Hardik Pandya : మా టైం బాగోలేదు.. ఈ సీజన్ మాది కాదు.. హార్దిక్ పాండ్యా సంచలన వ్యాఖ్యలు

Hardik Pandya : చెన్నై చేతిలో ఓటమి తర్వాత ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతయ్యాయి. ఈ సీజన్ తమది కాదని హార్దిక్ పాండ్యా నిరాశ వ్యక్తం చేశాడు. ఒక దశలో 180-190 పరుగులు చేస్తుందని అనిపించింది. కానీ 10 ఓవర్ల తర్వాత స్కోరు బోర్డు నెమ్మదించింది.

Hardik Pandya : మా టైం బాగోలేదు.. ఈ సీజన్ మాది కాదు.. హార్దిక్ పాండ్యా సంచలన వ్యాఖ్యలు
Hardik Pandya

Updated on: May 03, 2026 | 11:34 AM

Hardik Pandya : ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ప్రయాణం దాదాపు ముగింపు దశకు చేరుకుంది. దశాబ్ద కాలంగా ఐపీఎల్‌ను శాసించిన ఐదుసార్లు ఛాంపియన్ ముంబై, ఈసారి మాత్రం చేతులెత్తేసింది. చిరకాల ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్ (CSK) చేతిలో ఘోర పరాజయం పాలైన తర్వాత, ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన నిరాశను బాహాటంగానే వ్యక్తం చేశాడు. ప్లేఆఫ్స్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించిన తరుణంలో, ఈ సీజన్ తమకు అస్సలు కలిసి రాలేదని అతను అంగీకరించాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి అనంతరం హార్దిక్ పాండ్యా చాలా గంభీరంగా కనిపించాడు. “ఇది కేవలం ఒక రాత్రి జరిగిన ఓటమి మాత్రమే కాదు, ఈ సీజన్ మొత్తమే మాకు కలిసి రావడం లేదు” అంటూ అతను బాహాటంగానే వ్యాఖ్యానించాడు. ఇప్పటివరకు ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో ముంబై ఏకంగా ఏడు ఓటములను చవిచూసింది. ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన ఐదు మ్యాచ్‌ల్లోనూ భారీ విజయాలు సాధించాల్సి ఉండటంతో, పరిస్థితి చేయి దాటిపోయిందని హార్దిక్ మాటల్లో స్పష్టమైంది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై, ఒక దశలో 180-190 పరుగులు చేస్తుందని అనిపించింది. కానీ 10 ఓవర్ల తర్వాత స్కోరు బోర్డు నెమ్మదించింది. ఫినిషింగ్ లో వేగంగా పరుగులు రాబట్టడంలో ముంబై బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. 160 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చెన్నై చాలా ఈజీగా ఛేదించింది. “చెన్నై ఆటగాళ్లు అన్ని విభాగాల్లోనూ మకంటే మెరుగ్గా రాణించారు. వారు తెలివైన క్రికెట్ ఆడారు, మేము మాత్రం కనీసం పోరాటం కూడా ఇవ్వలేకపోయాం” అని హార్దిక్ ఒప్పుకున్నాడు.

చెన్నై బ్యాటింగ్ లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (67 నాటౌట్) మరోసారి తన క్లాస్ చూపించగా, యువ ఆటగాడు కార్తీక్ శర్మ (54 నాటౌట్) తన తొలి ఐపీఎల్ హాఫ్ సెంచరీతో ముంబై బౌలర్లను ఆడుకున్నాడు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 98 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కార్తీక్ శర్మ కేవలం 20 ఏళ్ల వయస్సులోనే ఈ ఘనత సాధించి, చెన్నై తరఫున అతి చిన్న వయస్సులో హాఫ్ సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ముంబై బౌలింగ్ విభాగంలో బుమ్రా తప్ప మిగిలిన వారెవరూ ప్రభావం చూపలేకపోయారు.

చెన్నై సూపర్ కింగ్స్ కు ముంబై ఇండియన్స్ పై ఇది అతిపెద్ద విజయాల్లో ఒకటి. 2014, 2023 తర్వాత ఒకే సీజన్ లో రెండుసార్లు ముంబైని ఓడించడం (లీగ్ డబుల్) ఇది మూడోసారి. ఈ విజయంతో చెన్నై ప్లేఆఫ్స్ రేసులో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోగా, ముంబై మాత్రం పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ ను నియమించినప్పటి నుంచి ముంబై టీమ్ లో విభేదాలు ఉన్నాయని, అదే మైదానంలో కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

 

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us