ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా నేడు జరుగుతున్న 16వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జెయింట్స్ తలపడుతున్నాయి. బ్రబౌర్న్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ స్నేహ రాణా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అనంతరం ఆమె మాట్లాడుతూ ‘మేం మొదట బ్యాటింగ్ చేస్తాం. ఈ పిచ్‌పై ఇప్పటికే చాలా మ్యాచులు ఆడారు. దాంతో పిచ్ నెమ్మదించింది. ఇక మా జట్టులో మాన్సీ స్థానంలో మేఘన వచ్చింది. అమ్మాయిలు చాలా బాగా ఆడుతున్నారు. పాజిటివ్ యాటిట్యూడ్‌తో ఉన్నారు. వికెట్లో కొంత మార్పు వచ్చినా 160-165 మంచి స్కోరే అనిపిస్తోంది’ అని స్నేహ రాణా తెలిపింది. ఆపై బెంగళూరు కెప్టెన్ స్మృతి మంధాన ‘టాస్ వల్ల గెలుపోటముల అవకాశం 50-50 లేదా 60-40గా ఉంటుందో లేదో తెలియదు. మ్యాచులు గెలిస్తే టాస్ ఓడినా బాధపడం. ఏదేమైనా మేం మొదట ఫీల్డింగే చేయాలనుకున్నాం. టార్గెట్ సెట్ చేయడం కన్నా ఛేదన బాగా చేస్తున్నాం. మేము కూడా జట్టులో మార్పు చేసి రేణుక స్థానంలో ప్రీతీని తీసుకున్నాం’ అని పేర్కొంది.
? Toss Update ?@GujaratGiants win the toss and elect to bat first against @RCBTweets.
ఇవి కూడా చదవండిFollow the match ▶️ https://t.co/uTxwwRnRxl#TATAWPL | #RCBvGG pic.twitter.com/iMGuZlYJEg
— Women’s Premier League (WPL) (@wplt20) March 18, 2023
మరోవైపు గుజరాత్, బెంగళూరు జట్లు ఒకేరీతిలో టోర్నీలో ఆడుతున్నాయి. ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్‌లలో 2 విజయాలనే గుజరాత్ సాధించగా.. మంధాన సేన ఆరు మ్యాచ్‌లకు ఒక విజయాన్నే అందుకుంది. ఈ పరిస్థితిలో ఈ మ్యాచ్ రెండు జట్లకు కీలకంగా మారింది. ముఖ్యంగా బెంగాళురు జట్టు టోర్నీలో ముందుకు సాగేందుకు ఇది మంధాన సేనకు డూ ఆర్ డై మ్యాచ్ అని చెప్పుకోవాలి. అలాగే బెంగళూరు టీమ్ డబ్య్లూపీఎల్ పాయింట్ల పట్టికలో అట్టడగున ఉంది.
తుది జట్లు ఇవే:
గుజరాత్ జెయింట్స్: సోఫీ డంక్లీ, లారా, హర్లీన్ డియోల్, యాష్లే గార్డ్‌నర్, సుష్మా వర్మ, దయాలన్ హేమలత, అశ్వనీ, స్నేహ రాణా, తనుజా కన్వార్, కిమ్ గార్త్, మేఘన
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: స్మృతి మంధాన, సోఫీ డివైన్, ఎలిస్ పెర్రీ, హీథర్ నైట్, రిచా ఘోష్, శ్రేయాంక పాటిల్, దిశా కసత్, మేఘన్ షూట్, ప్రీతీ, ఆశా శోభన, కనిక అహుజా
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..