AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: ఈ బాలుడిని గుర్తు పట్టారా? టీమిండియా ప్రపంచకప్ కలను తీర్చిన స్టార్ క్రికెటర్..

పై ఫొటోలోని బాలుడిని గుర్తు పట్టారా? చిన్న వయసులో కప్ గెల్చకుని పోజులిచ్చిన ఆ కుర్రాడు ఇప్పుడు భారత జట్టుకు ఏకంగా టీ20 ప్రపంచ కప్ తీసుకొచ్చాడు. అలా  కొన్ని రోజుల క్రితం వరకు తీవ్ర అవమానాలు, విమర్శలు ఎదుర్కొన్న అతను ఇప్పుడు భారత క్రికెట్ అభిమానుల దృష్టిలో హీరోగా మారిపోయాడు. అప్పుడు అతనిని తిట్టిన ప్రతి నోరు ఇప్పుడు హీరో అంటూ ప్రశంసిస్తోంది.

Team India: ఈ బాలుడిని గుర్తు పట్టారా? టీమిండియా ప్రపంచకప్ కలను తీర్చిన స్టార్ క్రికెటర్..
Team India Cricketer Childhood Photo
Basha Shek
|

Updated on: Jul 06, 2024 | 4:03 PM

Share

పై ఫొటోలోని బాలుడిని గుర్తు పట్టారా? చిన్న వయసులో కప్ గెల్చకుని పోజులిచ్చిన ఆ కుర్రాడు ఇప్పుడు భారత జట్టుకు ఏకంగా టీ20 ప్రపంచ కప్ తీసుకొచ్చాడు. అలా  కొన్ని రోజుల క్రితం వరకు తీవ్ర అవమానాలు, విమర్శలు ఎదుర్కొన్న అతను ఇప్పుడు భారత క్రికెట్ అభిమానుల దృష్టిలో హీరోగా మారిపోయాడు. అప్పుడు అతనిని తిట్టిన ప్రతి నోరు ఇప్పుడు హీరో అంటూ ప్రశంసిస్తోంది. ఐపీఎల్ లో అట్టర్ ప్లాఫ్ అయిన ఈ ప్లేయర్ ప్రపంచకప్ లో ఎలా రాణిస్తాడోనని అభిమానులు అందోళన చెంద సాగారు. కానీ వాటన్నిటినీ పటాపంచలు చేశాడీ క్రికెటర్. తన ఆల్ రౌండ్ పెర్ఫామెన్స్ తో సుమారు 17 ఏళ్ల తర్వాత భారత్ కు టీ20 ప్రపంచకప్ అందించాడు. ముఖ్యంగా ఫైనల్ లో అతని బౌలింగ్ అద్భుతం. ఓటమి కోరల్లో చిక్కుకున్నటీమిండియాను గెలుపు ఒడ్డున పడేసిన ఘనత అతనికే సొంతం. మరి ఆ ప్లేయర్ ఎవరో ఈ పాటికే అర్థమై ఉంటుంది. యస్. ఈ పిల్లాడు మరెవరో కాదు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా. ఇది అతని చిన్న నాటి ఫొటో. హార్దిక్ సోదరుడు కృనాల్ పాండ్యా ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో అది కాస్తా నెట్టింట వైరల్ గా మారింది.

కాగా ఐపీఎల్-17లో రోహిత్ శర్మ స్థానంలో ముంబయి కెప్టెన్ అయినప్పుడు హార్దిక్ పట్ల సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ జరిగింది. ముంబై ఇండియన్స్, రోహిత్ అభిమానులు అతనిని దారుణంగా దూషించారు. దీనికి తోడు వ్యక్తిగత జీవితంలోనూ హార్దిక్ కు ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే పోరాటయోధుడిలా అన్నిటినీ అధిగమించాడీ స్టార్ ఆల్ రౌండర్. తన అద్భుత ప్రదర్శనతో భారత్ ప్రపంచకప్ కలను సాకారం చేశాడు.

ఇవి కూడా చదవండి

blockquote class=”twitter-tweet”>

My #1! Everything I do, I do for you ❤️❤️❤️ pic.twitter.com/g7KUzKgbAz

— hardik pandya (@hardikpandya7) July 5, 2024

ఈ సందర్భంగా కృనాల్ పాండ్యా సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. అందులో హార్దిక్ పాండ్యాక గురించి కొన్ని ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. ‘హార్దిక్ కు ఎల్లప్పుడూ దేశం మొదటి స్థానంలో ఉంటుంది. బరోడా నుంచి వచ్చిన ఒక యువకుడికి తన జట్టు ప్రపంచ కప్ గెలవడానికి సహాయం చేయడం కంటే పెద్ద విజయం మరొకటి ఉండదు. హార్దిక్.. నేను మీ సోదరుడిగా చాలా గర్వపడుతున్నాను. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. నా బచ్చూ.. నీ మీద నాకు అపారమైన గౌరవం ఉంది’ అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది.

కృనాల్ పాండ్యా ఎమోషనల్ పోస్ట్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..