GT vs RCB Score: ఫామ్‌లోకి వచ్చిన విరాట్‌.. గుజరాత్‌ టార్గెట్‌ 171 పరుగులు..

|

Apr 30, 2022 | 5:41 PM

Gujarat Titans vs Royal Challengers Bangalore Score: వరుస ఓటమిల తర్వాత ఎలాగైనా విజయాన్ని అందుకోవాలనే పట్టుదలతో ఉన్న బెంగళూరు టీమ్‌, గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో రాణించింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు..

GT vs RCB Score: ఫామ్‌లోకి వచ్చిన విరాట్‌.. గుజరాత్‌ టార్గెట్‌ 171 పరుగులు..
Follow us on

Gujarat Titans vs Royal Challengers Bangalore Score: వరుస ఓటమిల తర్వాత ఎలాగైనా విజయాన్ని అందుకోవాలనే పట్టుదలతో ఉన్న బెంగళూరు టీమ్‌, గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో రాణించింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 170 పరుగులు చేసింది. గడిచిని రెండు మ్యాచ్‌ల్లో డకౌట్‌ అయ్యి నిరాశ పరిచిన కోహ్లీ ఈ మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. రజత్‌ పటీదార్‌తో కలిసి మంచి భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేశాడు. వీరిద్దరు 74 బంతుల్లో 99 పరుగులు చేసి జట్టు స్కోర్‌ పెంచారు. అయితే విరాట్‌ 58 పరుగుల వద్ద అవుట్‌ అయిన తర్వాత జట్టు స్కోరు నెమ్మదించింది. కోహ్లీ అవుట్‌ అయిన తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది.

రజత్‌ పటీదార్‌ కూడా 52 పరుగులకే వెనుదిరగడంతో స్కోర్‌ బోర్డ్‌ నెమ్మదించింది. కోహ్లీ, రజత్‌ పటీదార్‌లలో ఏ ఒక్కరు క్రీజులో నిలకడగా ఉన్నా బెంగళూరు జట్టు స్కోర్‌ ఇంకా భారీగా పెరిగేది. ఇక గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ 18 బంతుల్లో 33 పరుగులు చేసి జట్టుస్కోరు పెంచుతున్నాడని అనుకుంటోన్న సమయంలో అవుట్‌ అయ్యాడు. దీంతో 170 పరుగులు చేసింది. అయితే 171 పరుగుల లక్ష్యం చిన్నది కాకపోయినప్పటికీ, ఫుల్‌ ఫామ్‌లో ఉన్న గుజరాత్‌కు మాత్రం అంత కష్టమైన లక్ష్యం కాదని చెప్పాలి. మరి బెంగళూరు ఇచ్చిన లక్ష్యాన్ని గుజరాత్‌ చేధిస్తుందో లేదో చూడాలి. ఇక బౌలింగ్ విషయానికొస్తే.. ప్రదీప్‌ సాంగ్వాన్‌ 4 ఓవర్లు వేసి 19 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. మహ్మద్‌ షమీ, జోసఫ్‌, రషీద్‌ ఖాన్‌, లాకీ ఫెర్గూసన్ ఒక్కో వికెట్‌ తీసుకున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: Climate change: వెన్నులో వణుకు పుట్టించే న్యూస్.. 2070నాటికి భూమ్మీద నివసించలేని పరిస్థితి!

Tamil Nadu: రోడ్డును బ్లాక్ చేసిన ఏనుగు.. అంబులెన్స్‌లో ప్రసవించిన మహిళ.. తల్లి, బిడ్డ క్షేమం

Tamil Nadu: రోడ్డును బ్లాక్ చేసిన ఏనుగు.. అంబులెన్స్‌లో ప్రసవించిన మహిళ.. తల్లి, బిడ్డ క్షేమం