
ఐపీఎల్-2024 సీజన్ లో ముంబై ఇండియన్స్ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోంది. ఇప్పటివరకు 5 సార్లు ఛాంపియన్ గా నిలిచిన ఆ జట్టు మొదట ఆడిన 3 మ్యాచుల్లోనూ పరాజయం పాలైంది. అయితే ఎట్టకేలకు వరుసగా రెండు మ్యాచ్‌లు నెగ్గి మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చింది. అంతా బాగుందనుకుంటున్న తరుణంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై సంచలన ఆరోపణలు వస్తున్నాయి. అతను గాయాన్ని దాచి పెట్టి బరిలోకి దిగుతున్నాడని ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ సైమన్ డౌల్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పాండ్యా అంగీకరించడం లేదని ఆయన ఆరోపించారు. ఐపీఎల్ 2024 సీజన్ తొలి మ్యాచుల్లో మొదటి ఓవర్లలోనే బంతిని తీసుకున్న హార్దిక్ పాండ్యా ఆ తర్వాత జరిగిన మ్యాచుల్లో కేవలం ఓక్క ఓవర్ మాత్రమే వేశాడని ఆయన గుర్తు చేశారు. కచ్చితంగా పాండ్యాకు ఏదో జరిగిందని, అందుకే అతను బౌలింగ్ వేయట్లేదని డౌల్ అనుమానం వ్యక్తం చేశారు.
కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ ఎడిషన్‌లో హార్దిక్ పాండ్యా ఇప్పటివరకు 48 బంతులు ( 8 ఓవర్లు) వేశాడు. 89 పరుగులిచ్చి కేవలం ఒక వికెట్ మాత్రమే పడగొట్టాడు. అంటే ఓవర్‌కు 11.13 సగటుతో పరుగులు ఇచ్చాడన్నమాట. ఈ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన తొలి రెండు మ్యాచ్‌లలో హార్దిక్ పాండ్యా ఇన్నింగ్స్ తొలి ఓవర్ బౌలింగ్ చేశాడు. కానీ ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో పాండ్యా ఒక్క ఓవర్ కూడా వేయలేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 1 ఓవర్ మాత్రమే బౌలింగ్ చేశాడు. అంటే తొలి రెండు మ్యాచ్ ల్లో పూర్తి స్థాయి ఆల్ రౌండర్ గా కనిపించిన పాండ్యా ఆ తర్వాత బౌలింగ్ చేయకపోవడం కొత్త సందేహాలకు దారితీసింది.
Simon Doull said, “Hardik Pandya is injured, there’s something wrong. He’s not admitting it, but there’s something wrong with him for sure. That’s my gut feeling. You go out and make a statement by opening the bowling in 1st game and suddenly, you’re not required?!”. #MIvsCSK pic.twitter.com/FmkFcaPTVb
— TATA IPL 2024 Commentary #IPL2024 (@TATAIPL2024Club) April 13, 2024
భుజం నొప్పి కారణంగా హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయడానికి వెనుకాడుతున్నాడా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే అంతకుముందు కూడా, పాండ్యా తన చేతి నొప్పి సమస్యను దాచిపెట్టాడు. T20 ప్రపంచ కప్ 2021 భారత జట్టులో చోటు సంపాదించాడు. కానీ మొత్తం 4 ఓవర్లు బౌలింగ్ చేయలేకపోయాడు. ఇప్పుడు మళ్లీ బౌలింగ్‌పై విముఖత వ్యక్తం చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఎందుకంటే త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్ జట్టులో హార్దిక్ పాండ్యా చోటు దక్కించుకోవాలంటే ఆల్ రౌండర్ గా సత్తా నిరూపించుకోవాలి. అయితే ఈ 5 మ్యాచ్‌ల్లో పాండ్యా కేవలం 8 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. ఇప్పుడు తన ఫిట్‌నెస్ సమస్యను దాచిపెట్టేందుకు బౌలింగ్ నుంచి వైదొలిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంపై ముంబై కెప్టెన్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..