IND vs PAK: నేడు భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్.. దిగ్గజాల హోరాహోరీ పోరు.. ఎక్కడంటే?

World Championship of Legends 2024: మాజీ క్రికెటర్ల మధ్య వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నమెంట్ ఇంగ్లాండ్‌లో జరుగుతోంది. ఈ టోర్నీలో భారత్, ఇంగ్లండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఆస్ట్రేలియా సహా మొత్తం 6 జట్లు తలపడుతున్నాయి. ఇక్కడ భారత ఛాంపియన్స్ జట్టుకు యువరాజ్ సింగ్ నాయకత్వం వహించడం విశేషం.

IND vs PAK: నేడు భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్.. దిగ్గజాల హోరాహోరీ పోరు.. ఎక్కడంటే?
Ind Vs Pak
Follow us
Venkata Chari

|

Updated on: Jul 06, 2024 | 1:20 PM

India Champions Vs Pakistan Champions: వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL 2024) T20 టోర్నమెంట్‌లో 8వ మ్యాచ్‌లో, ఇండియా ఛాంపియన్స్ వర్సెస్ పాకిస్తాన్ ఛాంపియన్స్ తలపడనున్నాయి. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠగా మారింది. ఎందుకంటే రెండు జట్లలోనూ లెజెండ్స్ ఆటగాళ్లు ఉన్నారు. కాబట్టి ఈ మ్యాచ్‌లో హోరాహోరీ పోటీ తప్పదని తెలుస్తోంది.

ఈ మ్యాచ్‌లో భారత జట్టుకు యువరాజ్ సింగ్ నాయకత్వం వహిస్తుండగా, పాక్ జట్టుకు యూనిస్ ఖాన్ నాయకత్వం వహించనున్నాడు. అలాగే భారత ఛాంపియన్స్ జట్టులో రాబిన్ ఉతప్ప, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్, సురేశ్ రైనా, యూసుఫ్ పఠాన్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు.

అలాగే షాహిద్ అఫ్రిది, షోయబ్ మాలిక్, మిస్బా ఉల్ హక్, అబ్దుల్ రజాక్ వంటి అత్యుత్తమ క్రికెటర్లు పాకిస్థాన్ ఛాంపియన్స్ జట్టులో కనిపించారు. దీంతో ఛాంపియన్‌ జట్ల మధ్య జరిగే ఈ పోరులో భారీ పోరు తప్పదని భావిస్తున్నారు.

మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?

ఇండియా ఛాంపియన్స్ vs పాకిస్తాన్ ఛాంపియన్స్ మధ్య T20 మ్యాచ్ IST రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతుంది.

ఏ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం?

ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ ఛానెల్‌లో వీక్షించవచ్చు. అలాగే, ఫ్యాన్‌కోడ్ యాప్‌లో ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది.

రెండు జట్లు:

భారత ఛాంపియన్స్ జట్టు: రాబిన్ ఉతప్ప, నమన్ ఓజా (వికెట్ కీపర్), సురేశ్ రైనా, యువరాజ్ సింగ్ (కెప్టెన్), గురుకీరత్ సింగ్ మాన్, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, వినయ్ కుమార్, హర్భజన్ సింగ్, ధవల్ కులకర్ణి, రాహుల్ శుక్లా, ఆర్పీ సింగ్, సౌరభ్ తివారీ , అనురీత్ సింగ్, రాహుల్ శర్మ, అంబటి రాయుడు, పవన్ నేగి.

పాకిస్థాన్ ఛాంపియన్స్ జట్టు: కమ్రాన్ అక్మల్ (వికెట్ కీపర్), షర్జీల్ ఖాన్, సోహైబ్ మక్సూద్, షోయబ్ మాలిక్, యూనిస్ ఖాన్ (కెప్టెన్), మిస్బా ఉల్ హక్, షాహిద్ అఫ్రిది, అబ్దుల్ రజాక్, అమీర్ యామిన్, వహాబ్ రియాజ్, సయీద్ అజ్మల్, తౌఫీక్ ఉమర్, , యాసిర్ అరాఫత్, సోహైల్ తన్వీర్, సోహైల్ ఖాన్, ఉమర్ అక్మల్, తన్వీర్ అహ్మద్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..