుంచి వోల్వార్డ్‌తో సహా మొత్తం ముగ్గురు (నాదిన్ డి క్లార్క్, మరిజన్నే కాప్), ఆస్ట్రేలియా నుంచి ముగ్గురు (యాష్ గార్డ్‌నర్, అనాబెల్ సదర్లాండ్, అలనా కింగ్), ఇంగ్లాండ్ నుంచి ఒకరు (సోఫీ ఎక్లెస్టోన్), పాకిస్తాన్ నుంచి ఒకరు (సిద్రా నవాజ్) ఈ జట్టులో ఉన్నారు.
జట్టు ఎంపికలో భారత వికెట్ కీపర్ రిచా ఘోష్కు చోటు దక్కకపోవడం అభిమానులను నిరాశపరిచింది. రిచా ఘోష్ 8 ఇన్నింగ్స్‌లలో 133కు పైగా స్ట్రైక్ రేట్‌తో 235 పరుగులు చేసింది. అలాగే 4 క్యాచ్‌లు కూడా పట్టింది. అయినప్పటికీ ఆమెను కాదని, కేవలం 62 పరుగులు చేసినా 8 అవుట్‌లు (4 క్యాచ్‌లు, 4 స్టంపింగ్‌లు) చేసిన పాకిస్తాన్ కీపర్ సిద్రా నవాజ్‌కు ఐసీసీ అవకాశం ఇచ్చింది. ఈ జట్టులో మరిజన్నే కాప్ (208 పరుగులు, 12 వికెట్లు), యాష్ గార్డ్‌నర్ (328 పరుగులు, 7 వికెట్లు), దీప్తి శర్మ (215 పరుగులు, 22 వికెట్లు), అనాబెల్ సదర్లాండ్ (117 పరుగులు, 17 వికెట్లు) వంటి స్ట్రాంగ్ ఆల్‌రౌండర్లకు చోటు దక్కింది.




