HBD Jasprit Bumrah: ఇదేం బౌలింగ్ అంటూ విమర్శలు.. కట్‌చేస్తే.. రికార్డుల వర్షంతో కౌంటరిచ్చిన టీమిండియా యార్కర్ కింగ్..

Happy Birthday Jasprit Bumrah: 018 సంవత్సరాన్ని జస్ప్రీత్ బుమ్రా కెరీర్‌లో అత్యుత్తమ సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఆ ఏడాది ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా పర్యటనల్లో ఆడిన టెస్టు మ్యాచ్‌ల్లో ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన ఘనత సాధించాడు. దీంతో ఒక క్యాలెండర్ ఇయర్‌లో మూడు దేశాల్లో ఈ ఘనత సాధించిన తొలి భారత బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. అంతేకాకుండా, భారత బౌలర్‌గా తన అరంగేట్రం టెస్టులో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా బుమ్రా నంబర్-1 స్థానంలో ఉన్నాడు.

HBD Jasprit Bumrah: ఇదేం బౌలింగ్ అంటూ విమర్శలు.. కట్‌చేస్తే.. రికార్డుల వర్షంతో కౌంటరిచ్చిన టీమిండియా యార్కర్ కింగ్..
Happy Birthday Jasprit Bumr

Updated on: Dec 06, 2023 | 10:40 AM

Happy Birthday Jasprit Bumrah: భారత క్రికెట్ జట్టు యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా ఈరోజు తన 30వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. తన షార్ప్ బౌలింగ్‌తో బుమ్రా ఇండియన్ ప్రీమియర్ లీగ్, టీమ్ ఇండియాలోనే కాకుండా ప్రపంచ క్రికెట్‌లో కూడా పేరు సంపాదించాడు.

అతి తక్కువ సమయంలో భారత జట్టుకు అత్యంత ముఖ్యమైన బౌలర్‌గా మారిన బుమ్రా.. ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో 11 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు పడగొట్టాడు. భారత్‌ను ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం 30 ఏళ్ల వయసులో ఉన్న బుమ్రా క్రికెట్ ప్రపంచంలో కొన్ని అద్భుతమైన రికార్డులు సృష్టించాడు.

ఇవి కూడా చదవండి

భారత టెస్టు క్రికెట్ చరిత్రలో హ్యాట్రిక్ వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా జస్ప్రీత్ బుమ్రా నిలిచాడు. 2019 వెస్టిండీస్ పర్యటనలో, జమైకా మైదానంలో జరిగిన సిరీస్‌లోని రెండవ టెస్టులో బుమ్రా ఈ ఘనత సాధించాడు.

ఇందులో బుమ్రా వరుసగా మూడు బంతుల్లో డారెన్ బ్రావో, షమ్రా బ్రూక్స్, రోస్టన్ చేజ్‌లను పెవిలియన్ చేర్చాడు. బుమ్రా ఫాస్ట్ బౌలర్‌గానే కాకుండా టెస్టు క్రికెట్‌లో బ్యాట్‌తో కూడా రికార్డులు సృష్టించాడు.

2022లో బర్మింగ్‌హామ్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఓవర్‌లో బుమ్రా 35 పరుగులు చేశాడు. ఇప్పటివరకు టెస్టు క్రికెట్‌లో ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇదే కావడం గమనార్హం.

అలాగే, 2019లోనే బుమ్రా వన్డే ఫార్మాట్‌లో 100 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన 21వ భారత బౌలర్‌గా నిలవడంతో పాటు, అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న రెండో భారత బౌలర్‌గా కూడా నిలిచాడు.

2018 సంవత్సరాన్ని జస్ప్రీత్ బుమ్రా కెరీర్‌లో అత్యుత్తమ సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఆ ఏడాది ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా పర్యటనల్లో ఆడిన టెస్టు మ్యాచ్‌ల్లో ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన ఘనత సాధించాడు. దీంతో ఒక క్యాలెండర్ ఇయర్‌లో మూడు దేశాల్లో ఈ ఘనత సాధించిన తొలి భారత బౌలర్‌గా బుమ్రా నిలిచాడు.

అంతేకాకుండా, భారత బౌలర్‌గా తన అరంగేట్రం టెస్టులో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా బుమ్రా నంబర్-1 స్థానంలో ఉన్నాడు. బుమ్రా 2018లో టెస్టుల్లో అరంగేట్రం చేసి ఆ ఏడాది మొత్తం 48 వికెట్లు పడగొట్టాడు. ఇలా చేయడం ద్వారా, అతను 1979లో అరంగేట్రం చేసిన టెస్టు సంవత్సరంలోనే మొత్తం 40 వికెట్లు తీసిన భారత మాజీ ఆటగాడు దిలీప్ దోషి రికార్డును బద్దలు కొట్టాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..